హైదరాబాద్, సాక్షి: ఏడేళ్లుగా సాగుతున్న.. ఏపీ-తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ వివాదం కేసును ముగించింది ఎట్టకేలకు ముగించింది తెలంగాణ హైకోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్- క్యాట్(Central Administrative Tribunal) తీర్పును ఉన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకే కేడర్ కేటాయింపు ఉండాలన్న కేంద్రం వాదనతో ఏకీభవించిన కోర్టు.. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తన తీర్పులో స్పష్టం చేసింది.
తాజా తీర్పులో.. ఏడేళ్ల కిందటి నాటి క్యాట్ తీర్పును కొట్టేయడంతో పాటుగా డీవోపీటీకి ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం కల్పించింది తెలంగాణ హైకోర్టు. అలాగే.. అధికారుల సీనియారిటీ, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అప్పటివరకు ఇప్పుడున్న రాష్ట్రాల్లోనే విధులు కొనసాగించాలని ఆదేశించింది.
‘‘ఈ 13 మంది బ్యూరో క్రాట్ లు క్యాడర్ కేటాయింపు అంశంపై కేంద్రాన్ని అభ్యర్థించాలి. అధికారులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలి. అధికారులు అవసరమైతే లీగల్‌గా ముందుకు వెళ్లొచ్చు. అధికారుల కేటాయింపుకు క్యాట్ లు ఎలాంటి హక్కు లేదు. బ్యూరో క్రాట్ ల కేటాయింపు కేవలం డీవోపీటీ పరిధిలో అంశమే’’ అని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.
వివాదం ఏంటంటే..
రాష్ట్ర విభజన సమయంలో 14 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది కేంద్రం పరిధిలోని డీవోపీటీ( Department of Personnel and Training). అయితే.. ఆ ఉత్తర్వుల్ని క్యాట్ కొట్టేసింది. తన కేటాయింపులు పక్కనపెట్టి మరీ క్యాట్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ 2016లో డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
తన పరిధి దాటి బ్యూరోక్రాట్ లపై క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ వచ్చింది. 2016 నుండి హైకోర్టు లో ఈ వివాదంపై విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కేటాయింపుల పై తుది వాదనలు ముగిశాయి. ఈ మధ్యలో కేడర్ కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కు పంపుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే.. సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ గత ఏడాది హైకోర్ట్ ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో.. మిగిలిన 13 మంది అధికారుల క్యాడేర్ కేటాయింపు పై తుది వాదనలు ఇవాళ జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment