ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పుణే జిల్లా కలెక్టర్ సుహార్ దివాసే తనను వేధించారంటూ వాశిం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఓ అధికారి ధృవీకరించారు.
మహిళా పోలీసులు సోమవారం వాశింలోని ఖేద్కర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమె పుణే కలెక్టర్ సుహాస్ దివాసేపై ఫిర్యాదు చేశారు అని ఆ అధికారి తెలిపారు. అయితే..
గత రాత్రి 11 గం. సమయంలో ముగ్గురు మహిళా పోలీస్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి 1గం. టైంలో వెళ్లిపోయారు. పోలీసులు ఎందుకు వచ్చారనే దానిపై నిన్న మీడియా ముందు పూజా ఖేద్కర్ మరోలా స్పందించారు. తనకు పని ఉండి మహిళా పోలీసులను తానే పిలిచానని ఆమె చెప్పారు. అయితే ఆ పని ఏంటన్నది మాత్రం ఆమె చెప్పలేదు. ట్రెయినింగ్‌లో ఉంటూనే పూజా ఖేద్కర్ గొంతెమ్మ కోర్కెలు కోరడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలపై ఆమెను వాశింకు బదిలీ చేసింది కలెక్టర్ సుహార్ దివాసే.
మరోవైపు ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ.. రీకాల్ ఆదేశాలు జారీ చేసింది ముస్సోరీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. తక్షణమే ఆమెను వెనక్కి రావాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆమెపై చర్యల కోసమే ఆ ఉత్తర్వులు వెలువడి ఉంటాయనే చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment