కొండాపూర్‌లో ‘స్వైన్’కలకలం
మిరుదొడ్డి: మండలంలోని కొండాపూర్‌లో ‘స్వైన్ ఫ్లూ’ కలకలం సృష్టించింది. కొండాపూర్‌కు చెందిన భీమరి నర్సింహులుకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కాగా, అతని భార్య, కూతురుకు కూడా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన వైద్యులు ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. భీమరి నర్సింహులు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కొన్నిరోజులుగా హృద్రోగ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న నర్సింహులు రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు అతన్ని సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఈనెల 25న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు నర్సింహులుకు పరీక్షలు నిర్వహించి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పీహెచ్‌సీ డా. సునీతతో పాటు వైద్య సిబ్బంది సోమవారం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్న నర్సింహులు భార్య వసంతను, కూతురు నిహారికకు పరీక్షలు నిర్వహించారు. తల్లీకూతుళ్లకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంతేకాకుండా న ర్సింహులు ఇంటి పరిసరాల్లోని కుటుంబాల వద్దకు వెళ్లి వ్యాధి లక్షణాలపై ఆరా తీశారు. అనంతరం వైద్య బృందం గ్రావృుంలో ఇంటింటికీ తిరుగుతూ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. జ్వరం, జలుబు, ఎడతె రిపి లేకుండా వచ్చే దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడేవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.