Vinod Kumar Yadav
-
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్తను అందించింది. అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు రైల్వేబోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి రిజర్వేషన్లు ప్రక్రియ సైతం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో రైళ్లు నడిపేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. రైళ్ల జాబితా కోసం ఇక్కడి క్లిక్ చేయండి.. -
‘కొత్త’ రైల్వేస్టేషన్లలో యూజర్ చార్జీ!
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులపై విధించేలాంటి యూజర్ చార్జీలను కొత్తగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో విధించనున్నారు. దీంతో రైల్వే చార్జీల్లో కూడా పెంపు ఉంటుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. యూజర్ డెవలప్మెంట్ ఫీ (యూడీఎఫ్) అనేది విమానాల్లో ప్రయాణికుడు చెల్లించే పన్నుల్లో భాగంగా ఉంటుంది. దీన్ని పలు ఎయిర్‌పోర్టుల్లో విధిస్తున్నారు. ఈవిధంగా వసూలు చేసే చార్జీ ఒక్కో స్టేషన్లో ఒక్కో రకంగా ఉంటుందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ ఇక్కడి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎంత చార్జీ వసూలు చేస్తామనే విషయం మంత్రిత్వ శాఖ త్వరలో తెలియజేస్తుందని అన్నారు. అమృత్సర్, నాగ్‌పూర్, గ్వాలియర్, సబర్మతి రైల్వే స్టేషన్లను రూ.1,296 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేయడంకోసం రైల్వే ప్రతిపాదనలు చేసిందన్నారు. ‘వసూలు చేసిన చార్జీ స్టేషన్ల ఆధునీకరణకు తోడ్పడుతుంది. చార్జీలు నామమాత్రంగానే ఉంటాయి’అని యాదవ్ పేర్కొన్నారు. -
ఇకపై అన్ని రైళ్లలోనూ ఆ సేవలు..!
న్యూఢిల్లీ: ప్రయాణికుల ప్రయాణం ఇకపై మరింత సురక్షితంగా, సుఖవంతం చేసే క్రమంలో భారతీయ రైల్వే సేవలను మరింత విస్తృత పరచనుంది. 2022 మార్చి కల్లా ప్రతి రైల్వే స్టేషన్లోనూ, రైలులోని ప్రతి బోగీలోనూ సీసీ కెమెరాలను అమరుస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 530 రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చదవండి: కెనడాలో ఘోర రైలు ప్రమాదం..13మంది మృతి రైల్వేబోర్డు చైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్, రైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే టెండర్లను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.500 కోట్ల నిర్భయ ఫండ్ నిధులు వచ్చాయన్నారు. 6,100 స్టేషన్లు, 58 వేలకు పైగా రైల్వే బోగిల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు రైల్వేశాఖ రూ.2,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఫేసియల్ రికగ్నేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిందితులను గుర్తిస్తాం. ప్యాసింజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కెమెరాలను కామన్ ఏరియాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు . రైళ్లను కూడా ఆన్‌టైమ్‌కు నడిచేలా చేయడానికి, ఆటోమేటిక్ చార్ట్ ప్రిపరేషన్ వంటి వాటి కోసం ఇస్రోతో కలిసి పనిచేస్తున్నట్లు వీకే యాదవ్ తెలిపారు. రైల్వే బోర్డు చైర్మన్ పదవీకాలం పెంపు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ పదవీ కాలం మరో ఏడాది పొడిగించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆయన పదవీకాలం పొడిగింపును ఆమోదించింది. తాజా నిర్ణయంతో 2020 జనవరి 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. 2019 జనవరి 1న వీకే యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. -
రైల్వే బోర్డు చైర్మన్‌తో భేటీ అయిన విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ : రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్‌తో ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రైల్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వేలో వాల్తేరు డివిజన్‌ను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ గురించి విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. కాగా వాల్తేరు డివిజన్ అంశంపై వినోద్‌కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైళ్ళు, రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం గతంలో చేసిన విజ్ఞప్తుల గురించి కూడా విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైళ్ళను ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం బోర్డు పరిశీనలో ఉన్నట్లు యాదవ్ తెలిపారు. దేశంలోని అత్యధిక ఆదాయం కలిగిన రైల్వే డివిజన్లలో వాల్తేరు డివిజన్ అయిదో స్థానంలో ఉంది. 125 ఏళ్ళ చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి దానిని విజయవాడ డివిజన్ కిందకు తీసుకురావాలన్న ప్రతిపాదన ఆర్ధిక భారంతో కూడుకున్నదని రాష్ట్ర ప్రజల మనోభావాలకు ఏ విధంగా విరుద్దమో విజయసాయి రెడ్డి బోర్డు చైర్మన్‌కు వివరించారు. రైల్వే చరిత్రలోనే ఎక్కడా ఇలా డివిజన్‌ను రద్దు చేసిన దృష్టాంతాలు లేవని తెలిపారు. దీనిపై యాదవ్ స్పందిస్తూ వాల్తేరు డివిజన్ కొనసాగింపుపై బోర్డు సానుకూలంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టాల్సిన రైళ్ళ గురించి విజయసాయి రెడ్డి బోర్డు చైర్మన్‌కు వివరించారు. డోన్, నంద్యాల మీదుగా కర్నూలు - విజయవాడ మధ్య రాత్రి వేళ కొత్త రైలును ప్రవేశపెట్టాలని కోరారు. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య కొత్తగా తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టాలని, మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ మధ్య ప్రస్తుతం వారానికి మూడు రోజులు నడుస్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్ ఉదయం 7 గంటలకు చేరేలా ప్రతి రోజు నడపాలని తెలిపారు. తిరుపతి-సాయి నగర్ షిరిడీ వయా గూడూరు, నెల్లూరు, ఒంగోలు మధ్య కొత్త రైలును ప్రవేశపెట్టాలని, తిరుపతి-వారణాసి మధ్య రైలు సర్వీసును ప్రవేశపెట్టాలని కోరారు. ధర్మవరం-విజయవాడ మధ్య నడుస్తున్న రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించి ఉదయం 7 గంటలకల్లా విజయవాడ చేరేలా మార్చాలని, అలాగే విజయవాడ - బెంగుళూరు మధ్య ఒంగోలు, నెల్లూరు మీదుగా రైలును ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. హైదరాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ రైళ్ళ ప్రయాణ వేగాన్ని పెంచాలని కూడా విజయసాయి రెడ్డి బోర్డు చైర్మన్‌ను కోరారు. -
రైళ్ల భద్రతకు యూరోపియన్ పరిజ్ఞానం
సాక్షి, హైదరాబాద్, తార్నాక: రైళ్లు ఢీకొనకుండా యూరప్ దేశాల్లో అమలులో ఉన్న సాంకేతిక వ్యవస్థను భారతీయ రైల్వేలో ప్రవేశపెట్టే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. యూరోపియన్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టం (యూటీసీఎస్)గా పిలుచుకునే ఈ సాంకేతికతను త్వరలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్టు తెలిపారు. స్వర్ణ చతుర్భుజి కారిడార్‌లో త్వరలో 650 కి.మీ. మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి పనితీరు పరిశీలిస్తామని వెల్లడించారు. ఆదివారం జరిగిన ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్ (ఇరిసెట్) 62వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైళ్ల భద్రతపై కీలక వివరాలు వెల్లడించారు. రైల్వే ఉద్యోగులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ఇరిసెట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మాట్లాడుతూ, సరైన ఫలితాలు సాధించాలంటే మంచి సాంకేతిక పరిజ్ఞానం, మంచి నైపుణ్యం అవసరమని, వాటిని సొంతం చేసుకునేందుకు ఇక్కడి శిక్షణార్థులు మెరుగ్గా రాణించాలని సూచించారు. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కూడా మాట్లాడారు. జ్ఞానదీప్ పేరుతో ఇరిసెట్ రూపొందించిన పత్రికను వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. ఐఆర్ఐఎఫ్ఎం ప్రారంభం రైల్ వికాస్ నిగమ్ ఆధ్వర్యంలో రూ.85 కోట్ల వ్యయంతో మౌలాలిలో నిర్మించిన ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఐఆర్ఐఎఫ్ఎం) నూతన క్యాంపస్‌ను వినోద్‌కుమార్ ప్రారంభించారు. రైల్వేలోని ఆర్థికపరమైన అంశాలను చూసే విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ప్రారంభించారు. -
రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్‌కుమార్
-
రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌కు పదోన్నతి లభిం చింది. భారత రైల్వే బోర్డు చైర్మన్‌గా, భారత ప్రభుత్వ ఎక్స్అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఉన్నతస్థాయి నియామకాల మంత్రివర్గ కమిటీ సోమవారం ఆయన నియామకాన్ని ఆమోదించింది. ప్రస్తుత చైర్మన్ అశ్వనీ లొహానీ తర్వాత వినోద్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. 1982లో రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా వినోద్‌కుమార్ ప్రస్థానం ప్రారంభమైంది. రైల్వేతో పాటు భారత ప్రభుత్వ పరిశ్రమల శాఖ, రైల్ వికాస్ నిగమ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు. 2017–18లో దక్షిణమధ్య రైల్వే రూ.13,673 కోట్ల రికార్డు ఆదాయం సాధించడంలో ఆయన కృషి విశేషమైంది. 2018లో ఆరు ఎక్స్అఫీషియో అవార్డులు, ప్రతిష్టాత్మక పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ పురస్కారం కూడా దక్షిణమధ్య రైల్వే అందుకుంది. -
యాదవ్ జీ.. ఆలకించరూ!
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ గురువారం కర్నూలుకు రానున్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన ఉదయం 9–30గంటలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ చేసుకుంటారు. స్టేషన్, స్టాల్స్, అభివృద్ధి పనులు, క్వార్టర్స్, అతిథి గృహాలను పరిశీలించి జిల్లాలో పెండింగ్ పనుల వివరాలపై ఆరాతీయనున్నారు. కర్నూలు (రాజ్‌విహార్): రైల్వే ప్రాజెక్టుల విషయంలో జిల్లాకు ప్రతిసారీ అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రతి బడ్జెట్లో ఇదే తీరు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆదే నిరాశ. రైల్వే ప్రాజెక్టుల పురోగతికి పట్టిన గ్రహణం వీడటం లేదు. జిల్లాలో ఓ డివిజన్ లేదు. రైళ్ల రాకపోకలకు డబుల్ ట్రాక్ లేదు. కర్నూలు మీదుగా గరీబ్రథ్లు లేవు. పలు సూపర్ ఫాస్టులకు స్టాపింగ్‌లు లేవు. ప్రయాణికులకు మెరుగైన సేవలు పక్కనపెడితే కనీస సౌకర్యాలు లేవు. కర్నూలును ఒక డివిజన్లో, డోన్‌ను మరో డివిజన్లో కలిపి పురోగతికి రెడ్ సిగ్నల్ ఇచ్చారు. డిమాండ్లు.. అవసరమయ్యే నిధులు.. ♦ కర్నూలు– మంత్రాలయం లైన్.. మంత్రాలయం – కర్నూలు మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 48ఏళ్ల నుంచి ప్రతిపాదనలో ఉంది. ఈ లైన్‌కు రెండు సార్లు సర్వే చేశారు. 2004లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించి సర్వే చేశారు. 2011 డిసెంబర్లో రీ సర్వే చేసి నివేదికలిచ్చారు. 2015–16 బడ్జెట్లో మళ్లీ రీ సర్వే చేయాలని రూ.13.65లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా ఒక్క రూపాయీ విడుదల చేయలేదు. 110కిలో మీటర్ల పొడవైన ఈ మార్గానికి రూ.1100కోట్లు అవసరమని అంచనా. ప్రజల విన్నపం మేరకు 2018–19 బడ్జెట్లో ట్రాఫిక్ సర్వే కోసం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్రం ప్రకటించినా చర్యలు శూన్యం. రిహాబిలిటేషన్ వర్క్‌షాప్.. కర్నూలులో రైల్వే మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు 2013 బడ్జెట్లో ప్రతిపాదించారు. స్థలం సేకరించినా పురోగతి లేదు. గత బడ్జెట్ తరువాత ప్రభుత్వం రూ.10 కోట్లు ప్రకటించింది. అయితే రూ. 2కోట్లు కూడా విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తికి రూ. రూ.250కోట్లు అవసరం. అరకొరగా నిధులతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. అడ్రస్ లేని మెయింటెనెన్స్ షెడ్.. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు 2013లో తెరపైకి వచ్చిన ట్రైన్ మెయింటెనెన్స్ (నిర్వాహణ) షెడ్ నామరూపాలు లేకుండా పోయింది. దూపాడు వద్ద ఏర్పాటు చేస్తామని రైల్వే సహాయ మాజీ మంత్రి కోట్ల చెప్పారు. దీనికి రూ.2కోట్లు కావాల్సి ఉంది. వర్క్‌షాప్ పూర్తయితే దాదాపు 5వేల మందికి ప్రత్యేక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాజధానికి రైలేదీ? రాష్ట్ర రాజధాని అమరావతికి కర్నూలు నుంచి నేరుగా వెళ్లేందుకు రోజువారి రైలు లేదు. కాకినాడకు స్పెషల్ రైలు బుధ, శుక్రవారాల్లో మాత్రమే నడుస్తోంది. మిగిలిన రోజుల్లో డోన్, నంద్యాలకు వెళ్లి రైలెక్కాలి. గుంటూరు వరకు కేవలం రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఉన్నాయి. కర్నూలు నుంచి రెండు ఎక్స్‌ప్రెస్ ఇంటర్ సిటీ, మరో రెండు ప్యాసింజరు రైళ్లను నడపాల్సిన అవసరం ఉంది. వినియోగానికి నోచుకోని మల్టీప్లెక్స్.. కర్నూలు స్టేషన్ ఆధునీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణానికి గత బడ్జెట్లో రూ.25కోట్లు మంజూరు చేశారు. అయితే మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మించినా వినియోగంలోకి రాలేదు. ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రూ.2కోట్లకు పైగా అవసరం. ♦ డోన్ నుంచి కర్నూలు మీదుగా సికింద్రాబాద్ వరకు 260కి.మీ. దూరం డబుల్ లైన్, విద్యుదీకరణకు సర్వే చేసినా పెండింగ్‌లో ఉంది. పనులు త్వరగా పూర్తయితే ఈ రూట్లో మరిన్ని రైళ్లు నడపొచ్చు. ♦ హోస్పేట్–మంత్రాలయం–కర్నూలు –నంద్యా ల– శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు మార్గం నిర్మించాలి. ♦ డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూర్ మీదుగా ముంబైకి రైలు నడుపుతామని మాజీ సహాయ మంత్రి కోట్ల ఇచ్చిన హామీ నెరవేరలేదు. ♦ సికింద్రాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగ ళూరు వరకు గరీబ్‌రథ్ ఏర్పాటు చేయాలి. ♦ విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు, హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నడపాలి. ♦ ఔరంగాబాద్, ఆదోని మీదుగా నుంచి రేణిగుంట, యశ్వంత్‌పూర్ నుంచి ఆదోని మీదుగా కాటా (ఉత్తరప్రదేశ్) వరకు నడుపుతామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. ♦ కర్నూలు – నంద్యాల మధ్య వారంలో ఆరు రోజులు నడుస్తున్న డెమో ప్యాసింజర్ రైలును రోజూ నడపడంతో పాటు ఇందులో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. డోన్, బేతంచెర్ల మీదుగా కాకుండా కర్నూలు – నంద్యాల మధ్య కొత్త లైన్ ఏర్పాటు చేయాలి. ♦ ముస్తాబవుతున్న స్టేషన్ వినోద్‌కుమార్ యాదవ్ వస్తుండటంతో సిటీ స్టేషన్‌ను ముస్తాబు చేస్తున్నారు. స్టేషన్‌తోపాటు ప్లాట్‌ఫాంలు, ఆసుపత్రి, గెస్ట్ హౌస్, రిజర్వేషన్ కౌంటర్ తదితర చోట్ల రంగులు వేస్తున్నారు. ట్రాక్, ప్లాట్‌ఫామ్‌లను వాటర్ ఆప్రాన్ ద్వారా క్లీనింగ్ చేస్తున్నారు. ఇతర ఏర్పాట్లతో అన్ని విభాగాల అధికారులు బిజీబిజీగా ఉన్నారు. -
సారొస్తున్నారు..!
స్టేషన్ మహబూబ్‌నగర్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) వినోద్‌కుమార్ యాదవ్ గురువారం మహబూబ్‌నగర్ రానున్నారు. ఈ మేరకు ఆయన ఉమ్మడి జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లలో పరిశీలిస్తారు. వార్షిక పర్యటనలో భాగంగా జనరల్ మేనేజర్ జిల్లాకు వస్తుండగా.. ఆయన పరిశీలించనున్న స్టేషన్లను అధికారులు ఏర్పాటుచేశారు. కాగా, వివిధ స్టేషన్లలో పలు కార్యాలయాలను జీఎం ప్రారంభిస్తారు. జనరల్ మేనేజర్ పర్యటన ఇలా... దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ గత ఏడాది మార్చి 3వ తేదీన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. మళ్లీ ఏడాదిన్నర తర్వాత గురువారం వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ నుంచి నుంచి డోన్ వరకు రైల్వే స్టేషన్లను పరిశీలించనున్నారు. ఆ తర్వాత కర్నూల్ మీదుగా ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశిస్తారు. తొలుత ఉదయం 11.30 గంటలకు శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ(అలంపూర్) స్టేషన్‌కు చేరుకుని ఎల్సీ 127 కిలోమీటర్ల వద్ద పనులను పరిశీలించనున్నారు. అక్కడి స్టేషన్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం పూ డూర్ స్టేషన్, మైనర్ బ్రిడ్జి పనులను పరిశీలించనున్న జీఎం.. గద్వాలకు చేరుకుని రైల్వే కాలనీ పరిశీలంచడంతోపాటు ఆన్లైన్ ప్రింటింగ్ మెషిన్, చిల్డ్రన్స్ పార్క్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత శ్రీరాంనగర్ స్టేషన్‌కు చేరుకుని కృష్ణా నదిలో నిర్మించనున్న స్టీల్ గ్రిడర్ బ్రిడ్జి పనులను పరిశీలిస్తారు. అనంతరం మహబూబ్‌నగర్ స్టేషన్‌కు సాయంత్రం చేరుకుంటారు. ఇక్కడ స్టేషన్‌ను తనిఖీ చేయడంతోపాటు ఆవరణలో ఏర్పాటు చేసిన డిజిటల్ మొబైల్ థియేటర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కార్యాలయం, ఉద్యోగుల నూతన క్వార్టర్లను ప్రారంభించనున్నారు. అలాగే, స్కౌట్స్, గైడ్స్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సమావేశంలో జీఎం పాల్గొంటా రని అధికారులు వివరించారు. ఆదర్శ రైల్వేస్టేషన్‌గా ఎంపిక చేయాలి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైల్వే పరిధిలో దాదాపు 100కుపైగా రైల్వే గేట్లు, తిమ్మాపూర్ నుంచి ఆలంపూర్ వరకు 191 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. మహబూబ్‌నగర్ స్టేషన్ మీదుగా ప్రతిరోజు 45 నుంచి 50కుపైగా రైళ్లు వెళ్తుంటా యి. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలో రెండో పెద్ద స్టేషన్ పాలమూరుకు పేరుంది. జిల్లాలోని స్టేషన్ల మీదుగా వెళ్లే రైళ్లలో ప్రయాణిం చే వారి ద్వారా రైల్వే శాఖకు నెలకు రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతోంది. అయినా జిల్లా స్టేషన్లలో రైల్వే సౌకర్యాల కల్పనలో ఎప్పుడూ అన్యాయం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా స్టేషన్‌కు ఆదర్శ స్టేషన్ హోదా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆదర్శ స్టేషన్‌గా ఎంపికైతే ఎస్కలేటర్లు, పరిశుభ్రమైన మినరల్ వాటర్ ప్లాం ట్, ఏటీఎంతో పాటు షాపింగ్ కాంప్లెక్సులు ఏర్పాటవుతాయి. ఈ మేరకు జీఎం దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
మహిళలపై హింసను అరికట్టాలి: రైల్వే జీఎం
సాక్షి, హైదరాబాద్: మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్‌యాదవ్, ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్యలు పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం సౌత్ లాలాగూడ రైల్వే ఇన్స్టిట్యూట్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్ కుమార్ యాదవ్, మర్రి రాఘవయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. చిన్న పిల్లల నుంచి మహిళల వరకు అనేక రకాలుగా హింసలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లోనూ మహిళలపై నిత్యం హింసలు జరుగుతున్నాయని తెలిపారు. వీటన్నింటిని అరికట్టడానికి మహిళలు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహిళలు తమ హక్కులను సాధించుకొని సమాజంలో మహిళ ఒక శక్తి అని నిరూపించుకోవాలని సూచించారు. కాగా, సోమవారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో వినోద్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. రైల్వే భద్రతపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రైల్వేలో భద్రతను పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో.. మహిళలపై జరుగుతున్న హింసా వ్యతిరేక దినోత్సవాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మజ్దూర్ యూనియన్ ఎడ్యుకేషనల్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.శంకర్రావు, మహిళా కన్వీనర్ సరోజినిరెడ్డిలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలపై వివక్ష కనబడుతోందన్నారు. పలు ప్రాంతాల్లో మహిళలపై హింసలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
రూ.883కోట్లతో అమరావతికి రైల్వేలైన్
సాక్షి, విజయవాడ/సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి రూ.883 కోట్లతో రైలు మార్గం నిర్మాణానికి సవివరమైన నివేదికలను రైల్వే బోర్డుకు పంపామని, త్వరలోనే అనుమతులు వస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు లైన్లకు సరిపడా అమరావతి మార్గానికి భూసేకరణ జరుగుతుందని, అయితే.. తొలుత సింగల్ లైన్ నిర్మిస్తామని, డిమాండ్‌ను బట్టి రెండో లైను ఏర్పాటుచేస్తామని ఆయన వివరించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో మంగళవారం విజయవాడలో రైల్వే జీఎం సమావేశమయ్యారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే జోనంతా విద్యుదీకరణ పనులు పూర్తవుతాయని వివరించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.400 కోట్లతో పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు టెండర్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించామన్నారు. అక్కడ 8 అంతస్తుల బడ్జెట్ హోటల్‌ను నిర్మిస్తామన్నారు. అలాగే, విజయవాడ, గుంటూరు, గుంతకల్, కర్నూల్ రైల్వేస్టేషన్లను కూడా 2019 మార్చి నాటికి పూర్తిగా ఆధునీకరిస్తామని జీఎం వివరించారు. గుంటూరు–గుంతకల్ సెక్షన్ విద్యుదీకరణ పూర్తయి, డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని, విజయవాడ–విశాఖ మూడో లైన్, నడిగుడి–శ్రీకాళహస్తి రైలు మార్గం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. టీడీపీ ఎంపీల హైడ్రామా సమావేశానికి హాజరైన 12మంది టీడీపీ ఎంపీలు గందరగోళం సృష్టించారు. రాష్ట్రానికి రైల్వే జోన్ నివ్వాలంటూ సమావేశ మందిరంలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు అనుమతిచ్చే వరకూ ఏ సమావేశాలకు హాజరుకాబోమంటూ సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోది రాష్ట్ర విభజన హామీలను అమలుపర్చడంలేదని, రాష్ట్రంపట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపట్ల ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా, ఆ రాష్ట్రంపై నెపం నెట్టి జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు వారితో కలిసి రైల్వే జోన్ కావాలంటూ నినాదాలు చేశారు. కాగా, నాలుగేళ్లుగా రైల్వే జోన్ గురించి ప్రస్తావించని టీడీపీ ఎంపీలు ఇప్పుడు చివరి సమావేశంలో రభస చేయడాన్ని చూసి రైల్వే అధికారులు విస్తుబోయారు. అలాగే, ఏడాదికి ఒకసారి జరిగే దక్షిణ మధ్య రైల్వే బోర్డు సమావే«శంలో సాధారణంగా కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సమస్యలు, కొనసాగుతున్న ప్రాజెక్టుల్లోని ప్రగతి తదితర అంశాలపై చర్చ ఉంటుంది. అయితే, మంగళవారం నాటి బోర్డు సమావేశానికి టీడీపీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికో, మహానాడుకో బయల్దేరినట్లు మందీమార్బలంతో తమ వాహనాలకు పార్టీ జెండాలను కట్టుకుని వచ్చి హంగామా సృష్టించడం కూడా విమర్శలకు తావిచ్చింది. నెల్లూరు స్టేషన్‌ను ఏ–1గా గుర్తించాలి: ఎంపీ వేమిరెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో ఫోన్లో మాట్లాడారు. రైల్వే జోన్ ఇవ్వకపోవడంపై నిరసన తెలిపారు. నెల్లూరు స్టేషన్‌ను ఏ–కేటగిరి నుంచి ఏ–1 కేటగిరిగా మార్చాలని సూచించారు. కోరమాండల్, తమిళనాడు, గంగాకావేరి ఎక్స్‌ప్రెస్‌లను నెల్లూరులో ఆపాలని, ఏసీ, నాన్ ఏసీ డార్మెటరీలు ఏర్పాటుచేయాలని కోరారు. చెన్నై–నెల్లూరు మధ్య మెమూ రైలు రోజు కనీసం 8 సార్లు తిరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
రేపు కరీంనగర్‌కు కొత్త రైలు!
సాక్షి, హైదరాబాద్: చాలాకాలంగా కొత్త రైలు కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్‌వాసులకు శుభవార్త. పట్టణానికి మరో కొత్త రైలు రాబోతోంది. ఇప్పటిదాకా నిజామాబాద్ వరకు నడిచిన నిజామాబాద్ – లోకమాన్య తిలక్ (ట్రెయిన్ నం 11206) రైలును కరీంనగర్ వరకు పొడిగించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రైలును ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1994లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో స్టేషన్ పనులు మొదలయ్యాయి.పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు రైల్వే లైన్ పూర్తి కావడంతో 2001లో స్టేషన్ ప్రారంభమైంది. 2017 మార్చి 25 నాటికి నిజామాబాద్ వరకు లైన్ పూర్తవడంతో పెద్ద పల్లి–కరీంనగర్– నిజామాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. కరీంనగర్– తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12762/12761), కాచిగూడ–కరీంనగర్ ప్యాసింజర్ ్కఅ (57601/02), సిర్పూర్ టౌన్–కరీంనగర్ డెమూ (77255/77 256), కరీంనగర్ –లింగంపేట (జగి త్యాల) డెమూ (77274/77273), పెద్దపల్లి– లింగంపేట(జగిత్యాల) డెమూ (77258/77257), నిజామాబాద్ – కరీంనగర్ డెమూ (77260/77259) రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వరకు రైల్ ప్రయాణ సౌకర్యం సాకారమైనా ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లేదు. వాస్తవానికి ఈ రెండు నగరాల మధ్య రైలు చార్జీ కేవలం రూ.40. ఆర్టీసీ చార్జి రూ.200. అయినా ప్రయాణికులు ఎక్కువగా రైలును కాదని ఆర్టీసీలోనే ప్రయాణిస్తున్నారు. ఈ రైల్వేస్టేషన్లు ఊరికి దూరంగా ఉండటం, అక్కడ నుంచి పట్టణాలకు సరైన రవాణా సదుపాయం లేకపోవడమే దీనికి కారణం. తాజాగా నిజామాబాద్–లోకమాన్య తిలక్ కరీంనగర్ వరకు పొడిగించడం ఆశాజనకంగా మారింది. నిజామాబాద్‌తోపాటు బాసర, మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్, మన్మాడ్, నాసిక్ తదితర ప్రాంతాలకు రైలులో ప్రయాణించే వీలు ఏర్పడింది. 27న ఎంపీ వినోద్‌తో భేటీ..: ఈ నెల 27న ఎంపీ వినోద్‌కుమార్‌తో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ భేటీ కానున్నారు. ఇటీవల పార్లమెం టు సమావేశాల అనంతరం ఎంపీలతో భేటీ అయి వారి నియోజకవర్గాల్లో ఉన్న రైల్వే పనుల పురోగతి, పెండింగ్ పనులపై చర్చించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రైల్వే ఉన్నతాధికారులను ఆదేశిం చారు. ఇందులో భాగంగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలువురు ఎంపీలను కలిసిన రైల్వే జీఎం 27న ఎంపీ వినోద్‌తో సమావేశం కానున్నారు. -
నేనెక్కడ ఉన్నాను..!
సాక్షి, హైదరాబాద్: నగదురహిత సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలోనే మొట్టమొదటి ‘డిజిపే రైల్వేస్టేషన్’గా నిలిచిన కాచిగూడ రైల్వేస్టేషన్.. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందజేయడంలో మరో సారి ఆదర్శప్రాయమైన స్టేషన్‌గా ప్రశంసలు అందుకొంది. కాచిగూడ స్టేషన్ సేవలను వివరించే మొబైల్ యాప్ ‘రైల్స్టేషన్ ఇన్ఫో’, బ్లూటూత్ సాయంతో స్టేషన్ లోపల పరిసరాలను తెలుసుకొనే ‘నవ్రస్’(నావిగేషన్ ఫర్ రైల్వేస్టేషన్స్) అనే మరో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ ఈ యాప్‌లను గురువారం ప్రారంభించారు. అనంతరం 400 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌ప్లాంట్‌ను సందర్శించారు. కాచిగూడ స్టేషన్ అవసరాలకు సరిపోయేలా సోలార్ పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్ లభిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే 6.4 మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉందని, వచ్చే ఏడాదికి దీనిని 7.4 మెగావాట్లకు పెంచేవిధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్‌లను ప్రవేశపెట్టడం ద్వారా కాచిగూడ స్టేషన్ దేశం లోని అన్ని రైల్వేలను మరోసారి ఆకర్షించిందని చెప్పారు. నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులు, కొత్తవారికి ఈ యాప్‌లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. కాగా, ఈ యాప్‌లను ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్స్టేషన్ ఇన్ఫో ద్వారా.. - కాచిగూడ రైల్వేస్టేషన్ పూర్తి సమాచారం లభిస్తుంది. - ఎంఎంటీఎస్, లోకల్, ప్రత్యేక రైళ్ల వేళలు తెలుసుకోవచ్చు. - వెయిటింగ్ హాల్స్, ప్లాట్‌ఫామ్స్‌పై ఉన్న కేటరింగ్ స్టాల్స్ జాడ తెలుస్తుంది. - లైసెన్స్ కలిగిన పోర్టర్స్ ఫోన్ నంబర్లు, బ్యాడ్జి నంబర్లు లభిస్తాయి. - రిటైరింగ్ రూమ్స్ ఆన్లైన్ బుకింగ్ సదుపాయం ఉంటుంది. - విచారణ కార్యాలయం, పార్సిల్స్, బుకింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ కార్యాలయాల వివరాలు లభిస్తాయి. - తాగునీటి సదుపాయం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. - టోల్‌ఫ్రీ నంబర్ 8121281212కు వచ్చిన ఫిర్యాదులపై చేపట్టిన చర్యలు కూడా తెలుసుకోవచ్చు. - బ్లూటూత్ సాయంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్ లోపలి ప్రాంతాలను తెలుసుకోగలుగుతారు. - తాము నిలబడి ఉన్న ఒక మీటర్ పరిధి నుంచి మొత్తం స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌లపైన ఎక్కడ ఏమున్నాయో నావిగేషన్ సాయంతో కనిపెట్టవచ్చు. - రూట్‌మ్యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుస్తాయి. -
రూ.60 కోట్లతో రైల్వేస్టేషన్ల అభివృద్ధి
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లను రూ.60 కోట్లతో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ చెప్పారు. సోమవారం ఆయన నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. నెల్లూరు మెయిన్తోపా టు, సౌత్‌స్టేషన్, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వేస్టేషన్ల పరిస్థితిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి, నెల్లూరునగర ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌తో కలిసి విలేకరుల నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ అభివృద్ధి పనులు కూడా ఆరు నెలల్లో పూర్తిచేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అందుకు సం బంధిత ఇంజినీర్లు కూడా పరిశీలించారన్నారు. నెల్లూరు స్టేషన్లో తాగునీటి కొరత లేకుండా, ప్లాట్‌ఫాంల ఆధునికీకరణ వంటి పనులను వేగవంతం చేస్తామన్నారు. సౌత్‌స్టేషన్‌లో టాయిలెట్స్, షెడ్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు ఇతరత్రా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. వీటితోపాటు వైఫై సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. నగరంలో పలు చోట్ల రైల్వే బాక్స్‌టైప్ అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిగణలోకి తీసుకుని స్థానిక కార్పొరేషన్ అనుమతితో చేస్తామన్నారు. నెల్లూరు ఎంపీ రాజమోహన్‌రెడ్డి రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై పలుసార్లు తమకు వినతిపత్రాలు ఇచ్చారని, వాటిలో చాలా వరకు ప్రయాణికులకు ఉపయోగపడుతాయన్నారు. మేకపాటి చొరవ అభినందనీయమన్నారు. రైల్వే స్థలాల్లో వ్యాపార సముదాయాల నిర్మాణం ఎన్బీసీసీ సంస్థతోపాటు రైల్వే ల్యాండ్ సంస్థ సంయుక్తంగా రైల్వేకు సంబంధించిన స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మిస్తామని జీఎం వినోద్‌కుమార్ తెలిపారు. 65 వేల చదరపు అడుగుల్లో వ్యాపార సముదాయాలు నిర్మించి ప్రైవేట్, ప్రభుత్వ రంగాల సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. రైల్వే ప్రయాణికులకు ఎంతో మేలుతో పాటు రైల్వేకు కూడా ఆదాయం వస్తుందన్నారు. సౌత్‌స్టేషన్ పరిశీలన నెల్లూరు సౌత్స్టేషన్ను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, డీఆర్ఎం కలిసి పరిశీలించారు. అక్కడ అవసరమైన ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాంతం రాకపోకలకు ఎంతో అనువుగా ఉండటంతో నిత్యం వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. వారికి అవరసనమై వాటిని కల్పించాల్సి న అవసరం ఉందన్నారు. సౌత్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై దుర్గంధం వెదజల్లుతుందన్నారు. నెల్లూరు, కావలి స్టేషన్లో ప్రధాన రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కావలి రైల్వేస్టేషన్ అభివృద్ధికి సహకరించండి కావలి ప్రాంతం వ్యాపార కేంద్రమని, నాలుగు వరకు ఇంజినీరింగ్ కళాశాలల ఉన్నాయి అన్ని వర్గాల వారు కావలి రైల్వేస్టేషన్ నుంచి వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జీఎం వినోద్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ స్టేషన్లో ప్రధాన రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. – రామిరెడ్డి ప్రతాప్మకుమార్రెడ్డి, కావలి ఎమ్మెల్యే రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మించాలి వెంకటేశ్వరపురం వద్ద గాంధీగిరిజన కాలనీ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఎంతో బాగుంటుందని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే విద్యార్థులకు, చిరు వ్యాపారులకు ఉపయోగంతో పాటు ప్రమాదాలను కూడా నివారించవచ్చన్నారు. ప్రధానంగా రైల్వే స్థలాల్లో కొన్నేళ్ల నుంచి ఉన్న వారికి ప్రత్యామ్నాయాలు చూపించకుండా వారిని ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. సానుకూలంగా స్పందించిన జీఎం మాట్లాడుతూ అండర్ బ్రిడ్జి నిర్మాణం స్థాని కార్పొరేషన్ నిధులతో చేయించుకోవాలని , అందుకు అనుమతులు తమ వద్ద నుంచి ఇస్తామని, రైల్వే స్థలాల్లో ఉన్న వారికి ప్రత్యామ్నాయం చూపించే వరకు ఇబ్బంది పెట్టవద్దని అధికారులను ఆదేశిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, ఫ్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్ ఇతర కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. – అనిల్‌కుమార్ నగర ఎమ్మెల్యే -
కాచిగూడ స్టేషన్ లో అంతా కార్డుమయం!
► దేశంలోనే తొలి ‘డిజిటల్’ రైల్వే స్టేషన్ గా గుర్తింపు ► నేడు ప్రారంభించనున్న రైల్వే జీఎం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ప్రథమంగా పూర్తిస్థాయి డిజిటల్ స్టేషన్ గా కాచిగూడ రైల్వేస్టేషన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటోంది. కౌంటర్లో టికెట్ కొనాలన్నా.. దుకాణాల్లో వస్తువులు కావాలన్నా.. పార్కింగ్ యార్డులో బిల్లు చెల్లించాలన్నా.. క్లాక్‌రూంలో సామాను భద్రపరచాలన్నా.. చెల్లింపులన్నీ కార్డుతోనే. ఎక్కడా డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. దీన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సోమవారం ప్రారంభించనున్నారు. నూతన జీఎంగా బాధ్యతలు స్వీకరించిన వినోద్ కుమార్‌యాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాచిగూడను వంద శాతం డిజిటల్ స్టేషన్ గా మార్చాలని నిర్ణయించి నెల రోజుల పాటు కసరత్తు చేశారు. సేషన్ లోని అన్ని దుకాణాల యజమానులు, పార్కింగ్ కాంట్రాక్టర్, క్లాక్‌రూం నిర్వాహకులతో చర్చించి అందరూ స్వైపింగ్ మెషీన్లు సమకూర్చుకునేలా చూశారు. ఇప్పుడు అన్ని దుకాణాల్లో మెషీన్లు సమకూరాయి. ఇప్పటి వరకు దేశంలో మరే స్టేషన్ శాతం కార్డుతో చెల్లింపు వసతి లేదని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. టికెట్ కౌంటర్లకే పీఓఎస్‌లు పరిమితమవుతున్నాయి.