Central Administrative Tribunal (CAT)
-
Jaya Verma Sinha: క్యాట్ సభ్యురాలిగా రైల్వే బోర్డు చైర్పర్సన్
న్యూఢిల్లీ: రైల్వే బోర్డు చైర్పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా కేంద్ర అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆగస్టు 31న రైల్వే బోర్డు నుంచి పదవీ విరమణ పొందాక క్యాట్ సభ్యురాలిగా బాధ్యతలు చేపడతారు. జయతో పాటు మరో 11 మందిని క్యాట్ సభ్యులుగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ హర్‌నరేశ్ సింగ్ గిల్, జస్టిస్ పద్మరాజ్ నేమచంద్ర దేశాయ్, వీణా కొతవాలే, రాజ్వీర్ సింగ్ వర్మలు క్యాట్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. -
కేడర్ వివాదం కేసు.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఏడేళ్లుగా సాగుతున్న.. ఏపీ-తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ వివాదం కేసును ముగించింది ఎట్టకేలకు ముగించింది తెలంగాణ హైకోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్- క్యాట్(Central Administrative Tribunal) తీర్పును ఉన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకే కేడర్ కేటాయింపు ఉండాలన్న కేంద్రం వాదనతో ఏకీభవించిన కోర్టు.. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తన తీర్పులో స్పష్టం చేసింది. తాజా తీర్పులో.. ఏడేళ్ల కిందటి నాటి క్యాట్ తీర్పును కొట్టేయడంతో పాటుగా డీవోపీటీకి ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం కల్పించింది తెలంగాణ హైకోర్టు. అలాగే.. అధికారుల సీనియారిటీ, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అప్పటివరకు ఇప్పుడున్న రాష్ట్రాల్లోనే విధులు కొనసాగించాలని ఆదేశించింది. ‘‘ఈ 13 మంది బ్యూరో క్రాట్ లు క్యాడర్ కేటాయింపు అంశంపై కేంద్రాన్ని అభ్యర్థించాలి. అధికారులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలి. అధికారులు అవసరమైతే లీగల్‌గా ముందుకు వెళ్లొచ్చు. అధికారుల కేటాయింపుకు క్యాట్ లు ఎలాంటి హక్కు లేదు. బ్యూరో క్రాట్ ల కేటాయింపు కేవలం డీవోపీటీ పరిధిలో అంశమే’’ అని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. వివాదం ఏంటంటే.. రాష్ట్ర విభజన సమయంలో 14 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది కేంద్రం పరిధిలోని డీవోపీటీ( Department of Personnel and Training). అయితే.. ఆ ఉత్తర్వుల్ని క్యాట్ కొట్టేసింది. తన కేటాయింపులు పక్కనపెట్టి మరీ క్యాట్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ 2016లో డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తన పరిధి దాటి బ్యూరోక్రాట్ లపై క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ వచ్చింది. 2016 నుండి హైకోర్టు లో ఈ వివాదంపై విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కేటాయింపుల పై తుది వాదనలు ముగిశాయి. ఈ మధ్యలో కేడర్ కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కు పంపుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే.. సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ గత ఏడాది హైకోర్ట్ ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో.. మిగిలిన 13 మంది అధికారుల క్యాడేర్ కేటాయింపు పై తుది వాదనలు ఇవాళ జరిగాయి. -
క్యాట్ కుప్పకూలుతోంది: సుప్రీం కోర్టు సీరియస్
న్యూఢిల్లీ: సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో భారీ ఖాళీలపై సుప్రీంకోర్టు సీరియసైంది. ట్రిబ్యునల్ కుప్పకూలుతోందంటూ వ్యాఖ్యానించింది. క్యాట్‌లో ఖాళీల వల్ల ఇతర ధర్మాసనాలకు చెందిన జడ్జిలు హైబ్రిడ్, ప్రత్యక్ష, వర్చువల్ పద్ధతుల్లో విచారణ జరుపుతున్నారంటూ కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘క్యాట్‌కు కేటాయించిన 69 మంది జడ్జీ పోస్టులకు గాను చైర్‌పర్సన్‌తో కలిపి ఏకంగా 43 ఖాళీలున్నాయి. మిగతా వారూ రిటైరైతే క్యాట్ పూర్తిగా కుప్పకూలిపోతుంది’ అంది. జూలై 26న తదుపరి విచారణకల్లా ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించింది. చదవండి: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం -
అభిషేక్‌ను రెండు వారాల్లో తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర కేడర్‌లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సోమేశ్‌కుమార్‌ను ముందుగా ఏపీకి కేటాయించగా తామిచ్చిన ఆదేశాలతో తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్నారని గుర్తుచేసింది. అభిషేక్ మొహంతి కేసులో తమ ఆదేశాలను అమలు చేయకపోతే గతంలో తామిచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించి సోమేశ్‌ను తిరిగి ఏపీ కేడర్‌కు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు క్యాట్ సభ్యులు ఆశిష్కాలియా, బీవీ సుధాకర్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ అభిషేక్ మొహంతి దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో విచారించిన క్యాట్.. తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలంటూ 8 నెలల క్రితం ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో అభిషేక్ కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. కోర్టుధిక్కరణ పిటిషన్ మరోసారి విచారణకు రాగా.. సీఎస్ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించారు. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో సీఎస్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని, గంట సమయం ఇస్తున్నామని, ఈలోగా హాజరుకాకపోతే సీఎస్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం హె చ్చరించింది. దీంతో కొద్దిసేపటి తర్వాత సీఎస్ ఆన్లైన్లో ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ కేటాయింపులు చేసే అధికారం కేంద్రానికి ఉందని, ఈ నేపథ్యంలో క్యాట్ ఆదేశాలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రా నికి నివేదించామని సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. రెండు వారాల్లోగా అభిషేక్‌ను తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 వారాల తర్వాతకు వాయిదా వేసింది. కాగా, సోమేశ్‌తోపాటు ఇతర అధికారులను తెలంగాణకు కేడర్‌కు కేటాయించాలంటూ క్యాట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం ఇప్పటికే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. -
ఐడీబీఐ వాటాల అమ్మకాల ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటాల విక్రయ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. వాటాల విక్రయం విషయంలో సేవల కోసం లావాదేవీల సలహాదారులు, న్యాయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ పెట్టుడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) ప్రకటన విడుదల చేసింది. బిడ్లను సమర్పించేందుకు జూలై 13 వరకు గడువు ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ 49.24 శాతం వాటాతో ప్రమోటర్‌గా ఉండగా.. కేంద్ర ప్రభుత్వానికీ 45.48 శాతం వాటా ఉంది. చదవండి: బ్యాంకులకు ‘వీడియోకాన్’ లో 8 శాతం వాటాలు -
ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు
-
ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) మంగళవారం కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఇక ఇదే వ్యవహారంలో కేంద్ర హోంశాఖ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించిన విషయం తెలిసిందే. (చదవండి: ఏబీవీని విచారించండి) కాగా, ప్రవర్తనా నియమాల్ని ఉల్లంఘించినందుకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో స్పష్టం చేసింది. పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను సైతం ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. (చదవండి: ‘ఏబీవీ’ బినామీ భూ బాగోతం) -
ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) కొట్టేసింది. మహేశ్వర్‌రెడ్డిని ప్రొబేషనరీ శిక్షణకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు జాతీయ పోలీస్ అకాడమీలను ఆదేశించింది. మహేశ్వర్‌రెడ్డి భార్య ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయ డాన్ని కారణంగా చూపించి ఐపీఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పుపట్టింది. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా తనను సస్పెండ్ చేశారని మహేశ్వర్‌రెడ్డి సవాల్ చేసిన పిటిషన్‌ను క్యాట్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్ల ధర్మాసనం మంగళవారం విచారించి ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్‌లో సహ విద్యార్థిని భావనను మహేశ్వర్‌రెడ్డి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని, ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో విడాకులు ఇస్తారనే భయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని పిటిషనర్ న్యాయవాది కె.సుధాకర్‌రెడ్డి వాదించారు. ఐపీఎస్‌కు ఎంపిక అయ్యాక అధికారిక పత్రాల్లో కూడా వివాహం జరిగినట్లుగా రాశారని, భార్య పేరు భావన అనే రాశారని వివరించారు. ముస్సోరి శిక్షణా సంస్థ డైరెక్టర్‌కు ఆమె ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే దానికి మహేశ్వర్‌రెడ్డి జవాబుతో డైరెక్టర్ సంతృప్తిని వ్యక్తపరిచా రంటూ వాటి పత్రాలను నివేదించారు. కేంద్రం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎఫ్ఐఆర్ నమోదయ్యాక సస్పెండ్ చేసే అధికారం కేంద్రానికి ఉందన్నారు. బెంగళూరు సగం ఖాళీ అవుతుంది.. ఈ వాదనలపై జస్టిస్ నర్సింహారెడ్డి స్పందిస్తూ.. ‘రికార్డుల్లో మహేశ్వర్‌రెడ్డి తన భార్య భావన అని చెప్పారు. ఆరోపణలకు ఇచ్చిన జవాబుతో ముస్సోరి అకాడమీ డైరెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య గొడవ ఉంది. దానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరోపణల దశలో ఉండగానే ఏవిధంగా సస్పెండ్ చేస్తారు..’అని ప్రశ్నించారు. బెంగళూరులో అయితే పది ఫ్యామిలీ కోర్టులకు విడాకుల కోసం వచ్చే వారిలో అత్యధికులు ఉన్నత చదువులు చదివిన వారేనని, వాళ్లలో చాలామందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, వారందరినీ సస్పెండ్ చేస్తే బెంగళూరు సగం ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు. కాపురంలో కలహాలు సహజమని, కౌన్సెలింగ్ సరిగ్గా జరిగితే కాపురాలు నిలబడతాయని అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి సస్పెండ్ చేయడం చట్టవ్యతిరేకమని, తుది ఆదేశాలను బట్టి స్పందిస్తే తప్పులేదని ధర్మాసనం అభిప్రాయపడింది. -
ట్రైనీ ఐపీఎస్‌ను ఎలా సస్పెండ్ చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి కేవీ మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేసిన విధానంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) కీలక ప్రశ్నలను సంధించింది. ఆరోపణలు వస్తే దర్యాప్తులో భాగంగా సరీ్వస్ నుంచి మాత్రమే సస్పెండ్ చేసేందుకు నిబంధ నలు అనుమతిస్తున్నాయని, నియామ క ఉత్తర్వులను ఎలా సస్పెండ్ చేస్తారని కేంద్ర హోం శాఖను ప్రశి్నంచింది. దీనిపై వివరణ ఇవ్వాలని క్యాట్ అడ్మిని్రస్టేటివ్ మెంబర్ బీవీ సుధాకర్ బుధవారం కేంద్ర హోం శాఖను ఆదేశించా రు. సెంట్రల్ సరీ్వసెస్ ఆఫీసర్స్ రూల్స్‌కు వ్యతిరేకంగా మహేశ్వర్‌రెడ్డిని ఎలా సస్పెండ్ చేశారో వివరణ ఇవ్వా లని కోరారు. తనను పెళ్లి చేసుకున్నాక మోసం చేశాడని భువన అనే మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మహేశ్వర్‌రెడ్డి వివరణ ఇచ్చాక ఏం జరిగిందో చెప్పాలని ముస్సోరీలో ని కేంద్ర సరీ్వసుల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ను క్యాట్ ఆదేశించింది. మహేశ్వర్ వివరణను జాతీయ పోలీస్ అకాడమీ, కేంద్ర హోం శాఖలకు తెలియజేశారో లేదో చెప్పాలని వివరణ అడిగింది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయి దా వేసింది. ఆరోపణల ఫిర్యాదు ఆధారంగా తనను సస్పెండ్ చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ మహేశ్వర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించగా.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖను క్యాట్ ఆదేశించింది. -
మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారు?: క్యాట్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ ట్రైనీ కేవీ మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారో బుధవారం తెలియజేయాలని కేంద్ర హోం శాఖను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని పేర్కొంటూ మహేశ్వర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ కేసును మంగళవారం క్యాట్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ బీవీ సుధాకర్ విచారించి హోం శాఖకు నోటీసులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ రూల్స్ (డీఅండ్‌ఏ)–1969 ప్రకారం సస్పెండ్ చేయడానికి వీల్లేదని, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారని, పోస్టింగ్ అందుకోవాల్సిన దశలో నిరాధార ఆరోపణల ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఓ క్రిమినల్ కేసు పెండింగ్ ఉందని చెప్పి సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడానికి వీల్లేదని, అలాంటి కేసుల్లో 48 గంటల పాటు రిమాండ్‌లో ఉన్నప్పుడు మాత్రమే సస్పెండ్ చేయొచ్చని చట్టంలో ఉందన్నారు. భువన అనే యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మహేశ్వర్‌రెడ్డి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
17 ఏళ్ల తర్వాత వచ్చి ఉద్యోగం కావాలన్నాడు
న్యూఢిల్లీ: తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్ అమెరికాలో ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేరి, తిరిగి 17 ఏళ్ల తర్వాత భారత్ వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ప్రధాని మోదీని కోరిన ఘటన ఇటీవల జరిగింది. 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజేష్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లో పోస్టింగ్ అందుకున్నాడు. పీహెచ్డీ కోసం రెండేళ్లకాలానికి ప్రభుత్వ అనుమతితో 1996లో అమెరికా వెళ్లారు. తర్వాత భారత్‌కు రాలేదు. ఉత్తరాఖంఢ్‌లో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. తర్వాత 2001 ఆగస్టు 12 వరకూ సెలవులు కోరుతూ దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఓకే చెప్పింది. మళ్లీ 2001 డిసెంబర్ 31 వరకూ సెలవులు పొడిగించుకున్నారు. మళ్లీ ఆరునెలలు కావాలంటూ దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం తిరస్కరించింది. విధుల్లో చేరాలని యూపీ ప్రభుత్వం ఆదేశించింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, చట్టం ప్రకారం ఐదేళ్లకు మించి విధులకు దూరంగా ఉండటంతో విధుల నుంచి 2003లో తొలగించారు. తనను విధుల్లో చేర్చుకోవాలంటూ 2017లో మోదీకి ఆయన లేఖ రాశారు. మోదీ దాన్ని తిరస్కరించడంతో, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడా తిరస్కరణే ఎదురైంది. కొద్ది రోజుల పాటు సెలవులు పెడితేనే వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటిది సంవత్సరాల తరబడి సెలవులు ఎలా పెడతారని ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసింది. -
‘డ్యూటీ చేసినందుకు.. కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు’
సాక్షి, బెంగుళూరు : తన కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు సస్పెన్షన్ రూపంలో బహుమానం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలికాప్టర్ తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారి మొహమ్మద్ మోసిన్ ఆవేదన వ్యక్తం చేశారు. విధుల మేరకు నడుచుకున్నందుకు నేడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. వివరాలు.. మోదీ మంగళవారం ఒడిశాలోని సంబల్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తున్న మహ్మద్ మోసిన్ అకస్మాత్తుగా మోదీ ప్రయాణించే హెలికాప్టర్లో తనిఖీలు చేపట్టారు. దీంతో మోదీ ప్రయాణం 15 నిమిషాలు ఆలస్యమైంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, డీఐజీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకుంది. మోసిన్‌ను వారం పాటు సస్సెండ్ చేస్తున్నట్టు బుధవారం వెల్లడించింది. అయితే, ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించడంతో.. మోసిన్ సస్పెన్షన్ రద్దు చేసింది. ‘కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి వాహనాలను అనేక సార్లు తనిఖీ చేశారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి వాహనాలను తనిఖీ చేశారు. మరి వారి వాహనాలను తనిఖీ చేసిన అధికారులపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు?’... ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్‌ను ఏప్రిల్ 16వ తేదీన తనిఖీ చేశారన్న కారణంగా మొహమ్మద్ మోసిన్ అనే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం పట్ల క్యాట్‌కు చెందిన బెంగళూరు బెంచ్ గురువారం ఎన్నికల కమిషన్ వర్గాలను ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో ‘ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)’ భద్రత ఉన్న వారి సముచిత భద్రత గురించి ఆలోచించాల్సిందే. అంతమాత్రాన తమ ఇష్టానుసారం నడుచుకునే అధికారం వారికుందని భావించరాదు. ఐఏఎస్ అధికారుల బ్లూ బుక్ ప్రకారం ఎస్పీజీ పరిరక్షణలో ఉన్న వారి విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయో, వాటి జోలికి మేము పోదల్చుకోలేదు. చట్టం ఎవరికైనా వర్తించాల్సిందే’ అని వ్యాఖ్యానించింది. క్యాట్ ఉత్తర్వులతో మోసిన్ సస్పెండ్ రద్దు కాగా అతను క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాలని ఈసీ స్పష్టం చేసింది. -
మరో వివాహం చేసుకున్నా పింఛన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి చనిపోయాక అతని భార్య మరో వివాహం చేసుకున్న తర్వాత కూడా పింఛన్ పొందేందుకు ఆమె అర్హురాలేనని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన రేణు గుప్తా అనే మహిళ పింఛన్‌కు సంబంధించిన కేసులో ఆదేశాలిస్తూ క్యాట్ ఈ విషయాన్ని ప్రస్తావించింది. రక్షణ శాఖలో పనిచేసే పవన్ కుమార్ గుప్తా 1990వ దశకం చివర్లో చనిపోయారు. ఆమె భార్య రేణు గుప్తాకు 1998లో ప్రభుత్వం కారుణ్య నియామకం కింద స్టోర్ కీపర్‌గా ఉద్యోగమిచ్చి పింఛన్ కూడా మంజూరు చేసింది. అయితే రేణు మరో వివాహం చేసుకున్న అనంతరం 2002లో పింఛన్‌ను తన కొడుకు కరణ్ గుప్తా పేరు మీదకు మార్చింది. సాధారణంగా కుమారుడికి 25 ఏళ్లు రాగానే పింఛన్ ఆగిపోతుంది. దీంతో 2013లో పింఛన్ ఆగిపోవడంతో మళ్లీ తనకే పింఛన్ ఇవ్వాలని రేణు కోరింది. భర్త చనిపోయిన 20 ఏళ్ల తర్వాత ఆమె పింఛన్ మార్పు కోరుతోందనీ, అందునా ఆమె ఇప్పుడు మరో పెళ్లి చేసుకుందనే కారణాలు చూపుతూ అధికారులు ఆమెకు పింఛన్‌ను ఇవ్వలేదు. దీంతో రేణు క్యాట్‌ను ఆశ్రయించారు. -
సివిల్ సర్వీసెస్ ఎంపిక రద్దు చేయడం చెల్లదు
సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యం ఉన్నట్లుగా అప్పిలేట్ మెడికల్ బోర్డు ధ్రువీకరించాక, అంగవైకల్య కోటాలో సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడాన్ని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రద్దు చేయడం చెల్లదని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలుకు చెందిన రిజ్వాన్ బాషా షేక్ అంగవైకల్యం కోటా కింద 2016లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై జాతీయ స్థాయిలో 48వ ర్యాంకు సాధించారు. బాషాకు 30 శాతం దృష్టి లోపం ఉన్నట్లు మెడికల్ బోర్డు ధ్రువీక రించింది. దీనిపై బాషా కేంద్ర వైద్య వ్యక్తిగత వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కి చెందిన అప్పిలేట్ మెడికల్ బోర్డులో అప్పీల్ చేసుకున్నారు. దృష్టి లోపం 40 శాతం ఉన్నట్లు అప్పీల్లో తేలింది. బాషా అంగవైకల్యంపై అందిన ఫిర్యాదును యూపీఎస్సీ చైర్మన్ నిపుణుల కమిటీకి నివేదించారు. నిపుణుల కమిటీ 30 శాతమే దృష్టి లోపం ఉందని 2017 నవంబర్ 7న తేల్చడంతో బాషా సివిల్ సర్వీసెస్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని బాషా క్యాట్‌లో సవాల్ చేయగా ఒకసారి మెడికల్ అప్పిలేట్ బోర్డు అంగవైకల్యాన్ని నిర్ధారించాక దాన్ని నిపుణుల కమిటీకి పంపడం సరికాదంది. సివిల్ సర్వీసెస్‌కు బాషా ఎంపికను రద్దు చేయడం చెల్లదని జస్టిస్ రెడ్డి కాంతారావు, సభ్యులు మిన్నీ మాథ్యూస్‌ల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
ఐఏఎస్‌ల హోదాపై క్యాట్ అసంతృప్తి
* ఆ ఆరుగురి పేర్లనూ యూపీఎస్సీకి పంపండి * కిరణ్ సర్కార్‌కు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్ హోదా (కన్ఫర్డ్) ఇచ్చేందుకు అధికారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని అభిప్రాయపడింది. ఐఏఎస్ హోదా పొందేందుకు అర్హులైన మరో ఆరుగురు అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు పంపాలని క్యాట్ ఆదేశించింది. వారి పేర్లు అందాకే అర్హుల జాబితా రూపొందించాలని జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐఏఎస్ హోదా పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నా తమ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపలేదంటూ ఐ.శ్రీనగేష్ (డీసీ, కమర్షియల్ ట్యాక్స్), ఎల్.శ్రీధర్‌రెడ్డి (డీపీవో), ఆర్.అమరేందర్‌కుమార్ (ఈడీ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్), పి.కృష్ణవేణి (రవాణాశాఖ), డి.శ్రీనివాస్ నాయక్, రాజ్‌కుమార్ (జీఎం, పరిశ్రమల విభాగం) దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ ధర్మాసనం విచారించింది. ఆరుగురికి ఐఏఎస్ హోదా కల్పించేందుకు ప్రభుత్వం 30 మంది అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపిందని, అయితే ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్ల తరఫున న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదించారు. 18 విభాగాల నుంచి అర్హులైన అధికారుల పేర్లు సాధారణ పరిపాలనా విభాగానికి (జీఏడీ) అందనే లేదని పేర్కొన్నారు. కొందరు అధికారుల వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)ల్లో వారి విభాగాల ఉన్నతాధికారులు సంతకాలు చేయలేదని...అందుకే వారి పేర్లను పంపలేదన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనను సుధీర్ కొట్టిపడేశారు. ఎవరో చేసిన తప్పులకు పిటిషనర్లను బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం...పిటిషనర్ల పేర్లను యూపీఎస్సీకి పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
డీజీపీ దినేష్ రెడ్డి పదవీకాలంపై విచారణ వాయిదా
హైదరాబాద్ : డీజీపీ దినేష్ రెడ్డి పదవీకాలం పొడిగింపు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) బుధవారానికి వాయిదా వేసింది. ఎల్లుండికల్లా దినేష్ రెడ్డి పదవీకాలం పొడిగిపుపై ప్రభుత్వం... క్యాట్‌కు సమాచారం ఇవ్వనుంది. అంతకు ముందు ప్రభుత్వ న్యాయవాది... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నందున దినేష్ రెడ్డి పదవీకాలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. డీజీపీగా దినేష్‌రెడ్డి కొనసాగింపుపై ఈనెల 23వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.