వేములవాడ: సీని యర్ కమ్యూనిస్టు నాయకుడు, సిరి సిల్ల మాజీ ఎమ్మె ల్యే సిహెచ్.రాజేశ్వర్‌రావు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బాత్‌రూమ్‌లో జారిపడ్డారు. కుటుంబసభ్యులు సోమాజీగూడలోని యశోధ ఆసుపత్రికి తరలించారు. కుడికాలు తుంటి ఎముక విరగటంతో శస్త్రచికిత్స చేయాల్సిఉంటుందని వైద్యులు వెల్లడించినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం రాజేశ్వర్‌రావుకు షుగర్, బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో వాటికి చికిత్స చేస్తున్నారని, సాధారణ స్థితికి రాగానే శస్త్రచికిత్స నిర్వహించనున్నారని చెప్పారు. సమాచారం అందుకున్న ఆయన కుమారుడు, వేములవాడ ఎమ్మెల్యే సిహెచ్.రమేశ్‌బాబు జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం.
చెన్నమనేనికి అస్వస్థత
Published Tue, Dec 30 2014 8:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement
Advertisement