వైరల్‌ : పార్క్‌లో కుటుంబంపై బౌన్సర్ల వీరంగం | Bouncers thrash A Family Over Ride Issue In Kanpur Park | Sakshi
Sakshi News home page

వైరల్‌ : పార్క్‌లో కుటుంబంపై బౌన్సర్ల వీరంగం

Published Mon, Jul 2 2018 7:01 PM | Last Updated on Mon, Jul 2 2018 8:27 PM

Bouncers thrash A Family Over Ride Issue In Kanpur Park - Sakshi

కాన్పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. సోమవారం సరదాగా కాన్పూర్‌లోని బ్లూ వరల్డ్‌ థీమ్‌ వాటర్‌ పార్క్‌కు వెళ్లిన ఓ కుటుంబంపై బౌన్సర్లు విరుచుకుపడ్డారు. పార్క్‌లో అనుమతి లేకుండా రైడ్‌ చేశారని ఆరోపిస్తూ బౌన్సర్లు ఆ కుటుంబంతో వాగ్యూద్ధానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. బౌన్సర్లు  ఆ కుటుంబ సభ్యులను కిందపడేసి మరి పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆ కుటుంబానికి చెందిన మహిళ జుట్టు పట్టి లాగుతూ అమానుశంగా దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వారు ఏం చర్చించారో స్పష్టంగా లేకపోయినప్పటికీ.. వారి మధ్య అసభ్యకరమైన దూషణలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement