చెన్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యకార్డుల పేరుతో ఉద్యోగులను మోసం చేసిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి రమేశ్ ఆరోపించారు. ఆదివారం చెన్నూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగదు రహిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి ఉద్యోగులకు అన్యాయం చేసిందని విమర్శించారు. జీవో 32 ప్రకారం నవంబర్ ఒకటి నుంచి ఆరోగ్య కార్డుల పథకం అమలు చేసిన ప్రభుత్వం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను మినహాయించడం శోచనీయమన్నారు.
దీంతో 95 శాతం మంది ఉద్యోగులకు ఈ పథకంతో ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. అలాంటపుడు కార్డులు జారీ చేయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని వ్యాధులకు చికిత్స చేసే విధంగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే టీపీయూఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీపీయూఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శ్రీనివాస్‌రావు, రత్న లక్ష్మీనారాయణరెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు సమ్మయ్య, సాంబయ్య పాల్గొన్నారు.
‘ఉద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం’
Published Mon, Nov 24 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement