యాప్‌ను ఆవిష్కరిస్తున్న దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: నగదురహిత సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలోనే మొట్టమొదటి ‘డిజిపే రైల్వేస్టేషన్’గా నిలిచిన కాచిగూడ రైల్వేస్టేషన్.. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందజేయడంలో మరో సారి ఆదర్శప్రాయమైన స్టేషన్‌గా ప్రశంసలు అందుకొంది. కాచిగూడ స్టేషన్ సేవలను వివరించే మొబైల్ యాప్ ‘రైల్‌స్టేషన్ ఇన్‌ఫో’, బ్లూటూత్ సాయంతో స్టేషన్ లోపల పరిసరాలను తెలుసుకొనే ‘నవ్‌రస్’(నావిగేషన్ ఫర్ రైల్వేస్టేషన్స్) అనే మరో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ ఈ యాప్‌లను గురువారం ప్రారంభించారు. అనంతరం 400 కిలోవాట్‌ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌ప్లాంట్‌ను సందర్శించారు. కాచిగూడ స్టేషన్ అవసరాలకు సరిపోయేలా సోలార్ పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్ లభిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే 6.4 మెగావాట్‌ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉందని, వచ్చే ఏడాదికి దీనిని 7.4 మెగావాట్‌లకు పెంచేవిధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్‌లను ప్రవేశపెట్టడం ద్వారా కాచిగూడ స్టేషన్ దేశం లోని అన్ని రైల్వేలను మరోసారి ఆకర్షించిందని చెప్పారు. నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులు, కొత్తవారికి ఈ యాప్‌లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. కాగా, ఈ యాప్‌లను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రైల్‌స్టేషన్ ఇన్‌ఫో ద్వారా..
- కాచిగూడ రైల్వేస్టేషన్ పూర్తి సమాచారం లభిస్తుంది.
- ఎంఎంటీఎస్, లోకల్, ప్రత్యేక రైళ్ల వేళలు తెలుసుకోవచ్చు.
- వెయిటింగ్ హాల్స్, ప్లాట్‌ఫామ్స్‌పై ఉన్న కేటరింగ్ స్టాల్స్ జాడ తెలుస్తుంది.
- లైసెన్స్ కలిగిన పోర్టర్స్ ఫోన్ నంబర్లు, బ్యాడ్జి నంబర్లు లభిస్తాయి.
- రిటైరింగ్ రూమ్స్ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం ఉంటుంది.
- విచారణ కార్యాలయం, పార్సిల్స్, బుకింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ కార్యాలయాల వివరాలు లభిస్తాయి.
- తాగునీటి సదుపాయం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
- టోల్‌ఫ్రీ నంబర్ 8121281212కు వచ్చిన ఫిర్యాదులపై చేపట్టిన చర్యలు కూడా తెలుసుకోవచ్చు.
- బ్లూటూత్ సాయంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్ లోపలి ప్రాంతాలను తెలుసుకోగలుగుతారు.
- తాము నిలబడి ఉన్న ఒక మీటర్ పరిధి నుంచి మొత్తం స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌లపైన ఎక్కడ ఏమున్నాయో నావిగేషన్ సాయంతో కనిపెట్టవచ్చు.
- రూట్‌మ్యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment