సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌కు పదోన్నతి లభిం చింది. భారత రైల్వే బోర్డు చైర్మన్‌గా, భారత ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఉన్నతస్థాయి నియామకాల మంత్రివర్గ కమిటీ సోమవారం ఆయన నియామకాన్ని ఆమోదించింది. ప్రస్తుత చైర్మన్ అశ్వనీ లొహానీ తర్వాత వినోద్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. 1982లో రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా వినోద్‌కుమార్ ప్రస్థానం ప్రారంభమైంది. రైల్వేతో పాటు భారత ప్రభుత్వ పరిశ్రమల శాఖ, రైల్ వికాస్ నిగమ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు. 2017–18లో దక్షిణమధ్య రైల్వే రూ.13,673 కోట్ల రికార్డు ఆదాయం సాధించడంలో ఆయన కృషి విశేషమైంది. 2018లో ఆరు ఎక్స్‌అఫీషియో అవార్డులు, ప్రతిష్టాత్మక పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ పురస్కారం కూడా దక్షిణమధ్య రైల్వే అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment