కాచిగూడ: ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్సు (హెచ్‌యూజే) నూతన కార్యవర్గ తొలి సమావేశం గొల్కోండ చౌరస్తాలోని ఆ సంఘం కార్యాలయంలో గురువారం జరిగింది. సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బసవపున్నయ్య ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు.
గత ప్రభుత్వ హాయంలో జర్నలిస్టుల దగ్గర నుంచి హెల్త్ కార్డుల కోసం డబ్బులు తీసుకుని ఇప్పటి వరకు వాటిని అందించలేదన్నారు. కనీసం గతంలో ఉన్న కార్డులను కూడా రెన్యూవల్ చేయలేదని, దీంతో అనేక మంది జర్నలిస్టులు వేలాది రూపాయలను వెచ్చించి వైద్యం చేయించుకుంటున్నారని విమర్శించారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు రూ.10 కోట్లతో రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు.
అనంతరం హెచ్‌యూజే కార్యదర్శి బీవీఎన్ పద్మరాజు పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. వచ్చే నెలలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యలో జరిగే మహా ప్రదర్శనను జయప్రదం చేయాలని తీర్మానించారు. సమావేశంలో హెచ్‌యూజే ప్రతినిధులు పి.ఆనందం, నర్సింగ్‌రావు, విజయానంద్, యాదయ్య, ఆశాభారతి, జి.నవీన్, భీష్మాచారి, ప్రవీణ్, కాలేబ్, యశోద, నాగవాణి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
జర్నలిస్టులకు హెల్త్‌కార్డులివ్వాలి
Published Fri, Jul 18 2014 4:07 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement