
న్యూఢిల్లీ: రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా కేంద్ర అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆగస్టు 31న రైల్వే బోర్డు నుంచి పదవీ విరమణ పొందాక క్యాట్ సభ్యురాలిగా బాధ్యతలు చేపడతారు.
జయతో పాటు మరో 11 మందిని క్యాట్ సభ్యులుగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ హర్‌నరేశ్ సింగ్ గిల్, జస్టిస్ పద్మరాజ్ నేమచంద్ర దేశాయ్, వీణా కొతవాలే, రాజ్‌వీర్ సింగ్ వర్మలు క్యాట్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు.