sanjay kotari
-
'ఏపీకి సాయం చేయండని చెప్పండి'
విజయవాడ: ఉద్యోగుల విభజన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొఠారిని కోరారు. అడిగితేనే చేద్దాం అనుకునే వైఖరి మంచిది కాదని, సమన్యాయం లేని విభజనతో ప్రజల్లో కసి, ఆగ్రహం పెల్లుబికాయని అన్నారు. ఇందుకు అప్పటి అధికార కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేయాలని, దక్షిణాదిలో ఆదాయం సమకూర్చుకోవటంలో పొరుగురాష్ట్రాల స్థాయికి చేరేదాకా ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం సహాయపడాలని కోరారు. -
విభజనపై నేడు డీవోపీటీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) కార్యదర్శి సంజయ్ కొఠారి మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఉద్యోగుల విభజన, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేడర్‌పై సమీక్షించనున్నారు. ఇప్పటికీ విభజనపై స్పష్టత లేని రాష్ట్ర పోలీసు అకాడమీకి సంబంధించిన అంశాలను చర్చిస్తారు.