సురక్షిత ప్రయాణానికి భద్రతా సిబ్బందే కీలకం | employees key role in railway safety, says AK Mittal | Sakshi
Sakshi News home page

సురక్షిత ప్రయాణానికి భద్రతా సిబ్బందే కీలకం

Published Sun, May 29 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

సురక్షిత ప్రయాణానికి భద్రతా సిబ్బందే కీలకం

సురక్షిత ప్రయాణానికి భద్రతా సిబ్బందే కీలకం

రైళ్ల నిర్వహణకు సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్ వెన్నెముక
ఎన్‌ఎఫ్‌ఐఆర్ జాతీయ సదస్సులో రైల్వేబోర్డు చైర్మన్ ఏకే మిట్టల్
 
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైళ్ల నిర్వహణలో, లక్షలాది మందికి సురక్షితమైన, పూర్తి భద్రత కలిగిన రవాణా సదుపాయాన్ని అందజేయడంలో సిగ్నలింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ (ఎస్‌అండ్‌టీ) విభాగం విధి నిర్వహణే అత్యంత కీలకమైందని రైల్వేబోర్డు  చెర్మైన్ ఏకే మిట్టల్ అన్నారు. ప్రపంచంలోనే రైల్వే నెట్‌వర్క్‌ను మించింది మరొకటి లేదని.. దీని ద్వారా ప్రజలు పూర్తి భద్రతతో ప్రయాణం చేయగలరని అన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రైల్వేమెన్ (ఎన్‌ఎఫ్‌ఐఆర్) ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ రైల్ కళారంగ్‌లో ‘భారతీయ రైల్వేలో భద్రత-సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్ విభాగం పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
 
 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన రైల్వే భద్రతా విభాగం కార్మికులకు పిలుపునిచ్చారు. రైళ్ల వేగాన్ని పెంచడం వల్ల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా మాట్లాడుతూ.. భద్రతా విభాగంలో పని చేస్తున్న సాంకేతిక సిబ్బంది తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి, అంచనా వేసుకోవడానికి ఇలాంటి సదస్సులు స్ఫూర్తినిస్తాయన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఎన్‌ఎఫ్‌ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య మాట్లాడుతూ.. భద్రతా విభాగంలో పని చేస్తున్న ఎస్‌అండ్‌టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తాము ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైల్వేబోర్డు అదనపు సభ్యులు అఖిల్ అగర్వాల్, దక్షిణమధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఏకే గుప్తా, ఎన్‌ఎఫ్‌ఐఆర్ అధ్యక్షులు గుమన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఆదాయం పెంచుకోవడమే ప్రాజెక్టుల లక్ష్యం
 ఈ సదస్సు కంటే ముందు సికింద్రాబాద్ రైల్‌నిలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో రైల్వేబోర్డు చైర్మన్ మిట్టల్ మాట్లాడారు. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. అనంతరం ఆయన సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే కేంద్ర ఆసుపత్రిలో 15 పడకల డయాలసిస్ విభాగాన్ని ప్రారంభించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement