స్విమ్మింగ్‌పూల్‌లో బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీటమునిగి మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు అరండల్‌పేటకు చెందిన చావలి పృథ్వీరాజ్ యాదవ్(31) బేగంపేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
ఆయన కొండాపూర్ ఆనంద్‌నగర్‌లోని తులీప్ లీ పార్క్ గృహ సముదాయంలోని ఒక ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. చెన్నయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజ నీర్‌గా పనిచేస్తున్న సోదరుడు కల్యాణ్‌చక్రవర్తి గురువారం పృథ్వీరాజ్ ఇంటికి రాగా.. సాయంత్రం ఇద్దరూ కలిసి తులీప్ లీ పార్కులోని స్విమ్మింగ్‌పూల్‌కు ఈతకెళ్లారు. ఈ సందర్భంగా ఈత కొడుతూ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేశారు. కొద్దిసేపటి తరువాత చూసిన కల్యాణ్‌కు పృథ్వీరాజ్ కనిపించలేదు. అనుమానమొచ్చి స్విమ్మింగ్‌పూల్‌లోకి చూడగా పృథ్వీరాజ్ నీటిలో మునిగిపోయి కనిపించారు.
వెంటనే అతన్ని మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తుం డగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లి నీటిలో మునగడంతో మరణించినట్టు భావి స్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, మూడు నెలల బాబు ఉన్నారు. మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
Published Sat, Aug 17 2013 12:59 AM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM
Advertisement