సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం కేంద్రానికి పంపనున్న ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం కుదిరింది. సర్వీస్ రూల్స్ విషయమై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనల్లో తేడాలుండటంతో మరోసారి చర్చించి ఒకే ప్రతిపాదనతో రావాలని గత నెలలో కేంద్రం సూచిం చింది. దీంతో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఏపీ విద్యాశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సమావేశమై చర్చించగా రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
టీచర్, గెజిటెడ్ పోస్టులు రెండింటికి 1998 నుంచే ఏకీకృత సర్వీసు రూల్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు 3 రోజుల్లో కేంద్రానికి రెండు రాష్ట్రాలు లేఖలు పంపేందుకు సిద్ధమయ్యాయని పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి తెలిపారు.
‘సర్వీసు రూల్స్’పై రెండు రాష్ట్రాల ఏకాభిప్రాయం
Published Wed, Aug 17 2016 12:55 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement