
చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరిన తొలి ఇంజిన్ రహిత రైలు ట్రైన్ 18. సోమవారం రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్విని లోహాని జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు.. మరిన్ని పరీక్షలు పూర్తిచేసుకున్న తరువాత శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. సెమీ హైస్పీడ్ రకానికి చెందిన ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
– కొరుక్కుపేట (చెన్నై)