railway board chairman
-
Jaya Verma Sinha: క్యాట్ సభ్యురాలిగా రైల్వే బోర్డు చైర్పర్సన్
న్యూఢిల్లీ: రైల్వే బోర్డు చైర్పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా కేంద్ర అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆగస్టు 31న రైల్వే బోర్డు నుంచి పదవీ విరమణ పొందాక క్యాట్ సభ్యురాలిగా బాధ్యతలు చేపడతారు. జయతో పాటు మరో 11 మందిని క్యాట్ సభ్యులుగా నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ హర్‌నరేశ్ సింగ్ గిల్, జస్టిస్ పద్మరాజ్ నేమచంద్ర దేశాయ్, వీణా కొతవాలే, రాజ్వీర్ సింగ్ వర్మలు క్యాట్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. -
ఆ రైళ్లను ఆపండి.. రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఎంపీ భరత్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పలు ప్రధానమైన రైళ్లు హాల్టులు, స్టాప్లకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈవో వీకే త్రిపాఠిని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోలను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి నగర ప్రాధాన్యత, సుదూర ప్రాంతాల నుండి నిత్యం ఇక్కడకు వచ్చే వ్యాపార, వాణిజ్య, యాత్రికులకు కావలసిన రైళ్లు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని ఎంపీ భరత్ త్రిపాఠికి తెలిపారు. హౌరా టు శ్రీ సత్య సాయి నిలయం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం టు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం - పూణే ఎక్స్‌ప్రెస్, చెన్నై-జాల్పిగురి సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కామాక్య యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి హెచ్ డబ్ల్యూ హెచ్ ఎక్స్‌ప్రెస్‌లు హాల్ట్స్, స్టాప్స్‌కు అనుమతి కోరారు. విమానాశ్రయం, ఓఎన్జీ బేస్ కాంప్లెక్స్, ఏపీ పేపర్ మిల్స్, జీఎస్కే హార్లిక్స్, మూడు గ్యాస్ పవర్ ప్రాజెక్ట్స్ తదితర అనేక పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కూడా రాజమండ్రికి చేరువలోనే ఉందన్నారు. విశాఖపట్నం- విజయవాడ నగరాలకు మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రంగా రాజమండ్రి నగరం అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. టూరిజం హబ్ గా శరవేగంగా రాజమండ్రి, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే యాత్రికులకు, టూరిస్టులకు, వ్యాపార, వాణిజ్య, వివిధ రంగాల వారికి అనువైన విధంగా రైళ్లు సదుపాయం లేకపోవడంతో చాలా కష్టంగా ఉంటోందని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠికి వివరించినట్టు ఎంపీ భరత్ తెలిపారు. అలాగే కొవ్వూరు రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లకు హాల్ట్స్, స్టాప్స్ ఆపివేశారని, వాటిని కూడా పునరుద్ధరించాలని త్రిపాఠిని కోరినట్లు ఎంపీ భరత్ తెలిపారు. బొకారో, సింహాద్రి, తిరుమల, తిరుపతి-పూరి, సర్కార్, కాకినాడ- తిరుపతి, మచిలీపట్నం- విశాఖ, రాయగడ-గుంటూరు, బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్ లను పునరుద్ధరించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. కొవ్వూరు, గోపాలపురం, తాళ్ళపూడి, పోలవరం మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలు కొవ్వూరు రైల్వే స్టేషను నుండి ప్రయాణం చేయాలని, అటువంటిది రైళ్ల హాల్ట్స్, స్టాప్స్ లేకపోవడంతో మరో 15 కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణించి రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు రావలసి వస్తోందన్నారు. నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించి, ఆరు నెలలు పరిశీలించాలని.. అప్పటికీ రైల్వే శాఖకు తగిన ఆదాయ వనరులు రాకుంటే మీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవచ్చని త్రిపాఠికి ఎంపీ భరత్ సూచించారు. అలాగే అనపర్తి, నిడదవోలులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి నుండి లోకల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కొనసాగించమని కోరినట్టు ఎంపీ భారత్ వివరించారు. తన అభ్యర్థనలపై రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠి సానుకూలంగా స్పందించారని ఎంపీ భరత్ తెలిపారు. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. వారికి భారీగా పెరగనున్న జీతాలు
రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. దీని ద్వారా దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు రూ.2500-4000 వరకు జీతాలు పెరుగుతాయని చెప్పారు. ఈ నిర్ణయంతో రైల్వే శాఖపై అదనపు భారమేమీ పడదని త్రిపాఠి స్పష్టం చేశారు. ఇందుకు తగినట్లు ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా రైల్వే శాఖ ఖర్చులు ఆదా చేస్తున్నట్లు వివరించారు. ఈ వేతనాల పెంపుతో ఉద్యోగ స్తబ్ధత ఎదుర్కొంటున్న వేల మంది రైల్వే సిబ్బంది గ్రూప్ ఏ అధికారులతో సమానంగా వేతనాలు పొందుతారని త్రిపాఠి వివరించారు. 80వేల మంది సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులు హై పే గ్రేడ్‌కు అర్హులు అవుతారని చెప్పారు. సూపర్వైజరీ క్యాడర్ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన డిమాండ్ 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని త్రిపాఠి వెల్లడించారు. తాజాగా నిర్ణయంతో 50 శాతం మంది లెవెల్7 ఉద్యోగులు లెవెల్ 8కు చేరుకునేందుకు మార్గం సుగమమైందని చెప్పారు. వేతనాల పెంపుతో స్టేషన్ మాస్టర్లు, టికెట్ చెకర్స్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వంటి 40వేల మంది ఫీల్డ్ లెవెల్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని త్రిపాఠి వివరించారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్రను ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
రైల్వేలో యూజర్ చార్జీల బాదుడు
న్యూఢిల్లీ: ఆధునీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో రైల్ టికెట్ ధరతో కలిపి యూజర్ చార్జీలు వసూలు చేస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయార్జనలో భాగంగా వీటిని వసూలు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. చార్జీలు భారీగా ఉండవని యాదవ్ చెప్పారు. దేశంలోని 7 వేల రైల్వే స్టేషన్లలో 10–15 శాతం స్టేషన్లలో వీటిని అమలు చేస్తామన్నారు. ఒకసారి స్టేషన్ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ చార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని, అప్పటివరకు ఈ సొమ్మును స్టేషన్ అభివృద్దికి వినియోగిస్తామని వివరించారు. రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించిన వేళ టికెట్ల ధరలు పెరుగుతాయన్న ఆందోళనల మధ్య ఈ ప్రకటన వచ్చింది. రైలోపోలిస్ హబ్స్.. ప్రస్తుతం దాదాపు 50 స్టేషన్లను ఆధునీకరించాలని రైల్వే భావిస్తోంది. ఆయా స్టేషన్ల కింద ఉన్న భూములను 60 ఏళ్లపాటు వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలని యోచిస్తోంది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్ హబ్స్‌ను రైలోపోలిస్‌గా పిలుస్తారు. త్వరలో దేశ వృద్ధిలో రైల్వేల వాటా 2 శాతానికి పెరగవచ్చని నీతి అయోగ్ సీఈవో అమితాబ్æ అన్నారు. స్టేషన్ల ఆధునీకరణలో జాప్యాన్ని ఇటీవల నీతీఆయోగ్ ప్రశ్నించింది. అనంతరం 50 స్టేషన్ల అభివృద్ధి ప్రణాళికల కోసం ఉన్నతాధికారులతో సాధికార గ్రూప్‌ను ఏర్పరిచింది. -
త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లు
న్యూఢిల్లీ: కరోనా ముప్పు నేపథ్యంలో.. అన్ని రెగ్యులర్ రైళ్లను నడపడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాకపోవచ్చని శుక్రవారం రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ పేర్కొన్నారు. అయితే, త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నామన్నారు. సొంతూళ్లకు వెళ్లిన వలస కూలీలు మళ్లీ ఉపాధి కోసం నగరాల బాట పట్టడం సంతోషకరమని, ఆర్థిక రంగం కుదుటపడుతోందనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఆక్యుపెన్సీని పరిశీలిస్తున్నామని, రాష్ట్రాలు కోరితే మరిన్ని సమకూర్చేందుకు సిద్ధమేనని తెలిపారు. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి శ్రామికులు ఎక్కువగా తాము గతంలో పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారన్నారు. జూన్ 25 వరకు మొత్తం 4,594 శ్రామిక్ రైల్ సర్వీసులను నడిపామని, మే 1వ తేదీ నుంచి మొత్తం 62.8 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామని వివరించారు. కోవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కోచ్‌ల నిర్వహణ, ఆహారం, సిబ్బందికి రక్షణ పరికరాలు.. తదితరాల కోసం ఒక్కో కోచ్‌కు సుమారు రూ.2 లక్షలు ఖర్చు అయిందని వీకే యాదవ్ వెల్లడించారు. ఇప్పటికి 5,213 ఐసోలేషన్ కోచ్‌లను ఏర్పాటు చేశామని, నిధులు కేంద్ర కోవిడ్ కేర్ ఫండ్ నుంచి అందాయని తెలిపారు. -
రైల్వే ఇక మేడిన్ ఇండియా
న్యూఢిల్లీ : స్వదేశీ ఉత్పత్తుల్ని మాత్రమే వాడాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే దిగుమతులను సంపూర్ణంగా తగ్గించిందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. చైనాకు చెందిన సంస్థ నుంచి సిగ్నలింగ్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించిన తర్వాత ఇక రైల్వేలో దిగుమతులు సున్నా స్థాయికి చేరుకున్నాయని యాదవ్ చెప్పారు. రైల్వేలలో దిగుమతుల్ని నిలిపివేయడమే కాకుండా, రైల్వే ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేలా కృషి చేస్తున్నామన్నారు. రైల్వే టెండర్లకు ఇక స్వదేశీ సంస్థలకే ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేశారు. రైల్వేలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చైనా కంపెనీలపై నిషేధం విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అధిక భాగం స్వదేశీ బిడ్డర్లకే అవకాశం ఉంటుందని వెల్లడించారు. గత రెండు, మూడేళ్లుగా దిగుమతుల్ని తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు. -
వచ్చే10 రోజుల్లో 2,600 శ్రామిక్ రైళ్లు
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకురానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటి ద్వారా 36 లక్షల మంది వలస కార్మికులకు లాభం కలుగుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. ‘రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి బయలుదేరే శ్రామిక్ రైళ్లలో ప్రయాణించే వారి కోసం ఇప్పటికే ఉన్న వెయ్యి టికెట్ కౌంటర్లకు అదనంగా మరికొన్నిటిని ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు. 80 శాతం ఆ రెండు రాష్ట్రాలకే.. శ్రామిక్ రైళ్లలో 80 శాతం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకే వెళ్తున్నందున ఆ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని, దీనిని నివారించేందుకే కొన్ని రైళ్లను దూరమైనా సరే రద్దీలేని మార్గాలకు దారి మళ్లిస్తున్నామని యాదవ్ వెల్లడించారు. కోవిడ్ రోగుల కోసం రూపొందించిన 5,213 కోచ్‌లలో సగం వరకు ఈ రైళ్లలో వాడుతున్నామన్నారు. ప్రస్తుతానికి ఈ కోచ్‌లు ఖాళీగా ఉన్నాయనీ, కోవిడ్ బాధితుల కోసం రాష్ట్రాలు కోరితే అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘రైల్వే శాఖకు చెందిన 17 ఆస్పత్రులను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాం. ఏప్రిల్ 1– మే 22వ తేదీల మధ్య 9.7 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను రైళ్ల ద్వారా తరలించాం. మార్చి 22 నుంచి ఇప్పటి వరకు 3,255 పార్శిల్ ప్రత్యేక రైళ్లను నడిపాం’ అని వీకే యాదవ్ పేర్కొన్నారు. ‘జూన్ 1వ తేదీ నుంచి నడిచే 200 స్పెషల్ రైళ్లలో ప్రస్తుతానికి రిజర్వేషన్ ఉన్న వారికే అవకాశం కల్పిస్తున్నాం ఈ రైళ్లలో 30 శాతం టికెట్లే రిజర్వు అయ్యాయి. ప్రయాణించదలచిన వారికి 190 రైళ్లలో సీట్లు ఖాళీగా ఉన్నాయి’అని వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల్లో ఉన్న 4 కోట్ల మంది వలస కార్మికుల్లో ఇప్పటి వరకు 75 లక్షల మందిని సొంతూళ్లకు తరలించినట్లు హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. శ్రామిక్ రైళ్లలో 35 లక్షల మందిని సొంతూళ్లకు తరలించగా, మరో 40 లక్షల మంది బస్సుల్లో తమ గమ్య స్థానాలకు చేరుకున్నారని ఆమె అన్నారు. -
‘కొత్త’ రైల్వేస్టేషన్లలో యూజర్ చార్జీ!
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులపై విధించేలాంటి యూజర్ చార్జీలను కొత్తగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో విధించనున్నారు. దీంతో రైల్వే చార్జీల్లో కూడా పెంపు ఉంటుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. యూజర్ డెవలప్మెంట్ ఫీ (యూడీఎఫ్) అనేది విమానాల్లో ప్రయాణికుడు చెల్లించే పన్నుల్లో భాగంగా ఉంటుంది. దీన్ని పలు ఎయిర్‌పోర్టుల్లో విధిస్తున్నారు. ఈవిధంగా వసూలు చేసే చార్జీ ఒక్కో స్టేషన్లో ఒక్కో రకంగా ఉంటుందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ ఇక్కడి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎంత చార్జీ వసూలు చేస్తామనే విషయం మంత్రిత్వ శాఖ త్వరలో తెలియజేస్తుందని అన్నారు. అమృత్సర్, నాగ్‌పూర్, గ్వాలియర్, సబర్మతి రైల్వే స్టేషన్లను రూ.1,296 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేయడంకోసం రైల్వే ప్రతిపాదనలు చేసిందన్నారు. ‘వసూలు చేసిన చార్జీ స్టేషన్ల ఆధునీకరణకు తోడ్పడుతుంది. చార్జీలు నామమాత్రంగానే ఉంటాయి’అని యాదవ్ పేర్కొన్నారు. -
హైస్పీడ్ రైల్వే కోసం కారిడార్ల గుర్తింపు
న్యూఢిల్లీ: దేశంలోని 6 మార్గాల్లో హైస్పీడ్, సెమీస్పీడ్ కారిడార్లను గుర్తించినట్లు రైల్వేశాఖ బుధవారం తెలిపింది. ఈ మార్గాలపై ఏడాదిలోపు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్) తయారవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ చెప్పారు. హైస్పీడ్ కారిడార్‌లో రైళ్లు గంటకు 300 కి.మీ.ల వేగంతో, సెమీస్పీడ్ కారిడార్‌లో 160 కిలోమీటర్ల వేగంతో నడవనున్నాయి. ఈ కారిడార్లలో ఢిల్లీ–నోయిడా–ఆగ్రా–లక్నో–వారణాసి, ఢిల్లీ–జైపూర్–ఉదయ్‌పూర్–అహ్మదాబాద్, ముంబై–నాసిక్–నాగ్‌పూర్, ముంబై–పుణే–హైదరాబాద్, చెన్నై–బెంగళూరు–మైసూర్, ఢిల్లీ–లూథియానా–జలంధర్–అమృత్సర్ ఉన్నాయి. స్థల సేకరణ, అక్కడ ఉండే ట్రాఫిక్ వంటి వివరాల ఆధారంగా ఆయా సెక్షన్లను హైస్పీడ్ లేదా సెమీస్పీడ్ కారిడార్లుగా గుర్తిస్తామని చెప్పారు. రానున్న ఆరు నెలల్లోనే 90శాతం భూసేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. 2023కల్లా దేశంలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని చెప్పారు. 2021కల్లా ఆర్ఎఫ్ఐడీ టాగ్లు.. దేశంలోని సుమారు మూడున్నర లక్షల రైల్వే కోచ్‌లు, వాగన్లకు 2021కల్లా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) పూర్తి చేస్తామని రైల్వేశాఖ అధికారులు చెప్పారు. దాదాపు రూ. 112 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 22 వేల వాగన్లు, 1200 కోచ్‌లకు ఆర్ఎఫ్ఐడీ టాగ్లు పూర్తిచేసినట్లు తెలిపారు. దీనివల్ల రైళ్లను సులువుగా ట్రాక్ చేయవచ్చని, సమయానుగుణంగా నడిచేలా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. -
ఈ రూట్లలో నో వెయిటింగ్ లిస్టు
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కోల్‌కతా మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు ఉండదని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ చెప్పారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సరుకు రావాణా కారిడార్లు (డీఎఫ్సీ) 2021 కల్లా పూర్తి కానున్న నేపథ్యంలో రైళ్ల రద్దీ తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. రూ.2.6 లక్షల కోట్లతో నిర్మించనున్న డీఎఫ్‌సీల నిర్మాణం పూర్తయితే సరుకు రవాణా రైళ్లు ఈ మార్గాల్లో వెళ్తాయి. దీంతో రైళ్ల వేగం పెంచడంతోపాటు ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు రైళ్లను నడపవచ్చాన్నారు. ఫలితంగా ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు ఉండదని పేర్కొన్నారు. రైళ్లలో నేరాలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వినోద్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2022 మార్చి నాటికల్లా అన్ని రైల్వే స్టేషన్లు, బోగీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆందోళనల్లో రైల్వేకు వాటిల్లిన రూ.80 కోట్ల ఆస్తి నష్టాన్ని బాధ్యులైన వారి నుంచే వసూలు చేస్తామని వినోద్ యాదవ్ సోమవారం ప్రకటించారు. ఇందులో తూర్పు రైల్వేకు రూ.70 కోట్లు, ఈశాన్య రైల్వేకు రూ.10 కోట్ల నష్టం జరిగింది. -
రైల్వే చార్జీల హేతుబద్ధీకరణ
న్యూఢిల్లీ: ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను హేతుబద్ధీకరించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వై.కె.యాదవ్ గురువారం వెల్లడించారు. అయితే, ఛార్జీలు పెరుగుతాయా? అన్నదానిపై సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు. ఇది చాలా సున్నితమైన విషయమని విస్తృత చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తగ్గుతున్న ఆదాయాన్ని పెంచేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టామన్నారు. సరుకు రవాణా చార్జీలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్డు ప్రయాణికులను రైల్వే వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆర్థిక మందగమనం కారణంగా రైల్వే ఆదాయంలో తగ్గుదల నమోదవడం తెల్సిందే. రైల్వే నిర్వహణకు ఐదు విభాగాలు రైల్వేలలో ఇకపై యూపీఎస్సీ తరహాలో ఐదు ప్రత్యేక విభాగాలకు నియామకాలు జరుగుతాయని రైల్వే బోర్డు చైర్మన్ యాదవ్ తెలిపారు. యూపీఎస్సీ మాదిరిగానే ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐఆర్ఎంఎస్) కోసం ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని అందులో విజయం సాధించిన వారు ఐదు విభాగాల్లో ఒకదాన్ని ఎంచుకుంటారని ఆయన వివరించారు. ఈ ఐదు ప్రత్యేక విభాగాల్లో నాలుగు సివిల్, మెకానికల్, టెలికామ్, ఎలక్ట్రికల్ వంటి ఇంజినీరింగ్ సేవలు కాగా, మిగిలిన నాన్ టెక్నికల్ విభాగం కింద అకౌంట్స్, పర్సనెల్, ట్రాఫిక్ వంటివి ఉంటాయని చెప్పారు. చివరి విభాగంలో ఉద్యోగం కోసం హ్యుమానిటీస్ చదువుకున్న వారూ అర్హులేనని, అందరికీ ఒకేసారి పదోన్నతులు దక్కుతాయని తెలిపారు. రైల్వే బోర్డు చైర్మన్ ఇకపై రైల్వేల సీఈవోగా ఉంటారు. ఇండియన్ రైల్వే సర్వీస్ అధికారే ఈ పదవి చేపట్టనున్నారు. సీనియారిటీకి ఢోకా లేదు: పీయూష్ గోయెల్ రైల్వేలోని వివిధ విభాగాలను ఒక్కటిగా చేయడం వల్ల అధికారుల సీనియారిటీకి ఇబ్బంది కలగబోదని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. ప్రతిభ, సీనియారిటీల ఆధారంగా రైల్వే బోర్డులో సభ్యులయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. -
రైల్వే బోర్డు చైర్మన్‌తో భేటీ అయిన విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ : రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్‌తో ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రైల్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వేలో వాల్తేరు డివిజన్‌ను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ గురించి విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. కాగా వాల్తేరు డివిజన్ అంశంపై వినోద్‌కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైళ్ళు, రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం గతంలో చేసిన విజ్ఞప్తుల గురించి కూడా విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైళ్ళను ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం బోర్డు పరిశీనలో ఉన్నట్లు యాదవ్ తెలిపారు. దేశంలోని అత్యధిక ఆదాయం కలిగిన రైల్వే డివిజన్లలో వాల్తేరు డివిజన్ అయిదో స్థానంలో ఉంది. 125 ఏళ్ళ చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి దానిని విజయవాడ డివిజన్ కిందకు తీసుకురావాలన్న ప్రతిపాదన ఆర్ధిక భారంతో కూడుకున్నదని రాష్ట్ర ప్రజల మనోభావాలకు ఏ విధంగా విరుద్దమో విజయసాయి రెడ్డి బోర్డు చైర్మన్‌కు వివరించారు. రైల్వే చరిత్రలోనే ఎక్కడా ఇలా డివిజన్‌ను రద్దు చేసిన దృష్టాంతాలు లేవని తెలిపారు. దీనిపై యాదవ్ స్పందిస్తూ వాల్తేరు డివిజన్ కొనసాగింపుపై బోర్డు సానుకూలంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టాల్సిన రైళ్ళ గురించి విజయసాయి రెడ్డి బోర్డు చైర్మన్‌కు వివరించారు. డోన్, నంద్యాల మీదుగా కర్నూలు - విజయవాడ మధ్య రాత్రి వేళ కొత్త రైలును ప్రవేశపెట్టాలని కోరారు. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య కొత్తగా తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టాలని, మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ మధ్య ప్రస్తుతం వారానికి మూడు రోజులు నడుస్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్ ఉదయం 7 గంటలకు చేరేలా ప్రతి రోజు నడపాలని తెలిపారు. తిరుపతి-సాయి నగర్ షిరిడీ వయా గూడూరు, నెల్లూరు, ఒంగోలు మధ్య కొత్త రైలును ప్రవేశపెట్టాలని, తిరుపతి-వారణాసి మధ్య రైలు సర్వీసును ప్రవేశపెట్టాలని కోరారు. ధర్మవరం-విజయవాడ మధ్య నడుస్తున్న రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించి ఉదయం 7 గంటలకల్లా విజయవాడ చేరేలా మార్చాలని, అలాగే విజయవాడ - బెంగుళూరు మధ్య ఒంగోలు, నెల్లూరు మీదుగా రైలును ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. హైదరాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ రైళ్ళ ప్రయాణ వేగాన్ని పెంచాలని కూడా విజయసాయి రెడ్డి బోర్డు చైర్మన్‌ను కోరారు. -
రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్‌కుమార్
-
రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌కు పదోన్నతి లభిం చింది. భారత రైల్వే బోర్డు చైర్మన్‌గా, భారత ప్రభుత్వ ఎక్స్అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఉన్నతస్థాయి నియామకాల మంత్రివర్గ కమిటీ సోమవారం ఆయన నియామకాన్ని ఆమోదించింది. ప్రస్తుత చైర్మన్ అశ్వనీ లొహానీ తర్వాత వినోద్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. 1982లో రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా వినోద్‌కుమార్ ప్రస్థానం ప్రారంభమైంది. రైల్వేతో పాటు భారత ప్రభుత్వ పరిశ్రమల శాఖ, రైల్ వికాస్ నిగమ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు. 2017–18లో దక్షిణమధ్య రైల్వే రూ.13,673 కోట్ల రికార్డు ఆదాయం సాధించడంలో ఆయన కృషి విశేషమైంది. 2018లో ఆరు ఎక్స్అఫీషియో అవార్డులు, ప్రతిష్టాత్మక పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ పురస్కారం కూడా దక్షిణమధ్య రైల్వే అందుకుంది. -
ఇంజిన్ రహిత రైలు
చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరిన తొలి ఇంజిన్ రహిత రైలు ట్రైన్ 18. సోమవారం రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్విని లోహాని జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు.. మరిన్ని పరీక్షలు పూర్తిచేసుకున్న తరువాత శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. సెమీ హైస్పీడ్ రకానికి చెందిన ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. – కొరుక్కుపేట (చెన్నై) -
రైళ్లలో వ్యర్థాలకు ట్రాష్ బ్యాగులు!
న్యూఢిల్లీ: ఇక నుంచి విమానాల్లో మాదిరిగా రైళ్లల్లోనూ ప్రయాణికుల నుంచి వ్యర్థాలను ట్రాష్ బ్యాగుల్లో సేకరించేలా చర్యలు చేపట్టాలని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహాని అధికారులను ఆదేశించారు. డివిజన్ లెవల్ ఆఫీసర్లు, బోర్డు సభ్యులతో 17న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైళ్లలో పరిశుభ్రతను పెంచేందుకు ప్రయాణికుల భోజనాల అనంతరం ప్యాంట్రీ సిబ్బంది ఆ ప్లేట్లను బ్యాగుల్లో సేకరించాలని సూచించారు. సాధారణంగా భోజనం తిన్న తర్వాత ప్రయాణికులు ప్లేట్లను బెర్త్‌ల కింద పెడుతుంటారని, సిబ్బంది వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి తీసుకెళ్లడం వల్ల అందులోని వ్యర్థాలు కింద పడి బోగీలు అపరిశుభ్రంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ట్రాష్ బ్యాగును ప్రయాణికుడి వద్దకు తీసుకెళ్లే వ్యర్థాలనూ వారు అందులో వేస్తారని అన్నారు. -
త్వరలో రైల్వే టికెట్లపై డిస్కౌంట్లు!
న్యూఢిల్లీ: విమానాలు, హోటళ్ల తరహాలోనే త్వరలో సీట్లు భర్తీకాని రైళ్లలో టికెట్ ధరలో డిస్కౌంట్ అందజేస్తామని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులతో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న గోయల్.. డిస్కౌంట్లు ఇచ్చే ప్రతిపాదనను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. భర్తీకాని రైళ్లలో టికెట్లను డిస్కౌంట్ ధరలకు అందించడంపై రైల్వేబోర్డు చైర్మన్ అశ్వినీ లోహానీ అనుభవం తమకు ఉపయోగపడుతుందన్నారు. పండుగ సీజన్లలో, వారాంతాల్లో, రద్దీ తక్కువగా ఉండేకాలంలో టికెట్ ధరల్ని సవరించేందుకు ఫ్లెక్సీ ఫేర్ వ్యవస్థలో మార్పులు చేస్తామన్నారు. మహిళల భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీటీవీలను అమర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
సురక్షిత ప్రయాణానికి భద్రతా సిబ్బందే కీలకం
రైళ్ల నిర్వహణకు సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్ వెన్నెముక ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ సదస్సులో రైల్వేబోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైళ్ల నిర్వహణలో, లక్షలాది మందికి సురక్షితమైన, పూర్తి భద్రత కలిగిన రవాణా సదుపాయాన్ని అందజేయడంలో సిగ్నలింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ (ఎస్‌అండ్‌టీ) విభాగం విధి నిర్వహణే అత్యంత కీలకమైందని రైల్వేబోర్డు చెర్మైన్ ఏకే మిట్టల్ అన్నారు. ప్రపంచంలోనే రైల్వే నెట్‌వర్క్‌ను మించింది మరొకటి లేదని.. దీని ద్వారా ప్రజలు పూర్తి భద్రతతో ప్రయాణం చేయగలరని అన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ రైల్ కళారంగ్‌లో ‘భారతీయ రైల్వేలో భద్రత-సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్ విభాగం పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన రైల్వే భద్రతా విభాగం కార్మికులకు పిలుపునిచ్చారు. రైళ్ల వేగాన్ని పెంచడం వల్ల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా మాట్లాడుతూ.. భద్రతా విభాగంలో పని చేస్తున్న సాంకేతిక సిబ్బంది తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి, అంచనా వేసుకోవడానికి ఇలాంటి సదస్సులు స్ఫూర్తినిస్తాయన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య మాట్లాడుతూ.. భద్రతా విభాగంలో పని చేస్తున్న ఎస్‌అండ్‌టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తాము ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైల్వేబోర్డు అదనపు సభ్యులు అఖిల్ అగర్వాల్, దక్షిణమధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఏకే గుప్తా, ఎన్ఎఫ్ఐఆర్ అధ్యక్షులు గుమన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆదాయం పెంచుకోవడమే ప్రాజెక్టుల లక్ష్యం ఈ సదస్సు కంటే ముందు సికింద్రాబాద్ రైల్‌నిలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో రైల్వేబోర్డు చైర్మన్ మిట్టల్ మాట్లాడారు. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. అనంతరం ఆయన సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే కేంద్ర ఆసుపత్రిలో 15 పడకల డయాలసిస్ విభాగాన్ని ప్రారంభించారు.