
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే పూర్తి బిన్నంగా వాతావరణం చల్లబడింది. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, మల్కాజ్‌గిరి, మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Heavy Downpour In Hafeezpet ~Kondapur Road⛈️#HyderabadRains pic.twitter.com/cGDmwSrbyL
— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2022
హైదరాబాద్ లో భారీ వర్షం #HyderabadRains pic.twitter.com/K5RT6oTJm3
— Latha (@LathaReddy704) September 6, 2022