Severe Illness
-
కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతి.. ఐసీయూలో తల్లిదండ్రులు
బనశంకరి: బెంగళూరులో కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతిచెందగా అతని తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.కొంతసేపటికే విషమంవివరాలు... భువనేశ్వరినగరలో బాలరాజ్, నాగలక్ష్మీ దంపతులు ఐదేళ్ల కొడుకు ధీరజ్‌తో కలిసి ఉంటున్నారు. బాలరాజ్ స్విగ్గీ డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఓ కేక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. భార్య, కొడుకుతో కలిసి తిన్నారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇరుగు పొరుగు చూసి ముగ్గురిని సమీప కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందించారు. కానీ బాలుడు ధీరజ్ చనిపోగా, బాలరాజ్, నాగలక్ష్మీలకు విషమంగా ఉంది.పోలీసుల విచారణకేపీ అగ్రహార పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆ కేక్‌ను ఏ బేకరి నుంచి తీసుకువచ్చారు, అందులో ఏమైనా కలిపారా? అనేది ఆరా తీశారు. కేక్ కలుషితం కావడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నివేదిక కోసం పోలీసులు వేచిచూస్తున్నారు.అనేక సందేహాలుఓ వ్యక్తి స్విగ్గీలో కేక్ ఆర్డర్ చేసి తరువాత క్యాన్సిల్ చేయడంతో బాలరాజ్ ఆ కేక్‌ను ఇంటికి తీసుకువచ్చినట్లు తేలింది. ఈ కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది. కేక్ కలుషితం కావడం వల్ల జరిగిందా? లేక ఎవరైనా కావాలనే విషం కలిపారా? లేదా బాలరాజే కేక్‌లో ఏదైనా కలిపి కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. కేక్ నమూనాలను పోలీసులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. బాలుని పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. విష పదార్థం కలిసి ఉండే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. -
కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతి.. ఐసీయూలో తల్లిదండ్రులు
బనశంకరి: బెంగళూరులో కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతిచెందగా అతని తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.కొంతసేపటికే విషమంవివరాలు... భువనేశ్వరినగరలో బాలరాజ్, నాగలక్ష్మీ దంపతులు ఐదేళ్ల కొడుకు ధీరజ్‌తో కలిసి ఉంటున్నారు. బాలరాజ్ స్విగ్గీ డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఓ కేక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. భార్య, కొడుకుతో కలిసి తిన్నారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇరుగు పొరుగు చూసి ముగ్గురిని సమీప కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందించారు. కానీ బాలుడు ధీరజ్ చనిపోగా, బాలరాజ్, నాగలక్ష్మీలకు విషమంగా ఉంది.పోలీసుల విచారణకేపీ అగ్రహార పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆ కేక్‌ను ఏ బేకరి నుంచి తీసుకువచ్చారు, అందులో ఏమైనా కలిపారా? అనేది ఆరా తీశారు. కేక్ కలుషితం కావడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నివేదిక కోసం పోలీసులు వేచిచూస్తున్నారు.అనేక సందేహాలుఓ వ్యక్తి స్విగ్గీలో కేక్ ఆర్డర్ చేసి తరువాత క్యాన్సిల్ చేయడంతో బాలరాజ్ ఆ కేక్‌ను ఇంటికి తీసుకువచ్చినట్లు తేలింది. ఈ కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది. కేక్ కలుషితం కావడం వల్ల జరిగిందా? లేక ఎవరైనా కావాలనే విషం కలిపారా? లేదా బాలరాజే కేక్‌లో ఏదైనా కలిపి కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. కేక్ నమూనాలను పోలీసులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. బాలుని పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. విష పదార్థం కలిసి ఉండే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. -
మహాశ్వేతాదేవి ఇకలేరు
కోల్‌కతా: ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి(91) గురువారం మృతి చెందారు. రెండు నెలలుగా పలు అవయవాలు పనిచేయకపోవడం, తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. మహాశ్వేతాదేవి మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అణచివేతను, అన్యాయాన్ని ఎదిరిస్తూ తన రచనల ద్వారా బెంగాలీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా రచయిత్రి మృతి తననెంతో ఆవేదనకు గురి చేసిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. శ్వేతాదేవి మృతికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. పూర్తి ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని మమత ప్రకటించారు. గిరిజనులు, పేద గ్రామీణుల అభివృద్ధి కోసం శ్వేతాదేవి కొన్ని సంఘాలను ఏర్పాటుచేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. బడుగుబలహీన వర్గాల హక్కుల కోసం పోరాడడానికి ఆమె సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్నారు. చిన్న కథలు, నవలల ద్వారా అట్టడుగు వర్గాల స్వరాన్ని వినిపించేవారు. సామాజిక కార్యకర్తగా ఆమె చేసిన రచనలకుగాను పద్మ విభూషణ్, మెగసెసె, జ్ఞానపీఠ్ అవార్డులను పొందారు. హజర్ చురషిర్ మా(మదర్ ఆఫ్ 1084), అరిన్యిర్ అధికార్(రైట్ ఆఫ్ ది ఫారెస్ట్), ఝాన్సీ రాణి(ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ), అగ్నిగర్భ(ది ఫైర్ విత్ఇన్), రుదలి, సిధు కన్హూర్ డాకీ తదితర రచనలు పీడిత వర్గాల్లో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తాయి. నవలలు, చిన్న కథలు రాయడం కోసం ఆమె బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని అనేక గిరిజన ప్రాంతాలను సందర్శించారు. ఈమె రచనలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. ప్రముఖ రచయిత్రిగా ఎంతో కీర్తిప్రతిష్టలు పొందిన ఆమె ఎంతో నిరాడంబరంగా జీవించారు. 1926లో మధ్యతరగతి కుటుంబంలో ఢాకాలో ఆమె జన్మించారు. తండ్రి మనీష్ కటక్ ఆ సమయంలో ప్రఖ్యాత కవి. రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతిన్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేసుకున్న శ్వేతాదేవి.. ప్రముఖ నాటక రచయిత బిజోన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకు వీరు విడాకులు తీసుకున్నారు. 2014లో చనిపోయిన ఈమె కుమారుడు నబరున్ కూడా ప్రఖ్యాత కవి, రచయిత. ఈయన సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు. ఆత్మకథ పూర్తి చేయలేకపోయారు: మహాశ్వేతాదేవి తన ఆత్మకథను పూర్తి చేయలేకపోయారని ఆమె సన్నిహితుడు జోషీ జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2007లో నందిగ్రామ్ హింసాత్మక ఘటనల అనంతరం శ్వేతాదేవి ఆత్మకథ రాయడం ప్రారంభించారని, అయితే, ఇల్లు మారుస్తున్న సమయంలో ఆ డైరీ మాయమైందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: మహాశ్వేతాదేవి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగిన మహోన్నత రచయిత్రిగా ఆమెకు చరిత్రలో స్థానం ఉందన్నారు. వైఎస్ జగన్ సంతాపం ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేతాదేవి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. భార త సాహితీ రంగానికి ఆమె మృతి ఎప్పటికీ తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. మహాశ్వేతాదేవి తన పరిజ్ఞానంతో ఎందరో రచయితలకు, మేధావులకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. -
ఐటీసీ పీఎస్‌పీడీలో ప్రమాదం
కార్మికుడి మృతి.. మరో ఐదుగురికి అస్వస్థత బూర్గంపాడు: ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక పర్మనెంట్ కార్మికుడు మృతి చెందగా, మరో కాంట్రాక్ట్ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఘటనలో మరో ఐదుగురు కార్మికులు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐటీసీ పీఎస్‌పీడీలోని ఎస్ఆర్పీ (సోడా రికవరీ ప్లాంట్)లో సాంకేతిక లోపాలను సరిచేస్తున్న క్రమంలో కొద్ది పరిమాణంలో ఎన్సీజీ (నాన్ కన్జెన్షబుల్ గ్యాస్) లీకవటంతో అక్కడ పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికుడు పీఎల్ఎన్ ప్రసాద్, అతడి పక్కనే ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడు వీరభద్రం ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని రక్షించేందుకు అక్కడికి వెళ్లిన మరో ఐదుగురు కార్మికులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వీరికి ఐటీసీలోని డిస్పెన్సరీలో ప్రథమ చికిత్సలు నిర్వహించి.. వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పీఎల్ఎన్ ప్రసాద్ (28) మృతి చెందాడు. కాకినాడకు చెందిన ప్రసాద్‌కు 11 నెలల క్రితమే వివాహం జరిగినట్లు తోటి కార్మికులు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుడు వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. అస్వస్థతకు గురైన మరో ఐదుగురు కార్మికులకు కూడా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఈ ఐదుగురి ఆరోగ్యం పట్ల ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు ఆస్పత్రి వద్దకు వెళ్లి పరిస్థితిని వాకబు చేశారు. -
కొండాపూర్‌లో ‘స్వైన్’కలకలం
మిరుదొడ్డి: మండలంలోని కొండాపూర్‌లో ‘స్వైన్ ఫ్లూ’ కలకలం సృష్టించింది. కొండాపూర్‌కు చెందిన భీమరి నర్సింహులుకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కాగా, అతని భార్య, కూతురుకు కూడా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన వైద్యులు ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. భీమరి నర్సింహులు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నిరోజులుగా హృద్రోగ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న నర్సింహులు రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు అతన్ని సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఈనెల 25న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు నర్సింహులుకు పరీక్షలు నిర్వహించి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పీహెచ్సీ డా. సునీతతో పాటు వైద్య సిబ్బంది సోమవారం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్న నర్సింహులు భార్య వసంతను, కూతురు నిహారికకు పరీక్షలు నిర్వహించారు. తల్లీకూతుళ్లకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంతేకాకుండా న ర్సింహులు ఇంటి పరిసరాల్లోని కుటుంబాల వద్దకు వెళ్లి వ్యాధి లక్షణాలపై ఆరా తీశారు. అనంతరం వైద్య బృందం గ్రావృుంలో ఇంటింటికీ తిరుగుతూ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. జ్వరం, జలుబు, ఎడతె రిపి లేకుండా వచ్చే దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడేవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
చెన్నమనేనికి అస్వస్థత
వేములవాడ: సీని యర్ కమ్యూనిస్టు నాయకుడు, సిరి సిల్ల మాజీ ఎమ్మె ల్యే సిహెచ్.రాజేశ్వర్‌రావు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బాత్రూమ్లో జారిపడ్డారు. కుటుంబసభ్యులు సోమాజీగూడలోని యశోధ ఆసుపత్రికి తరలించారు. కుడికాలు తుంటి ఎముక విరగటంతో శస్త్రచికిత్స చేయాల్సిఉంటుందని వైద్యులు వెల్లడించినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం రాజేశ్వర్‌రావుకు షుగర్, బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో వాటికి చికిత్స చేస్తున్నారని, సాధారణ స్థితికి రాగానే శస్త్రచికిత్స నిర్వహించనున్నారని చెప్పారు. సమాచారం అందుకున్న ఆయన కుమారుడు, వేములవాడ ఎమ్మెల్యే సిహెచ్.రమేశ్‌బాబు జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. -
వైద్యులు మానసిక వైకల్యం పై నిర్లక్ష్యం
సాక్షి, సంగారెడ్డి: మానసిక వికలాంగులు మరణశయ్యపై ఊగిసలాడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా కనీస వైద్యం అందక మృత్యువుకు చేరువవుతున్నారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్రాస్పత్రి ప్రాంగణంలో ఉన్న మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న రోగుల్లో 20 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రోజులు లెక్కబెడుతున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఇద్దరు రోగులు మృతి చెందారు. 2004లో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ పునరావాస కేంద్రంలో 497 మంది మానసిక వికలాంగులను ఆశ్రయం కల్పించగా.. అందు లో ఏకంగా 80 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 61 మంది రోగులు ఆశ్రయం పొందుతుండగా.. అందులో 40 మంది వివిధ రకాల శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నవారే. క్షయతో పాటు కాలేయ సంబంధిత వ్యాధులతో అందులో 20 మంది బక్కచిక్కిపోయి ఉన్నారు. పరిస్థితి దయనీయం.. ఇంటిగ్రేటెడ్ న్యూలైఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్(ఇన్సెడ్) అనే స్వచ్ఛంద సంస్థ 2004 నుంచి ఆస్పత్రి ప్రాంగణంలో మానసిక వికలాంగుల కోసం పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. 2007లో అప్పటి కలెక్టర్ పియూష్ కుమార్ పునరావాస కేంద్రం దుస్థితి చూసి చలించిపోయారు. వెంటనే డీఆర్డీఏ నుంచి రూ.25 లక్షల నిధులు కేటాయించడంతో పాటు ఆస్పత్రి ఆవరణలోనే 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి సొంత భవనాన్ని సమకూర్చారు. ఆస్పత్రి ఇన్‌పేషంట్ల కోసం వండే భోజనం నుంచే 90 మంది మానసిక వికలాంగులకు రోజూ మూడు పూటల భోజనాన్ని సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభమైన నాటినుంచి ఈ కేంద్రంలో 333 మంది పురుష, 164 మంది మహిళలు కలిపి మొత్తం 497 మంది రోగులకు ఆశ్రయం కల్పించారు. మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతుంటే పట్టుకుని తీసుకొచ్చిన రోగులే అధికమంది ఉన్నారు. ఇలా రోడ్లపై తిరుగుతూ కామాంధులకు చిక్కి బలైన మతిస్థిమితం లేని నలుగురు మహిళలు ఇక్కడ చేరిన తర్వాత బిడ్డలను ప్రసవించడం వారి దయనీయ స్థితిని తెలియజేస్తోంది. ప్రస్తుతం నలుగురు బాలబాలికలు పిచ్చితల్లులతో పాటే మానసిక కేంద్రంలో ఉంటూ చదువుకుంటున్నారు. రెండు రోజుల కింద ఈ మహిళా రోగి క్షయ వ్యాధితో మరణించడంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. దయలేని వైద్య దేవుళ్లు .. అనారోగ్యంతో బాధపడుతున్న మానసిక రోగులను ఎవరైనా మానవతావాదులు పెద్దాస్పత్రిలో చేర్పిస్తే.. ఆస్పత్రి వర్గాలు వైద్య సేవలందించకుండానే బలవంతంగా పునరావాస కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంటున్నారు. చనిపోయిన 80 మందిలో 59 మంది రోడ్లపై నుంచి తీసుకువచ్చినవాళ్లు ఉండగా..మిగిలిన 21 మంది పెద్దాస్పత్రికి వైద్యం కోసం వచ్చి ఇలా పునరావాస కేంద్రానికి చేరినవాళ్లే ఉన్నారు. ముఖ్యంగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించకుండానే ఈ కేంద్రానికి పంపిస్తుండడం.. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకపోవడంతో చాలామంది రోగులు మృత్యువాత పడ్డారు. వైద్యులెవరూ ఈ పునరావాస కేంద్రాన్ని సందర్శించి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గత నెల 15వ తేదీన ఓ వైద్యుడు పునరావాస కేంద్రం నుంచి రోగుల కేస్ షీట్లను తెప్పించుకుని వైద్య పరీక్షలు జరిపించినట్లు సంతకాలు చేయడం గమనార్హం. ఇక పునరావాస కేంద్రం భవనానికి ప్రహరీ గోడలు లేకపోవడంతో 139 మంది రోగులు తప్పించుకుని పారిపోయారు. -
రోగాలు నిల్వ
ఈ దుస్థితి మారేనా... =ఉసురు తీస్తున్న ఆహారపుటలవాట్లు =నిల్వ ఆహారంతో రోగాలు కొనితెచ్చుకుంటున్న మన్యజనం హుకుంపేట, న్యూస్‌లై న్ : తిండి కలిగితె కండ కలదోయ్...కండ కలవాడేను మనిషోయ్..అన్నాడో మహాకవి. అయితే కొందరు ప్రజలు తిండి అలవాట్లతోనే రోగాల బారిన పడుతున్నారు...మృత్యువాత పడుతున్నారు. సంప్రదాయక ఆహారపదార్ధాలు, వంటకాలతో పాటు వారు తీసుకునే కల్లు వంటివి కూడా విషపూరితం కావడం వారికి శాపంగా పరిణమిస్తోంది. అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లలో మార్పు తీసుకురావడంలో ఇటు ప్రభుత్వం కాని, అటు స్వచ్ఛంద సంస్థలు కానీ చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా నిల్వ ఉన్న మాంసం, విషపూరితమైన పుట్టుగొడుగులు, ఆరోగ్యానికి మేలు చేసేవైనా మితిమీరి తీసుకోవడం, కొన్నిరకాల కొండఆకు కూరలు, దుంపలు నిల్వ చేయడంలో సరైన పద్ధతులు పాటించకపోవడం, కల్లు తయారీలో విషపూరితమైన వేర్లు వినియోగించడం వంటి కారణాలతో ఇక్కడి గిరిజనులు అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. అనారోగ్యానికి ‘గొడుగు’: మన్యంలో గిరిజనులు అధికంగా పుట్టుగొడుగులు, వెడురుగొడుగులు, మామిడి గొడుగులు, జిల్లేడు గొడుగులు, పేడగొడుగులు, గడ్డిగొడుగులు వంటకాలుగా అధికంగా వినియోగిస్తూ ఇబ్బం దులు పడుతున్నారు. వీటి వల్ల మృతి చెందిన వారు మండలంలో అనేక మంది ఉన్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి కోలుకోలేని వారు ఉన్నారు. అడ్డుమండ, మఠం, దిగరూడి గ్రామాల్లో పలుమార్లు విషపు కొక్కులు తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడిన వారి సంఖ్య నమోదు అయ్యింది. ‘కల్లు’కూట విషం: కల్లు జీవితానికి ముల్లు...అనే సామెత మన్యంలో అక్షరాల నిజమవుతోంది. జీలుగుకల్లులో అధికంగా నేలసిర్లి, పాతాలగరడి, సీమతీగ, కటికి, రెల్ల, పలుదొండ వంటి వేర్లు అధికంగా మురగదీస్తూ వినియోగిస్తుండడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా సన్నగిల్లుతోంది. లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు ముసురుకొంటున్నాయి. అయినా గిరిజనులకు ఎంతో ప్రీతిపాత్రమైన జీలుగుకల్లు వినియోగంలో వెనకడుగు వేయడం లేదు. మడ్డికల్లులో కూడా అనేక రకాల వనమూలికలు, రసాయనాల తో తయారు చేసే పిండి ఉండలు కలపడంతో అది కాలకూట విషంలా తయారవుతోంది. దీనిని సేవించేవారు మృత్యుకోరలకు చిక్కుతున్నారు. ‘దుంప’తెంచుతున్న నిల్వ... నాగడ దుంప, సీమదుంప, పిండిదుంప, చారుదుంప, గుమ్మడి కాయ వంటివి సీజన్లో సేకరించి వాటిని ఎండ బెట్టి నిలువ చేసి అధికంగా గిరిజనులు వినియోగిస్తుంటారు. అయితే వీటిని ఉడకబెట్టడంలోగాని, ఎండ పెట్టడంలోను సరైన జాగ్రత్తలు చేపట్టకపోవడంతో అవి త్వరి త గతిన బూజుపడతాయి. అయినా ఏ మాత్రం లెక్కచేయక తిరిగి వాటినే వినియోగిస్తుండడం వల్ల డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ‘మాంసా’హరణం : నాణ్యత లోపించిన, వ్యాధుల బారిన పడిన పశుమాంసం వారపు సంతల్లో విచ్చలవిడిగా విక్రయిస్తుంటారు. మృతి చెందిన పుశువులు, మేకలను నిల్వచేసుకుంటూ తింటుండడం వల్ల పలువురు మృత్యువాత పడుతున్నారు...లేదా ఆంత్రాక్స్ వంటి వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు. -
చాక్లెట్ తిన్న విద్యార్థులకు అస్వస్థత
తమ తోటి విద్యార్థిని జన్మదినం సందర్భంగా పాఠశాలలో పంపిణీ చేసిన చాక్లెట్లు తిన్న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 12 మంది బాలికలు, ఎనిమిది మంది బాలురున్నారు. ఠాణే మాజీవాడాలోని సంకేత్ పాఠశాలలో బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. అందిన వివరాల మేరకు...స్థానిక మనపాడా ప్రాంతంలోని సంకేత్ విద్యాలయలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు తమ సహచర విద్యార్థిని పుట్టినరోజు కావడంతో తీసుకొని వచ్చిన చాక్లెట్లను తీసుకొని తిన్నారు. అనంతరం అనేక మంది విద్యార్థులకు కడుపులో మంట, నొప్పి ప్రారంభమైంది. ఆ వెంటనే వీరిని పాఠశాల యజమాన్యం సమీపంలోని టైటన్ ఆసుపత్రికి తరలించింది. చికిత్స అనంతరం అనేక మందిని డిశ్చార్జి చేసిన వైద్యులు ఐదుగురు విద్యార్థులకు ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంచారు. ఈ సంఘటన అనంతరం ఒక్కసారిగా పాఠశాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ఈ వార్త తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. దీంతో పాఠశాలతో పాటు టైటాన్ ఆసుపత్రి పరిసరాల్లో రద్దీ కన్పించింది. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలుసుకున్న కొంతమంది తల్లిదండ్రుల్లో ఆనందం కనిపించగా, తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రుల్లో విషాదం నెలకొంది. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలుపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదుచేసిన కాపూరిబావుడి పోలీసులు చాక్లెట్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని ఆరా తీసి బానుశాలి అనే దుకాణ యజమానిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇలాంటి పుట్టిన రోజు వేడుకలకు చాక్లెట్లు, తినుబండారాలు పంపిణీ చేయడాన్ని నిషేధించామని పాఠశాల సిబ్బంది ఒకరు తెలిపారు. దీనికి బదులు పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలని సూచించామని అన్నారు. -
చాక్లెట్ తిన్న విద్యార్థులకు అస్వస్థత
తమ తోటి విద్యార్థిని జన్మదినం సందర్భంగా పాఠశాలలో పంపిణీ చేసిన చాక్లెట్లు తిన్న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 12 మంది బాలికలు, ఎనిమిది మంది బాలురున్నారు. ఠాణే మాజీవాడాలోని సంకేత్ పాఠశాలలో బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. అందిన వివరాల మేరకు...స్థానిక మనపాడా ప్రాంతంలోని సంకేత్ విద్యాలయలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు తమ సహచర విద్యార్థిని పుట్టినరోజు కావడంతో తీసుకొని వచ్చిన చాక్లెట్లను తీసుకొని తిన్నారు. అనంతరం అనేక మంది విద్యార్థులకు కడుపులో మంట, నొప్పి ప్రారంభమైంది. ఆ వెంటనే వీరిని పాఠశాల యజమాన్యం సమీపంలోని టైటన్ ఆసుపత్రికి తరలించింది. చికిత్స అనంతరం అనేక మందిని డిశ్చార్జి చేసిన వైద్యులు ఐదుగురు విద్యార్థులకు ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంచారు. ఈ సంఘటన అనంతరం ఒక్కసారిగా పాఠశాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ఈ వార్త తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. దీంతో పాఠశాలతో పాటు టైటాన్ ఆసుపత్రి పరిసరాల్లో రద్దీ కన్పించింది. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలుసుకున్న కొంతమంది తల్లిదండ్రుల్లో ఆనందం కనిపించగా, తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రుల్లో విషాదం నెలకొంది. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలుపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదుచేసిన కాపూరిబావుడి పోలీసులు చాక్లెట్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని ఆరా తీసి బానుశాలి అనే దుకాణ యజమానిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇలాంటి పుట్టిన రోజు వేడుకలకు చాక్లెట్లు, తినుబండారాలు పంపిణీ చేయడాన్ని నిషేధించామని పాఠశాల సిబ్బంది ఒకరు తెలిపారు. దీనికి బదులు పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలని సూచించామని అన్నారు.