Gandhi Hospital Secunderabad
-
18 ఏళ్ల లోపు వారికి త్వరలో టీకా
గాంధీఆస్పత్రి/బౌద్ధనగర్ (హైదరాబాద్): కరోనా నియంత్రణకు త్వరితగతిన ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిని సోమవారం సందర్శించిన ఆయన కోవిడ్ వార్డులో బాధితులను పరామర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటివరకు 58 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామన్నారు. తెలంగాణకు 1.68 కోట్ల డోసులు కేంద్రం అందించిందని, మరో 13 లక్షల 18 వేల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. 18 ఏళ్ల వయసు లోపు వారికి కోవిడ్ టీకా ట్రయల్‌రన్ సక్సెస్ అయిందని, త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. సికింద్రాబాద్‌లోని 19 వ్యాక్సిన్ సెంటర్లలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తన ఎంపీ ల్యాడ్స్ నిధులు నుంచి రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా తీవ్రత ఇలాగే కొనసాగితే ప్రతినెల 5 కిలోల ఉచిత బియ్యం పథకం కొనసాగించేందుకు ప్రధాని సుముఖత వ్యక్తం చేశారన్నారు. కాగా, ఇటీవల జరిగిన జన ఆశీర్వాద యాత్రలో కారు డోరు తగిలి నుదుటికి అయిన గాయానికి కేంద్రమంత్రి గాంధీఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం బ్లాక్‌ఫంగస్, కోవిడ్ వార్డులను సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజారావు, డిప్యూటీ నర్సింహరావు నేత, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆర్ఎంఓ నరేందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బౌద్ధనగర్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం సందర్శించారు. -
Gandhi Hospital: హే గాంధీ!
సికింద్రాబాద్: పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయం వంటి గాంధీ ధర్మాస్పత్రిలో ఇరువురు మహిళలపై అఘాయిత్యం జరిగిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన ఒక మహిళ స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఆస్పత్రి ఆవరణలో స్పృహలేకుండా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరో మహిళ ఆచూకీ సోమవారం రాత్రి వరకు లభించలేదు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్ జిల్లా వేపురిగేరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు అటెండెంట్లుగా ఆయన భార్య, మరదలు(భార్య సోదరి) గాంధీ ఆస్పత్రికి వచ్చారు. గాంధీ ఆస్పత్రి ఉద్యోగి అయిన జేఎస్సీ ఉమామహేశ్వర్ రోగికి బంధువు అవుతాడు. ఇంతకాలం ఆస్పత్రి రేడియాలజీ విభాగంలో ఉద్యోగం చేసిన ఉమామహేశ్వర్ ఇటీవలే రిసెప్షన్‌కు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో అటెండెంట్లుగా ఉంటున్న ఇరువురు మహిళలు ఈ నెల 8 నుంచి కనిపించకుండా పోయారు. తన తల్లితో పాటు చిన్నమ్మ కనిపించకపోడంతో రోగి కుమారుడు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. 11న ఆ వ్యక్తి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాడు. ఈ నెల 15న మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆ వ్యక్తి కుమారుడు తమకు బంధువైన ఉమామహేశ్వర్‌తో కలసి గాంధీ పరిసరాల్లో వెతకగా, ఆస్పత్రి భవనం సమీపంలోని చెట్ల పొదల్లో అతడి చిన్నమ్మ స్పృహలేకుండా, వివస్త్రగా కనిపించింది. చిన్నమ్మను తమ గ్రామానికి తీసుకెళ్లి ఆరా తీయగా, ఉమామహేశ్వర్ అతడి స్నేహితులు తనకు, సోదరికి మత్తు కలిపిన మద్యం ఇచ్చి కిడ్నాప్ చేశారని తెలిపింది. ఆస్పత్రిలోని సెల్లార్లో బంధించి తనపై వారు అత్యాచారం చేశారని వెల్లడించింది. తాను తప్పించుకుని బయటపడ్డానని, అయితే తన సోదరి ఎక్కడ ఉందో తెలియట్లేదని మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. గాంధీ ఆస్పత్రి తమ పరిధి కాదని పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి చిలకలగూడ పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. నాలుగు బృందాలు ఏర్పాటు: ఏసీపీ వెంకటరమణ గాంధీ అత్యాచారం ఘటనకు సంబంధించి దర్యాప్తు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్టు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ తెలిపారు. గాంధీలో చికిత్స తీసుకున్న రోగి భార్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. బాధితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించడం కోసం ఆమెను భరోసా కేంద్రానికి పంపించామన్నారు. వివరాలు రాగానే దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తామన్నారు. అత్యాచారం ఘటన గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోనే జరిగిందా లేదా బయట జరిగిందా అన్న విషయాలపై దర్మాప్తు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. పోలీసుల అదుపులో నిందితుడు బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన చిలకలగూడ పోలీసులు నిందితుడిగా భావిస్తున్న గాంధీ ఉద్యోగి ఉమామహేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ ఇన్స్పెక్టర్ నరేశ్, డీఐ సంజయ్‌కుమార్ విచారణ ప్రారంభించారు. బాధితురాలు పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పట్లేదని, విచారణకు సహకరించట్లేదని పోలీసులు చెబుతున్నారు. కనిపించకుండా పోయిన రోగి భార్య ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇరువురు మహిళలకు మద్యం అలవాటు ఉండటాన్ని ఆసరాగా తీసుకుని, ఉమామహేశ్వర్ వారిని కిడ్నాప్ చేసి, బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
‘గాంధీ’ ఫైల్స్ గంటల్లో క్లియర్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): తెలంగాణ వైద్యప్రదాయిని సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నిరుపేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. శనివారం గాంధీఆస్పత్రిని సందర్శించిన ఆయన సుమారు రెండు గంటల పాటు కలియతిరిగి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. వైద్యులు, రోగులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా వీక్షించారు. ►డ్రైనేజీ, ఫైర్‌ఫైటింగ్ సిస్టం, వాటర్ లీకింగ్తోపాటు ప్రధానమైన సమస్యలను సూపరింటెండెంట్ రాజారావు ఆయనకు వివరించారు. ►డ్రైనేజీ పైప్లైన్లు పాడైపోవడంతో మురుగునీరు ఆస్పత్రి సెల్లార్‌ను ముంచెత్తుతుందని, సెల్లార్లో డైట్ క్యాంటిన్, మెడికల్ ఫార్మసీ, దోబీఘా ట్, ఫిజియోథెరపీ తదితర సేవలు అందిస్తున్నామని డాక్టర్ రాజారావు వివరించారు. ►భవన సముదాయం నిర్మించి 18 ఏళ్లు కావడం తో లీకేజీలతో తరుచు విద్యుత్ షార్ట్సర్యూ్కట్ జరిగి విలువైన వైద్యపరికరాలు మరమ్మత్తులకు గురవుతున్నాయని, గోడలు, పైకప్పులు పెచ్చు లు ఊడి పురాతనభవనాన్ని తలపిస్తుందన్నారు. ►ఫైర్‌ఫైటింగ్ సిస్టం కోసం దశాబ్ధకాలంగా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని, సీసీ కెమెరాల నిర్వహణ ఫైల్ పెండింగ్‌లో ఉందని, ఆస్పత్రి ప్రాంగణంలోని సుమారు 10 దుకాణాలు ప్రైవేటువ్యక్తుల చేతుల్లో ఉన్నాయని, కోర్టును ఆశ్రయించి ఇబ్బంది పెడుతున్నారని. సుమారు రూ.3 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఆస్పత్రి తరుపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)ని నియమిస్తే కోర్టు వాజ్యాలు పరిష్కారం అవుతాయని కోరారు. ►సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, రోజుకు 39 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ వినియోగంతోపాటు 650 వెంటిలేటర్ పడకలు కలిగిన గాంధీ భవన సముదాయంలో శానిటేషన్, సె క్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్ సిబ్బందిని మరిం త పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు. సంబంధిత ఫైల్స్ తీసుకుని తన వద్దకు వస్తే తన పరిధిలో ఉన్న సమస్యలను గంటల వ్యవధిలో పరిష్కరిస్తారనని, మరికొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్తానని కలెక్టర్ శర్మన్ అన్నారు. వైద్యసేవలపై ఆరా... పలు విభాగాల్లోని వార్డులను సందర్శించిన కలెక్టర్ శర్మన్ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి సెల్లార్, డ్రైనేజీ వ్యవస్థ, పంప్‌హౌస్, ఆక్సిజన్ ప్లాంట్స్, డైట్ క్యాంటీన్లను పరిశీలించారు. బ్లాక్ ఫంగస్, కోవిడ్ వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ శర్మన్ కోవిడ్ యాంటిజెన్ ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లతోపాటు సీటీ స్కానింగ్ చేయించుకున్నారు. నిర్ధారణ పరీక్షల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. కార్యక్రమంలో డిప్యూటీలు నర్సింహారావునేత, శోభన్‌బాబు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆర్ఎంఓ–1 నరేందర్‌కుమార్, ఆఫీస్, నర్సింగ్ సూపరింటెండెంట్లు విజయ్‌భాస్కర్, మంగమ్మలతోపాటు వైద్యులు, సిబ్బంది, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు పాల్గొన్నారు. -
హమ్మయ్యా.. ఇక ఆక్సిజన్ కొరత ఉండదేమో?
గాంధీ ఆస్పత్రి : కోవిడ్ నోడల్ సెంటరైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ రెండు రోజుల్లో అందుబాటులోకి రానుంది. సుమారు రెండున్నర కోట్ల రూపాయల పీఎం కేర్ నిధులతో నిర్మించిన ఈ కేంద్రంలో నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ తయారు చేసే రెండు యంత్రాలను సిద్ధం చేశారు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ ప్లాంట్‌ను సందర్శించి నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్ రెడ్డిలు ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను పరిశీలించి పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన ఆక్సిజన్ ప్లాంట్ రెడీ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం పూర్తయినట్లు సంబంధిత అధికారులు, కాంట్రాక్టరు ఆస్పత్రి పాలనా యంత్రాంగానికి తెలిపారు. శుక్ర, శనివారాల్లో ప్లాంట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ తయారు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ సమీపంలోని లైబ్రరీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన పడకలకు అనుసంధానం చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. (చదవండి: Telangana Police: వర్రీలో వారియర్స్) -
విధులు మరచి టిక్‌టాక్
హైదరాబాద్: టిక్‌టాక్.. మాయలో పడి కొందరు సెలబ్రిటీలుగా మారుతుంటే, మరికొందరు ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉంటూ టిక్‌టాక్ వీడియోలు చేసిన ఇద్దరు అప్రెంటీస్ విద్యార్థులను శుక్రవారం విధుల నుంచి తొలగించారు. రాంనగర్ సాధన పారా మెడికల్ కాలేజీకి చెందిన శ్యామ్మిల్టన్, అత్తాపూర్ జెన్ ఒకేషనల్ కాలేజీకి చెందిన వీణాకుమారీ.. గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో శిక్షణ కోసం అప్రెంటీస్లుగా చేరారు. విధులను మరచి ఫిజియోథెరపీ విభాగంలోనే పలు టిక్‌టాక్ వీడియోలు చేశారు. ఆ వీడియోలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆస్పత్రి పాలనాయంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టిక్‌టాక్ వీడియోలు చేసిన శ్యామ్మిల్టన్, వీణా కుమారీని విధుల నుంచి తొలగించి ఆయా కాలేజీలకు సరెండర్ చేశామని ఆర్ఎంఓ–1 జయకృష్ణ తెలిపారు. ఫిజియోథెరపీ విభాగ వైద్యులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. వైరల్‌గా మారిన టిక్‌టాక్ వీడియోలు చేసిన వారు గాంధీ ఆస్పత్రిలో కేవలం శిక్షణ పొందేందుకు మాత్రమే వచ్చారని స్పష్టం చేశారు. -
‘గాంధీ’ డాక్టర్‌పై దాడి.. జూడాల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : ఓ డాక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు చేపట్టిన ధర్నాఇంకా కొనసాగుతోంది. ఎమర్జెన్సీ తప్ప అన్ని విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపిస్తూ సీతాఫల్మండి రవీంద్రనగర్‌కు చెందిన సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు గాంధీ ఆస్పత్రికి చెందిన ఓ జూనియర్ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. వైద్య సిబ్బందిని దుర్భాషలాడుతూ ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చశారు. ఈ ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారి వెంబడి బైటాయించి ర్యాలీకి సిద్దమయ్యారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో గాంధీ ఆస్పత్రి ఆవరణలోనే శాంతి ర్యాలీ నిర్వహించారు. జడాల ఆందోళనతో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వమే డాక్టర్లకు రక్షణ కల్పించాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
‘కేటీఆర్ సర్.. నా స్నేహితుడు చనిపోయాడు.. ఏం చేయమంటారు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై సినీదర్శకుడు మహానటి ఫేం నాగ్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కెమెరామెన్ గా పని చేస్తున్నా అశ్విన్ స్నేహితుడు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను సికింద్రాబాద్ గాంధీ ఆసుప్రతికి తరలించారు. అయితే, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అతను మరణించాడు. ఈ అంశంపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ.. జరిగిన దారుణాన్ని వివరించారు. ‘ఆదివారం రోజు నా స్నేహితుడు గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. ప్రమాదం జరిగిన అనంతరం అతను మూడుగంటల పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆదివారం కావడంతో డాక్టర్లు అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే అతన్ని స్ట్రెచర్ పై పడుకోబెట్టి... అటు, ఇటు తిరిగారు. మరే ఆసుపత్రికి తీసుకెళ్లినా అతను బతికేవాడు. గాంధీ ఆసుపత్రిలో పనిచేసే నా సోదరి ఆదివారం రాత్రి ఉండే పరిస్థితిని వివరించింది. ఆసమయంలో డాక్టర్లు ఎందుకు ఉండరు? రాజధాని నగరమైన హైదరాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మనుషులు ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేక పోతున్నాం? కేటీఆర్ సార్.. ప్రభుత్వాసుపత్రి చావులకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదని చెప్పడానికి ఏం చేయమంటారు? వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్. దీనిపై ఎవరిని ప్రశ్నించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. వైద్యం అందక ఎవరూ చనిపోరాదు' అంటూ వరుస ట్వీట్లతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. what can we do @KTRTRS sir to make sure that the word 'government hospital' need not be synonymous with carelessness and death. my friend was easily one of the best cameramen we have in the state. i don't know whom else to ask sir. nobody should die needlessly — Nag Ashwin (@nagashwin7) November 27, 2018 -
‘గాంధీ’లో మాతా శిశు సంరక్షణ కేంద్రం
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి మరో ప్రత్యేక సదుపాయం ఏర్పాటు కానుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో సుమారు రూ.30 కోట్ల అంచనా వ్యయంతో జీ ప్లస్ ఫోర్ అంతస్తుల్లో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆస్పత్రి పాలన యంత్రాంగం సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలోని ఓపీ విభాగం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించారు. భవన నిర్మాణానికి 60 శాతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయించింది. కేంద్ర ప్రతిపాదనల్లో జీ ప్లస్ 2 అంతస్తులు మాత్రమే ఉండగా, పెరుగుతున్న రోగుల తాకిడికి అనుగుణంగా మైనస్ 2 సెల్లార్తోపాటు జీ ప్లస్ 4 అంతస్తుల్లో నిర్మిస్తే భవిష్యత్‌తో ఎటువంటి ఇబ్బందులు ఉండవని పాలనయంత్రాంగం అభిప్రాయపడింది. మరో 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని తొమ్మిది అంతస్తుల భవనానికి అవసరమైన పిల్లర్ స్ట్రెంత్తో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కేవలం 200 మందికి సరిపడే వసతి సౌకర్యం కల్పించాలని కేంద్రం భావించగా, గాంధీ ఆస్పత్రి గైనకాలజీ, పిడియాట్రిక్ వార్డులో సుమారు 400 మందికి సేవలు అందిస్తున్నామని రోగుల సంఖ్యకు అనుగుణంగా వసతి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ప్రధాన భవనంలోని గైనకాలజీ, పిడియాట్రిక్ విభాగాలు సంరక్షణ కేంద్రానికి తరలిస్తే ఆయా ప్రాంతాలను న్యూరోసర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు కేటాయించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు ఈ కేంద్రంలోకి చేరుకునేందుకు సులభంగా ఉంటుందని భావించిన అధికారులు ప్రధాన ద్వారానికి చేరువగా ఈ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పార్కింగ్‌ను వేరే చోటికి తరలించడంతోపాటు రోగుల సహాయకుల విడిది కేంద్రాన్ని మార్చురీ సమీపంలోని స్థలంలో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రవణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి స్కైవాక్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి 65 పడకల ఐసీయు, ల్యాబోరేటరీ, ఎమర్జెన్సీ తదితర విభాగాలకు అనుసంధానం చేస్తామన్నారు. భవన నిర్మాణ ప్లాన్ మారిన నేపథ్యంలో త్వరలోనే కమిషనర్‌ను కలిసి ఇక్కడి పరిస్థితి వివరిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహరావునేత, గైనకాలజీ, పిడియాట్రిక్, అనస్తీషియా హెచ్ఓడీలు మహాలక్ష్మీ, శివరాంప్రసాద్, బేబీరాణి, టీజీజీడీఏ అధ్యక్షకార్యదర్శులు సిద్ధిపేట రమేష్, వసంత్‌కుమార్, ఆర్‌ఎంఓలు జయకృష్ణ, శేషాద్రి, సాల్మన్,ప్రభుకిరణ్, వైద్యులు శ్రీదేవి, టీఎస్ఎంఎస్ఐడీసీ డిప్యూటీ ఇంజనీర్ కరుణాకరాచారి, ఏఈ వేణు తదితరులు పాల్గొన్నారు. -
మా కుమారుడికి మెరుగైన వైద్యం అందించండి
సాక్షి, హైదరాబాద్ : తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందించాలని చెంగిచర్ల ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటనలో గాయపడిన వెంకట్‌నాయక్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వెంకట్ నాయక్ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను చెన్నయ్‌లో ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీలో కాంట్రాక్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. -
గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో మోసం
సాక్షి, సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో శానీటరీ విభాగంలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. సిద్ధిపేటకు చెందిన కనకరాజు, లావణ్య దంపతులు నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద నుంచి ఇప్పటివరకూ రూ. 20 లక్షల మేర వసూలు చేసినట్లు తెలిసింది. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో.. కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సిద్దిపేట పోలీసులు ఈ అంశంలో హెల్త్ ఇన్స్పెక్టర్ రవి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాధితుల సంఖ్య 20 నుంచి 30 మంది వరకూ ఉన్నట్లు సమాచారం. కాల్‌డేటా ఆధారంగా రవి, లావణ్యల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. బాధితులు అందరూ గతంలో పలుమార్లు గాంధీ ఆసుపత్రిలోని శానిటేషన్ విభాగానికి వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. -
కొండాపూర్‌లో ‘స్వైన్’కలకలం
మిరుదొడ్డి: మండలంలోని కొండాపూర్‌లో ‘స్వైన్ ఫ్లూ’ కలకలం సృష్టించింది. కొండాపూర్‌కు చెందిన భీమరి నర్సింహులుకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కాగా, అతని భార్య, కూతురుకు కూడా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన వైద్యులు ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. భీమరి నర్సింహులు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నిరోజులుగా హృద్రోగ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న నర్సింహులు రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు అతన్ని సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఈనెల 25న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు నర్సింహులుకు పరీక్షలు నిర్వహించి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పీహెచ్సీ డా. సునీతతో పాటు వైద్య సిబ్బంది సోమవారం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్న నర్సింహులు భార్య వసంతను, కూతురు నిహారికకు పరీక్షలు నిర్వహించారు. తల్లీకూతుళ్లకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంతేకాకుండా న ర్సింహులు ఇంటి పరిసరాల్లోని కుటుంబాల వద్దకు వెళ్లి వ్యాధి లక్షణాలపై ఆరా తీశారు. అనంతరం వైద్య బృందం గ్రావృుంలో ఇంటింటికీ తిరుగుతూ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. జ్వరం, జలుబు, ఎడతె రిపి లేకుండా వచ్చే దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడేవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
‘గాంధీ’ ఫార్మసీకి తాళం
* ఉద్యోగుల మధ్య గొడవే కారణం! * మందుల కోసం ఆందోళనకు దిగిన రోగులు గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇరువురు ఉద్యోగుల మధ్య తలెత్తిన ఘర్షణతో ఫార్మసీకి తాళం పడింది. దీంతో మందుల కోసం రోగులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ వృద్ధురాలు సోమవారం ఉదయం ఓపీ విభాగంలో వైద్యపరీక్షలు చేయించుకుంది. ైవైద్యుడు ఉచితంగా ఇచ్చే మందులను ఫార్మసీలో తీసుకొమ్మని చీటీ రాసి ఇచ్చాడు. దాన్ని వృద్ధురాలు పోగొట్టుకుంది. గాంధీ ఆస్పత్రి ఓపీ విభాగంలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జగదీష్ వృద్ధురాలి పరిస్థితి గమనించి కంప్యూటరీ ఓపీ చిట్టీపై ఉన్న మందులను మరో కాగితంపై రాసిచ్చాడు. దీనికి ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో వాగ్వివాదం జరిగింది. ఈదశలో నవీన్ ఫార్మసీకి తాళం వేసి సూరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. రోగులకు మందులు అందక ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి అధికారులు వెంటనే ఫార్మసీని తెరిపించి మందులు ఇప్పించారు. రోగుల మధ్య తొక్కిసలాట జరగడంతో అవుట్‌పోస్ట్, స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్ధారు. ఇటువంటి ఘటనలు జరగడం పట్ల ఆస్పత్రి పాలనాయంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.