160 కి.మీ వేగం.. ఇండియా రైలు రెడీ..!! | Semi High Speed Train To Hit Tracks In June | Sakshi
Sakshi News home page

160 కి.మీ వేగం.. ఇండియా రైలు రెడీ..!!

Published Fri, Mar 16 2018 5:10 PM | Last Updated on Fri, Mar 16 2018 5:10 PM

Semi High Speed Train To Hit Tracks In June - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా రూపుదిద్దుకున్న తొలి సెమీ హైస్పీడ్‌ రైలు త్వరలో పరుగులు తీయనుంది. గంటకు దాదాపు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు ముఖ్య నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. సెమీ హైస్పీడ్‌ రైలుకు ప్రీమియం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌గా తీసుకురానున్నారు.

రూ. 100 కోట్ల వెచ్చించి రూపొందించిన రైలు అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. మొత్తం 16 పెట్టెలు ఉండే ఈ రైల్లో ఒక్కొ కోచ్‌ నిర్మాణానికి రూ. 6 కోట్లు ఖర్చు చేశారు. వీటన్నింటిని చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌)లో తయారు చేశారు. అచ్చూ ఇదే డిజైన్‌తో దిగుమతి చేసుకునే రైలు పెట్టెలకు వీటికంటే 40 శాతం తక్కువ ఖర్చు అవుతుందని ఐసీఎఫ్‌ జనరల్‌ మేనజర్‌ చెప్పారు.

ఈ ఏడాది జూన్‌ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ పేరుతో సెమీ హైస్పీడ్‌ రైలు పరుగులు పెడుతుందని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement