సాక్షి, హైదరాబాద్: కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) కార్యదర్శి సంజయ్ కొఠారి మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఉద్యోగుల విభజన, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ కేడర్‌పై సమీక్షించనున్నారు. ఇప్పటికీ విభజనపై స్పష్టత లేని రాష్ట్ర పోలీసు అకాడమీకి సంబంధించిన అంశాలను చర్చిస్తారు.