పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన తాళ్ల రవి ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌తో కలిసి 2011 జనవరి 16న మాదాపూర్‌లోని ...
సిటీబ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన తాళ్ల రవి ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌తో కలిసి 2011 జనవరి 16న మాదాపూర్‌లోని సూరజ్ బార్ ముందు ఇండికా కారును దొంగిలించారు. అదే రోజు రాత్రి కారులో వచ్చి కొండాపూర్ సిలికాన్ వ్యాలీ ముందు మారుతి వ్యాన్‌పై దాడిచేసి రూ.36 లక్షలు దోచుకొని ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయారు. అదే గ్యాంగ్ 2011 అక్టోబర్ 5న అయ్యప్ప సొసైటీలో ఇండికా కారును దొంగిలించారు. మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు కొండాపూర్‌లోని బాలాజి వైన్స్ ముందుకు వచ్చారు.
అప్పటికే అప్రమత్తమైన పోలీసులు దుండగుల కారును గుర్తించి వెంబడించారు. పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. అప్పటి మాదాపూర్ ఎస్‌ఐ శివ కుమార్ ఎదురు కాల్పులు జరపడంతో తాళ్ల రవి కడుపులో బుల్లెట్ దిగి... పోలీసులకు చిక్కాడు. దీంతో సైబరాబాద్‌లో దోపిడీకేసులు ఓ కొలిక్కి వచ్చాయి. ముందస్తు సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మీర్జా గ్యాంగ్‌ను పట్టుకోకుంటే కొండాపూర్ ఘటనే పునరావృతమయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.