semi high speed
-
తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రూట్లలో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు సైతం రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.తాజాగా వందే భారత్ రైళ్లకు తోడు వందే భారత్ మెట్రో రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16వ తేదీన తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలు ఎక్కనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనున్న తొలి వందే భారత్ మెట్రో రైలును..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండగా.. వాటి కంటే సుదూర ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణించనుంది. భుజ్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభమై.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్‌లో ప్రారంభమై.. రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్-అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకు 9 స్టాప్‌లు ఉండగా.. ప్రతీ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని భారతీయ రైల్వే తెలిపింది.వందే భారత్ మెట్రో అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది గంటకు 100 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ రైలు లాగానే ఈ రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. మొదట 12 కోచ్‌లతో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలుకు.. ప్రయాణికుల రద్దీ దృష్టా వాటిని 16 కోచ్‌లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ఇందులో మన మెట్రో రైలు లాగా ఆటోమేటిక్ డోర్లు ఉండటం మరో ప్రత్యేకత. ఈ వందే భారత్ మెట్రో రైలును గంటకు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు.ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్‌తో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి కోచ్‌లో మంటలు, పొగ వంటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించేలా మొత్తం 14 సెన్సార్లతో కూడిన సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. దివ్యాంగుల కోసం కోచ్‌లలో వీల్‌చైర్ యాక్సెస్ కలిగిన టాయిలెట్లు ఏర్పాటు చేశారు. -
NaMo Bharat: తొలి ర్యాపిడ్ రైలు ‘నమో భారత్’ను ప్రారంభించిన మోదీ
భారత్‌లోనే తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ సర్వీస్ ‘ర్యాపిడ్ ఎక్స్’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కారిడార్‌కు ప్రధాని మోదీ జెండా ఊపి జాతికి అంకితం చేశారు. రైలును ప్రారంభించిన అనంతరం మోదీ అందులో ప్రయాణించారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ర్యాపిడ్ఎక్స్ రైలు సిబ్బందితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తదితరులు పాల్గొన్నారు. #WATCH | Sahibabad, Uttar Pradesh | Prime Minister Narendra Modi flags off the RapidX train connecting Sahibabad to Duhai depot, marking the launch of Regional Rapid Transit System (RRTS) in India. This is India’s first RapidX train which will be known as NaMo Bharat. pic.twitter.com/YaanYmocB8 — ANI (@ANI) October 20, 2023 కాగా ఈ తొలి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలును ‘నమో భారత్‌గా’ గా పేరు మారుస్తున్నట్లు గురువారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 82 కిలోమీటర్ల మేర చేపట్టిన ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) కారిడార్‌లో ముందుగా 17 కి.మీ. దూరానికి సంబంధించి రైలు రాకపోకలు సాగిస్తోంది. రేపటి నుంచి (అక్టోబర్ 21) దేశ రాజధాని ప్రాంత వాసులకు ఈ రైలు అందుబాటులో రానుంది. మొత్తం అయిదు స్టేషన్ల మధ్య రైలు ప్రయాణించనుంది. #WATCH | Sahibabad, Uttar Pradesh | Prime Minister Narendra Modi inspects the priority section project of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor through a VR headset. He inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor and flag off RapidX train - 'NaMo… pic.twitter.com/pX7zUFP25O — ANI (@ANI) October 20, 2023 గత ఏప్రిల్‌లో జాతీయ రాజధాని ప్రాంత రవాణా కార్పొరేషన్(ఎన్సీఆర్టీసీ) ఈ ఆర్ఆర్టీఎస్ రైలును ‘ర్యాపిడ్ఎక్స్’గా నామకరణం చేసింది. అనంతరం దీనిని నమో భారత్‌గా పేరు మార్చారు. దేశలోని తొలి సెమీహైస్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీసు ప్రాజెక్టులను ఎన్సీఆర్టీసీ తీసుకొస్తుంది. ఈరైలు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ఇక ఇప్పటికే భారతీయ రైల్వేశాఖ వందే భారత్ పేరుతో సెమీ హైస్పీడ్ రైలును నడుపుతున్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ రైలు పరుగులు పరుగులు పెడుతోంది. #WATCH | Prime Minister Narendra Modi interacts with school children and crew of RapidX train - 'NaMo Bharat' - connecting Sahibabad to Duhai Depot, onboard the train. He inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor and flagged off NaMo Bharat at… pic.twitter.com/o6GQp7wMav — ANI (@ANI) October 20, 2023 ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ కారిడార్‌ను ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా రూ. 30 వేల కోట్ల రూపాయలతో చేపట్టింది. ఢిల్లీ నుంచి మీరట్ వరకు కేవలం గంట వ్యవధిలోనే చేరుకోవచ్చు. కారిడార్‌లో కొత్తగా నిర్మించిన స్టేషన్లలో అందమైన కుడ్యచిత్రాలు, ఆకర్షణీయమైన నినాదాలు అలరిస్తున్నాయి. ఈ ర్యాపిడ్ ఎక్స్ హై స్పీడ్ రైల్వే వ్యవస్థ విశేషాలు ► ర్యాపిడ్ ఎక్స్ ద్వారా రాజధాని వాసులకు ప్రయాణ సమయం ఏకంగా మూడో వంతు దాకా తగ్గనుంది. ► ప్రయోగాల సందర్భంగానే ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు గంటకు 180 కి.మీ. వేగాన్ని సులువుగా అందుకున్నాయి! ► అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ రైళ్ల సొంతం. ► ఒక్కో రైల్లో ఆరు కోచ్‌లుంటాయి. వీటిలో 1,700 మంది ప్రయాణించవచ్చు. ► ప్రతి రైల్లో ఒక మహిళా కోచ్‌తో పాటు వారికి దివ్యాంగులకు, వృద్ధులకు కొన్ని సీట్లు ప్రత్యేకిస్తారు. ► రెండు వరుసల్లో, వరుసకు రెండు చొప్పున సీట్లుంటాయి. నిలబడేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. ► ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, లగేజీ ర్యాక్‌లు, అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకునే వెసులుబాటు, సీట్ పుష్ బ్యాక్, కోట్ తగిలించుకునే హుక్, ఫుట్ రెస్ట్, ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సాయపడేందుకు అసిస్టెంట్, స్నాక్స్, డ్రింక్స్ కొనుక్కునేందుకు వెండింగ్ మెషీన్ల వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ► ఉదయం ఆరింటి నుంచి రాత్రి 11 దాకా ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ► డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి మున్ముందు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతారు. ► చార్జీలు స్టాండర్డ్ కోచ్‌లో రూ.20–రూ.40, ప్రీమియం కోచ్‌లో రూ.40–రూ.100. ► ప్రతి స్టేషన్నూ ఆకర్షణీయమైన రంగులతో కూడిన కుడ్య చిత్రాలు, నినాదాలతో ఆకట్టుకునేలా తయారు చేశారు. ►ఈ ర్యాపిడ్ ఎక్స్ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది. ► ఢిల్లీ–గాజియాబాద్–మీరట్ మధ్య 81.15 కి.మీ. ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ 2025 కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ► ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.30 వేల కోట్లు. ‘ఏఐ’ బ్యాగేజ్ స్కానింగ్ ర్యాపిడ్ ఎక్స్ రైళ్ల ఉద్దేశమే ప్రయాణ సమయం తగ్గించడం. అందుకు అనుగుణంగా కారిడార్‌లోని స్టేషన్లలో బ్యాగేజీ తనిఖీ సమయాన్ని బాగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నియంత్రిత, నిషేధిత వస్తువులుంటే అది వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ► ఇందులో డ్యుయల్ వ్యూతో కూడిన ఎక్స్ రే బ్యాగేజీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. దాంతో బ్యాగేజీ తాలూకు పై, లోపలి భాగాలు స్క్రీన్‌పై విడిగా, స్పష్టంగా కన్పిస్తాయి. ► ఈ స్టేషన్లలో తక్షణ స్పందన బృందం, బాంబ్ డిటెక్షన్–డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటివాటిని యూపీ పోలీసులు అందుబాటులో ఉంచనున్నారు! -
ఢిల్లీ వాసులకు ‘హై స్పీడ్’ ప్రయాణం
‘ప్రయాణానికి తక్కువ సమయం, కుటుంబానికి ఎక్కువ...!’. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రీజనల్ రైల్ సరీ్వస్‌కు సంబంధించిన ఆకర్షణీయమైన నినాదాల్లో ఇదొకటి! ర్యాపిడ్ ఎక్స్‌గా పిలుస్తున్న ఈ తొలి సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు దేశ రాజధాని ప్రాంత (ఎన్సీఆర్) వాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 82 కిలోమీటర్ల మేర చేపట్టిన ఢిల్లీ–గాజియాబాద్–మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) కారిడార్‌లో 17 కి.మీ. ప్రస్తుతం సిద్ధమైంది. సాహిబాబాద్–దుహై స్టేషన్ల మధ్యనున్న ఈ కారిడార్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ ఎక్స్ రైలుకు నమోభారత్‌గా గురువారం నామకరణం చేశారు. శనివారం నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. కారిడార్‌లో కొత్తగా నిర్మించిన స్టేషన్లలో అందమైన కుడ్యచిత్రాలు, ఆకర్షణీయమైన నినాదాలు అలరిస్తున్నాయి. అంతేనా...! ఈ ర్యాపిడ్ ఎక్స్ హై స్పీడ్ రైల్వే వ్యవస్థ విశేషాలు అన్నీ ఇన్నీ కావు... గంటకు 160 కి.మీ. వేగం! ► ర్యాపిడ్ ఎక్స్ ద్వారా రాజధాని వాసులకు ప్రయాణ సమయం ఏకంగా మూడో వంతు దాకా తగ్గనుంది. ► ప్రయోగాల సందర్భంగానే ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగాన్ని సులువుగా అందుకున్నాయి! ► అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ రైళ్ల సొంతం. ► ఒక్కో రైల్లో ఆరు కోచ్‌లుంటాయి. వీటిలో 1,700 మంది ప్రయాణించవచ్చు. ► ప్రతి రైల్లో ఒక మహిళా కోచ్‌తో పాటు వారికి దివ్యాంగులకు, వృద్ధులకు కొన్ని సీట్లు ప్రత్యేకిస్తారు. ► రెండు వరుసల్లో, వరుసకు రెండు చొప్పున సీట్లుంటాయి. నిలబడేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. ► ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, లగేజీ ర్యాక్‌లు, అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకునే వెసులుబాటు, సీట్ పుష్ బ్యాక్, కోట్ తగిలించుకునే హుక్, ఫుట్ రెస్ట్, ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సాయపడేందుకు అసిస్టెంట్, స్నాక్స్, డ్రింక్స్ కొనుక్కునేందుకు వెండింగ్ మెషీన్ల వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ► ఉదయం ఆరింటి నుంచి రాత్రి 11 దాకా ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ► డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి మున్ముందు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతారు. ► చార్జీలు స్టాండర్డ్ కోచ్‌లో రూ.20–రూ.40, ప్రీమియం కోచ్‌లో రూ.40–రూ.100. ► ప్రతి స్టేషన్నూ ఆకర్షణీయమైన రంగులతో కూడిన కుడ్య చిత్రాలు, నినాదాలతో ఆకట్టుకునేలా తయారు చేశారు. ళీ ఈ ర్యాపిడ్ ఎక్స్ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది. ► ఢిల్లీ–గాజియాబాద్–మీరట్ మధ్య 81.15 కి.మీ. ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ 2025 కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ► ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.30 వేల కోట్లు. ‘ఏఐ’ బ్యాగేజ్ స్కానింగ్ ర్యాపిడ్ ఎక్స్ రైళ్ల ఉద్దేశమే ప్రయాణ సమయం తగ్గించడం. అందుకు అనుగుణంగా కారిడార్‌లోని స్టేషన్లలో బ్యాగేజీ తనిఖీ సమయాన్ని బాగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నియంత్రిత, నిషేధిత వస్తువులుంటే అది వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ► ఇందులో డ్యుయల్ వ్యూతో కూడిన ఎక్స్ రే బ్యాగేజీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. దాంతో బ్యాగేజీ తాలూకు పై, లోపలి భాగాలు స్క్రీన్‌పై విడిగా, స్పష్టంగా కని్పస్తాయి. ► ఈ స్టేషన్లలో తక్షణ స్పందన బృందం, బాంబ్ డిటెక్షన్–డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటివాటిని యూపీ పోలీసులు అందుబాటులో ఉంచనున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎద్దు ఢీకొని దెబ్బతిన్న వందే భారత్ రైలు.. నెలలో మూడో ఘటన
గాంధీనగర్: ముంబయి- గాంధీనగర్ మధ్య నడుస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వరుస ప్రమాదాలకు గురవుతోంది. శనివారం ఉదయం ఎద్దును ఢీకొట్టడంతో మందుభాగం ఊడిపోయింది. నెల రోజుల్లోనే ఇలాంటి సంఘటనలు జరగటం ఇది మూడోసారి కావటం గమనార్హం. గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 8.17 గంటలకు రైలును ఎద్దు ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ కోచ్ ముందుభాగం ఊడిపోయింది. దానిని బాగు చేసేందుకు 15 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది. ఈ రైలు డ్రైవర్ బోగీ నోస్ కోన్ కవర్ ధ్వంసమైందని భారత రైల్వే శాఖ వెల్లడించింది. గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ సెమీ-హైస్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 1 నుంచి ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. పశువులు ఢీ కొట్టే ఘటనలను తప్పించలేమని, రైలు డిజైనింగ్ సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఇదీ చదవండి: మొరాయించిన ‘వందే భారత్’ ట్రైన్.. వరుసగా మూడో రోజూ సమస్య..! -
‘వందే భారత్’కు ఏమైంది?.. వరుసగా మూడో రోజూ..!
లక్నో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. గత రెండు రోజుల్లో ముంబయి-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోయింది. తాజాగా మరో వందే భారత్ రైలులో సాంకేతిక సమస్య ఏర్పడి మొరాయించింది. శనివారం న్యూఢిల్లీ నుంచి వారణాసి బయల్దేరిన ఎక్స్‌ప్రెస్ రైలులో ట్రాక్షన్ మోటార్ జామ్ అయి మధ్యలోనే ఆగిపోయింది. ‘వారణాసి వందే భారత్(ట్రైన్ నంబర్ 22436) కోచ్ సీ8లోని ట్రాక్షన్ మోటార్ వీల్ బేరింగ్ విఫలమైంది. దీంతో ధన్‌కౌర్, వెయిర్ స్టేషన్ల మధ్య నిలిచిపోయింది. ఈ లోపాన్ని గుర్తించి వెంటనే రైల్వే ఆపరేషన్స్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు క్షేత్రస్థాయి అధికారులు. దీంతో రైల్లోనే ఉన్నసాంకేతిక సిబ్బంది తనిఖీ చేసి.. ఎక్స్‌ప్రెస్ రైలును నియంత్రిత వేగంతో 20కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుర్జా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ 5 గంటల పాటు మరమ్మతులు చేసినా ఫలితం లభించలేదు. దీంతో అందులోని ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానానికి చేర్చాం. సమస్య తలెత్తిన బోగీని నిర్వహణ డిపోకి తీసుకెళ్లి తనిఖీ చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి. ’ అని రైల్వే శాఖ వెల్లడించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుంచి శతాబ్ది ట్రైన్‌లోకి మారుతున్న ప్రయాణికులు మరోవైపు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదాలను ఎదుర్కోవడం వరుసగా ఇది మూడో రోజు. గత గురువారం ముంబయి- గాంధీనగర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు.. అహ్మదాబాద్ సమీపంలోని వట్వా రైల్వేస్టేష వద్ద గేదెలను ఢీ కొట్టింది. దీంతో రైలు ముందు భాగం ఊడిపోయింది. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం గాంధీనగర్ నుంచి ముంబయికి బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆనంద్ స్టేషను సమీపంలో ఆవును ఢీకొట్టింది. మళ్లీ ముందుభాగం నొక్కుకుపోయి రైలు పది నిమిషాలు ఆగింది. ఇదీ చదవండి: వందే భారత్ రైలు ఘటన.. గేదెల యజమానులపై కేసు -
దేశ భవితను తీర్చిదిద్దేది నగరాలే
అహ్మదాబాద్: భారత్ భవిష్యత్‌ను నగరాలే తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చడానికి నగరాలే కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వాణిజ్య డిమాండ్‌కి అనుగుణంగా కొత్త నగరాలను దేశంలో నిర్మిస్తున్నామని చెప్పారు. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి మహారాష్ట్రలో ముంబై మధ్య నడిచే సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్, అహ్మాదాబాద్ మెట్రో రైలు ఫేజ్–1ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం అక్కడికి వచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. గాంధీనగర్–అహ్మదాబాద్ జంట నగరాలుగా మారి అద్భుతమైన అభివృద్ధిని సాధించాయన్నారు. ‘‘మారుతున్న కాలానికి తగ్గట్టుగా నగరాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోని నగరాల్లో అధికంగా దృష్టి సారించి పెట్టుబడులు భారీగా పెడుతున్నాము. వచ్చే 25 ఏళ్లలో ఈ నగరాలే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుపుతాయి’’ అని మోదీ అన్నారు. నగరాల అభివృద్ధితో పాటు ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్ సిటీలుగా రూపురేఖలు మార్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గాంధీ నగర్లో ఉదయం 10.30 గంటలకి మోదీ పచ్చ జెండా ఊపి వందేభారత్ రైలుని ప్రారంభించారు. ఆ తర్వాత అదే రైల్లో నగరంలోని ఆహ్మదాబాద్‌లోని కాలూపూర్ రైల్వేస్టేషన్ వరకు మోదీ ప్రయాణించారు. ‘‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రధాని మోదీ ప్రయాణించారు. రైల్వే సిబ్బంది కుటుంబసభ్యులు, మహిళా వ్యాపారవేత్తలు, యువతీయువకులు ఆయన తోటి ప్రయాణికులుగా ఉన్నారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దేశంలో ఇది మూడో వందేభారత్ రైలు. 2019లో మొట్టమొదటి రైలు న్యూఢిల్లీ–వారణాసి మధ్య ప్రారంభం కాగా, రెండో రైలు న్యూఢిల్లీ–శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా మార్గంలో ప్రారంభమైంది. అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో ఒక అంబులెన్స్‌కి దారి ఇవ్వడానికి ఆయన కాన్వాయ్‌ని నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవచ్ టెక్నాలజీతో భద్రతా వ్యవస్థ వందేభారత్ రైలులో రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదాన్ని నివారించడానికి దేశీయ కవచ్ టెక్నాలజీని వినియోగించారు. పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయంతో పాటు ఆటోమేటిక్ తలుపులు, ప్రతీ సీటు దగ్గర మొబైల్ చార్జింగ్ పాయింట్లు,అటెండెంట్‌ను పిలవడానికి కాల్ బటన్, బయో టాయిలెట్లు, సీసీ కెమెరాలున్నాయి. గంటకి 160 కి.మీ. గరిష్ట వేగంతో రైలు ప్రయాణించగలదు. శుక్రవారం ఈ రైలు అయిదున్నర గంటల్లో ముంబైకి చేరింది. -
సెమీ హైస్పీడ్ రైలు దూసుకొస్తోంది!
సాక్షి, హైదరాబాద్ : సెమీ హైస్పీడ్ రైలు.. ఇది పట్టాలెక్కితే, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ రెండు ముఖ్య నగరాల మధ్య గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. రష్యన్ రైల్వేస్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం, సాధ్యాసాధ్యాలపై ఆ దేశ రైల్వే అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం కొద్ది రోజుల క్రితమే భారతీయ రైల్వే బోర్డుకు తుది నివేదికను అందజేసింది. దీనిపై రష్యన్ అధికారుల బృందం మూడు దఫాలుగా అధ్యయనం చేసింది. రెండేళ్ల క్రితం కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును రష్యన్ రైల్వేస్, భారతీయ రైల్వే 50:50 చొప్పున భరించేలా ఒప్పందం కుదిరింది. ట్రాక్ సామర్థ్యం పెంపు, వంతెనలు, ట్రైన్ నిర్మాణం తదితర అంశాలపై సమర్పించిన తుది నివేదికను ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉండటంతో ఏ క్షణంలోనైనా పనులు ప్రారంభం కావచ్చునని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు దశల్లో ప్రాజెక్టు.. సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మార్గాన్ని రెండు దశల్లో పూర్తి చేస్తారు. నాగ్‌పూర్ నుంచి బల్లార్ష వరకు, బల్లార్ష నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రాజెక్టు చేపడతారు. ఈ మార్గంలో 1770 బ్రిడ్రిలు, కల్వర్టులు ఉన్నట్లు రష్యన్ అధికారుల బృందం అంచనా వేసింది. వీటిలో వంద మీటర్ల పొడవైన పెద్ద బ్రిడ్జిలు 18 ఉన్నాయి. సెమీ హైస్పీడ్ రైలు వేగాన్ని తట్టుకొనేందుకు అనుగుణంగా ఈ వంతెనల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. ఇప్పుడున్న ట్రాక్ 80 – 120 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే తట్టుకోగలుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు రాకపోకలు సాగిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ, 7.50 గంటల వ్యవధిలో గమ్యం చేరుతోంది. మిగతా రైళ్లు గంటకు 60 – 80 కి.మీ. వేగంతో 10 గంటల్లో చేరుకుంటున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వందలాది రైళ్లకు గ్రాండ్ ట్రంక్ లైన్ అయిన సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య సెమీ హై స్పీడ్ కారిడార్ ఏర్పాటైతే, ప్రయాణికులకు అత్యధిక వేగంతో కూడిన రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ–లక్నో మధ్య మొట్ట మొదటిప్రైవేట్ రైలు తేజాస్ గంటకు 200 కి.మీ. వేగంతో నడుస్తోంది. సెమీ హైస్పీడ్ రైలు ప్రత్యేకతలు.. గంటకు ప్రయాణ వేగం - 200కి.మీ. సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య దూరం- 577కి.మీ. ప్రయాణ సమయం.. - 3గంటలు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం- రూ.3 వేల కోట్లు (అంచనా) నిర్మాణ లక్ష్యం- ఐదేళ్లు -
సమయం తక్కువ.. సౌకర్యాలు ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : వైష్ణోదేవి భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం సెమీ-హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గురువారం ప్రారంభించింది. ఢిల్లీ–కత్రా (జమ్మూకశ్మీర్) మధ్య ఎనిమిది గంటల పాటు ప్రయాణించనున్న ఈ రైలు గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. తక్కువ సమయంతో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చనున్న ఈ రైలులో వైఫై సదుపాయం, జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం ఇలా అనేక అధునాతనమైన సకల సదుపాయాలు ఉన్నాయి. (చదవండి: జమ్మూ కశ్మీర్‌కు భారీ బహుమతి: అమిత్ షా) ప్రత్యేకతలు ఇవే... ♦ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 16 ఏసీ చైర్ కార్ బోగీలు ఉన్నాయి. ఇందులో రెండు డ్రైవర్ కార్స్, రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ బోగీలు ఉన్నాయి. ♦ ప్రతి కోచ్‌లోనూ ఆటోమేటిక్ లైటింగ్ డోర్ సిస్టమ్‌తో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా బయో మరుగుదొడ్లు ఉన్నాయి. ♦ ఒక బోగీ నుంచి మరొక బోగీలోకి సులభంగా వెళ్లే విధంగా కోచ్‌లను రూపొందించారు. ♦ వాక్యూమ్ టాయిలెట్లు, హ్యాండ్ ఫ్రీ ట్యాప్స్, డ్రయర్లు, డిప్యూజ్డ్ లైటింగ్‌తో పాటు ప్రతి సీటుకు మొబైల్ చార్జింగ్ పాయింట్లు పెట్టారు. ♦ ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో సీట్లను 360 డిగ్రీల కోణంలో తిరిగేందుకు అనువుగా అమర్చారు. ♦ ప్రయాణికులకు తాము దిగబోయే స్టేషన్ల గురించి తెలిపేందుకు ప్రతి బోగీలో ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టారు. రైలు వేగం, ఇతర వివరాలు కూడా ఇందులో ఉంటాయి. సీసీ కెమెరాలు, అనౌన్స్మెంట్ సిస్టం కూడా ఉంది. ♦ అన్ని కోచ్‌ల తలుపులు గార్డ్ పర్యవేక్షణలో ఆటోమెటిక్‌గా తెరుచుకుని, మూసుకుంటాయి. దుమ్ము, ధూళి చొరబడని విధంగా వీటిని ఏర్పాటు చేశారు. ♦ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చెయిన్ లాగే వ్యవస్థ లేదు. ప్రయాణికులకు ఏదైనా సమస్య తలెత్తితే బటన్ నొక్కి గార్డ్‌కు సమాచారం అందించాలి. ♦ రాళ్ల దాడిని తట్టుకునే అద్దాలతో పొడవైన కిటికీలు ప్రతి కోచ్‌కు ఇరువైపుల ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బయటి దృశ్యాలను స్పష్టంగా చూడొచ్చు ♦ ఎక్కువ సామాను పెట్టుకునేందుకు వీలుగా లాగేజీ ర్యాకుల ఏర్పాటు చేశారు. ♦ జంతువులు రైలు కింద పడినప్పుడు పట్టాలు తప్పకుండా, ఎటువంటి నష్టం జరగకుండా ‘క్యాటిల్ గార్డ్’ ఉంచారు. ♦ రైలును శుభ్రం చేసేందుకు రసాయనాలకు బదులుగా నీళ్ల ఆధారిత సేంద్రియ ద్రావకాలు వాడతారు. అందుకే దీన్ని దేశంలోని మొదటి ‘గ్రీన్ ట్రైన్’గా పేర్కొంటున్నారు. -
పట్టాలెక్కని సెమీ హైస్పీడ్ కారిడార్
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రాజెక్టు పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఏళ్లకు ఏళ్లుగా కేవలం కాగితాలకే పరిమితమవుతున్న అనేక ప్రాజెక్టుల తరహాలోనే సెమీహైస్పీడ్ కారిడార్ సైతం సర్వేలకే పరిమితమైంది. మొదటి దశలో హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్, రెండో దశలో న్యూఢిల్లీ వరకు సెమీ హైస్పీడ్ కారిడార్ నిర్మించేందుకు నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం న్యూ ఢిల్లీ–వారణాసి మధ్య ప్రవేశపెట్టిన ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ తరహాలోనే హైదరాబాద్–నాగ్‌పూర్ నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైలు నడిపేందుకు రష్యన్ రైల్వేస్‌తో అధ్యయన ఒప్పందంకుదుర్చుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాన రైల్వే హబ్‌గా ఉన్న హైదరాబాద్ నుంచి సుమారు 584 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్‌పూర్ వరకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై రష్యన్ రైల్వే నిపుణులు సమగ్రమైన సర్వేలు నిర్వహించి నివేదికను అందజేయాల్సి ఉంది. అయితే రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటి వరకు దక్షిణమధ్య రైల్వేకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఇప్పటికీ ప్రాజెక్టు అధ్యయన దశలోనే ఉందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఓ వైపు న్యూ ఢిల్లీ–వారణాసి మధ్య సెమీ హైస్పీడ్ రైలు పరుగులు తీస్తుండగా, హైదరాబాద్–నాగ్‌పూర్ కారిడార్‌పై ఎలాంటి కదలిక లేకపోవడం, రెండేళ్లు దాటినా అధ్యయనం, సర్వేల దశను అధిగమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుత పరిణాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపైన సందిగ్ధం నెలకొంది. పెరగనున్న వేగం... ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి నాగ్‌పూర్ మీదుగా 22 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ మార్గంలోనే హైదరాబాద్–న్యూ ఢిల్లీ మధ్య రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లే ఈ ప్రధాన మార్గంలో సెమీహైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోయి, ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాలను అందజేసేందుకు అవకాశం లభిస్తుందని భావించారు. ట్రాక్‌లపైన రద్దీ, ఒత్తిడి కారణంగా ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం ఇప్పుడు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్లు మించడం లేదు. పలు ప్రాంతాల్లో రైళ్ల వేగం పూర్తిగా మందగిస్తోంది. ప్రయాణికుల రైళ్లతో పాటు, సరుకు రవాణా రైళ్లకు కూడా ఒకే ట్రాక్ ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా హైస్పీడ్ కారిడార్లను అభివృద్ధి చేసేందుకు గతంలోనే ప్రతిపాదనలు రూపొందించారు. హైదరాబాద్–నాగ్‌పూర్‌తో పాటు, ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కోల్కత్తా, ఢిల్లీ–వారణాసి, ఢిల్లీ–అమృత్సర్, చెన్నై–బెంగళూర్, తదితర మార్గాలను గుర్తించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి వరకు కూడా హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. మొత్తం 10 మార్గాల్లో హైస్పీడ్ కారిడార్లను ప్రతిపాదించినప్పటికీ ప్రస్తుతం న్యూ ఢిల్లీ–వారణాసి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దక్షిణాదిలో మొదట హైదరాబాద్–నాగ్‌పూర్ కారిడార్ పూర్తిచేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇంకా సర్వేల దశలోనే ఉండడం గమనార్హం. ఈ మార్గంలో సెమీ హైస్పీడ్ అందుబాటులోకి వస్తే ఈ రైళ్లు గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల పైగా వేగంతో దూసుకుపోతాయి. అతి తక్కువ సమయంలో గమ్యం చేరుకోవచ్చు. హైదరాబాద్–నాగ్‌పూర్ అనంతరం ఢిల్లీ వరకు కూడా సెమీ హైస్పీడ్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి న్యూ ఢిల్లీకి తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉన్నాయి. మరో 10 రైళ్లు వివిధ మార్గాల్లో హైదరాబాద్ మీదుగా న్యూ ఢిల్లీకి రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున 29 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతుంది. సెమీ హైస్పీడ్ వల్ల ఈ సమయం సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
పట్టాలపైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఢిల్లీ నుంచి వారణాసి వరకూ నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూపొందించడం వెనుక డిజైనర్లు, ఇంజనీర్ల కృషిని అభినందిస్తున్నానని ప్రధాని మోదీ ప్రశంసించారు. నాలుగున్నరేళ్ల తమ పాలనలో రైల్వేలను మెరుగుపరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. ఈ అత్యాదునిక రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో కేవలం 18 నెలల్లో తయారు చేయడం దేశానికి గర్వకారణమన్నారు. ట్రైన్‌ను ప్రారంభించిన అనంతరం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇతర అధికారులతో కలిసి కలియతిరుగుతూ రైలును పరిశీలించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ట్రైన్ 18కు ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పేరును నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈనెల 17 నుంచి ఢిల్లీ-వారణాసి మధ్య వారానికి ఐదు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లతో పాటు 16 ఏసీ కోచ్‌లుంటాయి. ఈ రైలులో ఒకేసారి 1128 మంది ప్రయాణీకులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు. అన్ని కోచ్‌ల్లో ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ వంటి అత్యాధునిక సదుపాయాలను అందుబాటులో ఉంచారు. తాజా వంటకాలను ప్రయాణీకులకు అందించేందుకు ప్రతి కోచ్‌లో పాంట్రీని ఏర్పాటు చేశారు. -
ట్రైన్ 18 ఇక ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’
న్యూఢిల్లీ: దేశీయంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలుకు కేంద్రం కొత్త పేరు పెట్టింది. ఇప్పటివరకూ ‘ట్రైన్ 18’గా వ్యవహరిస్తున్న ఈ రైలుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ అని నామకరణం చేసినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వారణాసి–ఢిల్లీ మధ్య ఈ రైలు పరుగులు పెడుతుందని వెల్లడించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూ.97 కోట్ల వ్యయంతో 16 బోగీలున్న ఈ రైలును నిర్మించిందని పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారత ఇంజనీర్లు 18 నెలల్లోనే పూర్తి ఏసీ సౌకర్యం ఉన్న ఈ రైలును అభివృద్ధి చేశారన్నారు. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉంటాయన్నారు. లోకోమోటివ్ల అవసరం లేకుండా నడిచే తొలి రైలుగా ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ చరిత్ర సృష్టించిందని గోయల్ తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద ప్రపంచస్థాయి ప్రమాణాలతో రైళ్లను నిర్మించగలమని ఈ ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’తో తేటతెల్లమయిందన్నారు. వారణాసి–ఢిల్లీ మధ్య పరుగులు పెట్టే ఈ రైలు కాన్పూర్, అలహాబాద్‌లో ఆగుతుందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనల ఆధారంగానే ఈ పేరును ఖరారు చేసినట్లు గోయల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ త్వరలోనే ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభిస్తారని ప్రకటించారు. ఈ తరహా రైళ్ల తయారీని వేగవంతం చేయాలని తాను రైల్వే బోర్డును కోరారనీ, దీనివల్ల రైళ్ల సగటు ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. -
ఇంజిన్ రహిత రైలు
చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరిన తొలి ఇంజిన్ రహిత రైలు ట్రైన్ 18. సోమవారం రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్విని లోహాని జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు.. మరిన్ని పరీక్షలు పూర్తిచేసుకున్న తరువాత శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. సెమీ హైస్పీడ్ రకానికి చెందిన ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. – కొరుక్కుపేట (చెన్నై) -
160 కి.మీ వేగం.. ఇండియా రైలు రెడీ..!!
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా రూపుదిద్దుకున్న తొలి సెమీ హైస్పీడ్ రైలు త్వరలో పరుగులు తీయనుంది. గంటకు దాదాపు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు ముఖ్య నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. సెమీ హైస్పీడ్ రైలుకు ప్రీమియం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌గా తీసుకురానున్నారు. రూ. 100 కోట్ల వెచ్చించి రూపొందించిన రైలు అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. మొత్తం 16 పెట్టెలు ఉండే ఈ రైల్లో ఒక్కొ కోచ్ నిర్మాణానికి రూ. 6 కోట్లు ఖర్చు చేశారు. వీటన్నింటిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో తయారు చేశారు. అచ్చూ ఇదే డిజైన్‌తో దిగుమతి చేసుకునే రైలు పెట్టెలకు వీటికంటే 40 శాతం తక్కువ ఖర్చు అవుతుందని ఐసీఎఫ్ జనరల్ మేనజర్ చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పేరుతో సెమీ హైస్పీడ్ రైలు పరుగులు పెడుతుందని వెల్లడించారు. -
పట్టాలెక్కిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు 'గతిమాన్ ఎక్స్‌ప్రెస్' పట్టాలెక్కింది. మంగళవారం ఉదయం రైల్వే మంత్రి సురేష్ ప్రభు జెండా ఊపి రైలును ప్రారంభించారు. దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు ఇది. ఈ తొలి హైస్పీడు రైలు ఢిల్లీ, ఆగ్రాల మధ్య పరుగులు పెడుతోంది. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రా స్టేషన్ మధ్య గల 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 100 నిముషాల్లో చేరుకోనుంది. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో బయలుదేరి, 11:40 నిమిషాలకు ఆగ్రా కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. గతిమన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం తప్ప మిగితా అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది. దీంతో 28 ఏళ్ల తర్వాత భారతీయ రైల్వే తన అత్యధిక వేగమైన రికార్డును తిరగరాసినట్లు అయింది. కాగా ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నడుస్తున్నది. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్‌లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. రైల్వే బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. -
పట్టాలెక్కనున్న సెమీ హై స్పీడ్ రైలు
న్యూ ఢిల్లీ: దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు.. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ఢిల్లీలో ప్రారంభించనున్నారు. రైల్వే బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్ లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విమానాల్లో మాదిరిగానే సేవికలను నియమిస్తున్నామని, ఆహార పదార్థాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని తెలిపారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రాలోని కాంట్ స్టేషన్ల మధ్య ప్రయాణించనున్న ఈ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో ఆరురోజులు(శుక్రవారం తప్ప) ప్రయాణికులకు సేవలందించనుంది.