నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లను రూ.60 కోట్లతో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ చెప్పారు. సోమవారం ఆయన నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. నెల్లూరు మెయిన్‌తోపా టు, సౌత్‌స్టేషన్, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వేస్టేషన్ల పరిస్థితిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి, నెల్లూరునగర ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌తో కలిసి విలేకరుల నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ అభివృద్ధి పనులు కూడా ఆరు నెలల్లో పూర్తిచేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అందుకు సం బంధిత ఇంజినీర్లు కూడా పరిశీలించారన్నారు.
నెల్లూరు స్టేషన్‌లో తాగునీటి కొరత లేకుండా, ప్లాట్‌ఫాంల ఆధునికీకరణ వంటి పనులను వేగవంతం చేస్తామన్నారు. సౌత్‌స్టేషన్‌లో టాయిలెట్స్, షెడ్స్, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు ఇతరత్రా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. వీటితోపాటు వైఫై సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. నగరంలో పలు చోట్ల రైల్వే బాక్స్‌టైప్ అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిగణలోకి తీసుకుని స్థానిక కార్పొరేషన్ అనుమతితో చేస్తామన్నారు. నెల్లూరు ఎంపీ రాజమోహన్‌రెడ్డి రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై పలుసార్లు తమకు వినతిపత్రాలు ఇచ్చారని, వాటిలో చాలా వరకు ప్రయాణికులకు ఉపయోగపడుతాయన్నారు. మేకపాటి చొరవ అభినందనీయమన్నారు.
రైల్వే స్థలాల్లో వ్యాపార సముదాయాల నిర్మాణం
ఎన్‌బీసీసీ సంస్థతోపాటు రైల్వే ల్యాండ్ సంస్థ సంయుక్తంగా రైల్వేకు సంబంధించిన స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మిస్తామని జీఎం వినోద్‌కుమార్ తెలిపారు. 65 వేల చదరపు అడుగుల్లో వ్యాపార సముదాయాలు నిర్మించి ప్రైవేట్, ప్రభుత్వ రంగాల సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. రైల్వే ప్రయాణికులకు ఎంతో మేలుతో పాటు రైల్వేకు కూడా ఆదాయం వస్తుందన్నారు.
సౌత్‌స్టేషన్ పరిశీలన
నెల్లూరు సౌత్‌స్టేషన్‌ను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, డీఆర్‌ఎం కలిసి పరిశీలించారు. అక్కడ అవసరమైన ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాంతం రాకపోకలకు ఎంతో అనువుగా ఉండటంతో నిత్యం వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. వారికి అవరసనమై వాటిని కల్పించాల్సి న అవసరం ఉందన్నారు. సౌత్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై దుర్గంధం వెదజల్లుతుందన్నారు. నెల్లూరు, కావలి స్టేషన్‌లో ప్రధాన రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
కావలి రైల్వేస్టేషన్ అభివృద్ధికి సహకరించండి
కావలి ప్రాంతం వ్యాపార కేంద్రమని, నాలుగు వరకు ఇంజినీరింగ్ కళాశాలల ఉన్నాయి అన్ని వర్గాల వారు కావలి రైల్వేస్టేషన్ నుంచి వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జీఎం వినోద్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ స్టేషన్‌లో ప్రధాన రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. – రామిరెడ్డి ప్రతాప్‌మకుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే
రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మించాలి
వెంకటేశ్వరపురం వద్ద గాంధీగిరిజన కాలనీ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఎంతో బాగుంటుందని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే విద్యార్థులకు, చిరు వ్యాపారులకు ఉపయోగంతో పాటు ప్రమాదాలను కూడా నివారించవచ్చన్నారు. ప్రధానంగా రైల్వే స్థలాల్లో కొన్నేళ్ల నుంచి ఉన్న వారికి ప్రత్యామ్నాయాలు చూపించకుండా వారిని ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. సానుకూలంగా స్పందించిన జీఎం మాట్లాడుతూ అండర్ బ్రిడ్జి నిర్మాణం స్థాని కార్పొరేషన్ నిధులతో చేయించుకోవాలని , అందుకు అనుమతులు తమ వద్ద నుంచి ఇస్తామని, రైల్వే స్థలాల్లో ఉన్న వారికి ప్రత్యామ్నాయం చూపించే వరకు ఇబ్బంది పెట్టవద్దని అధికారులను ఆదేశిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, ఫ్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్ ఇతర కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. – అనిల్‌కుమార్ నగర ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment