కేంద్ర హోం శాఖను కోరిన ఎస్టీయూ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. కేంద్ర హోం శాఖ వెంటనే సర్వీసు రూల్స్ అమలుకు అవసరమైన చర్యలను చేపట్టాలని ఇరు రాష్ట్రాల ఎస్టీయూ నేతలు కోరారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు షణ్ముర్తి, భుజంగరావు, ప్రధాన కార్యదర్శులు జోసెఫ్ సుధీర్‌బాబు, సదానందగౌడ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్‌తో సమావేశమై వినతిపత్రాన్ని సమర్పించారు. సర్వీస్ రూల్స్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే హోం శాఖ నుంచి ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి పంపేదుకు చర్యలు తీసుకుంటామని దిలీప్ కుమార్ హామీ ఇచ్చినట్టు కత్తి నరసింహారెడ్డి తెలిపారు.
సీఐడీ ఐజీగా షికా గోయల్
కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవల రిలీవై రాష్ట్ర పోలీసుశాఖలో రిపోర్టు చేసిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి షికా గోయల్‌ను సీఐడీ ఐజీగా అటాచ్ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సీఐడీలోని జనరల్ అఫెన్స్ వింగ్, ఎకానామిక్ అఫెన్స్ వింగ్ బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రెండు విభాగాల్లో పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ఆమె సోమవారం సమీక్షించారు.
సర్వీస్ రూల్స్ అమలును వేగవంతం చేయండి
Published Tue, Jun 13 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM
Advertisement