
హైదరాబాద్: ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన ఓ వైద్యుడిపై నేరుగా వెళ్లి మరీ చర్యలు తీసుకున్నారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ లంచం డిమాండ్ చేస్తున్నారని కొందరు బాధితులు మంత్రి హరీష్‌రావుకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీలకు వెళ్లిన ఆయన.. వివరాలు తెలుసుకుని సదరు డాక్టర్‌పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని సిబ్బంది హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రి అంతా పరిశీలించి.. పేషెంట్లతో మాట్లాడారు.
మంత్రి @trsharish గారు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. pic.twitter.com/pVfy3Dm1ce
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022