సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యం ఉన్నట్లుగా అప్పిలేట్ మెడికల్ బోర్డు ధ్రువీకరించాక, అంగవైకల్య కోటాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడాన్ని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రద్దు చేయడం చెల్లదని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలుకు చెందిన రిజ్వాన్ బాషా షేక్ అంగవైకల్యం కోటా కింద 2016లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై జాతీయ స్థాయిలో 48వ ర్యాంకు సాధించారు. బాషాకు 30 శాతం దృష్టి లోపం ఉన్నట్లు మెడికల్ బోర్డు ధ్రువీక రించింది. దీనిపై బాషా కేంద్ర వైద్య వ్యక్తిగత వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కి చెందిన అప్పిలేట్ మెడికల్ బోర్డులో అప్పీల్ చేసుకున్నారు. దృష్టి లోపం 40 శాతం ఉన్నట్లు అప్పీల్‌లో తేలింది.
బాషా అంగవైకల్యంపై అందిన ఫిర్యాదును యూపీఎస్సీ చైర్మన్ నిపుణుల కమిటీకి నివేదించారు. నిపుణుల కమిటీ 30 శాతమే దృష్టి లోపం ఉందని 2017 నవంబర్ 7న తేల్చడంతో బాషా సివిల్ సర్వీసెస్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని బాషా క్యాట్‌లో సవాల్ చేయగా ఒకసారి మెడికల్ అప్పిలేట్ బోర్డు అంగవైకల్యాన్ని నిర్ధారించాక దాన్ని నిపుణుల కమిటీకి పంపడం సరికాదంది. సివిల్ సర్వీసెస్‌కు బాషా ఎంపికను రద్దు చేయడం చెల్లదని జస్టిస్ రెడ్డి కాంతారావు, సభ్యులు మిన్నీ మాథ్యూస్‌ల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
సివిల్ సర్వీసెస్ ఎంపిక రద్దు చేయడం చెల్లదు
Published Sun, Apr 8 2018 3:47 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment