రోడ్డు ప్రమాదంలో యువతి మృతి | scooty turtle in kondapur, techie died | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

Published Fri, Dec 2 2016 12:01 PM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

scooty turtle in kondapur, techie died

హైదరాబాద్: కొండాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మాదాపూర్‌లోని మెరీడియల్ స్కూల్‌లో ఆయాగా పనిచేస్తున్న నవీన(19) తన స్కూటీపై విధులకు బయలుదేరింది. ఆర్‌టీఏ కార్యాలయం వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
 
కిందపడిన ఆమెను వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. తల నుజునుజ్జు కావటంతో నవీన అక్కడికక్కడే చనిపోయింది. ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement