
'నా వల్లే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చింది'
ముస్సోరీ: తన వల్లే ప్రముఖ కంప్యూటర్ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువ ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. దేశంలో సాంకేతికాభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని నాటి ప్రధాని వాజపేయికి సూచించనట్లు ఆయన వెల్లడించారు.
సెల్ఫోన్లు, ఇంటర్నెట్ వచ్చాక ఎగుమతులు బాగా పెరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. సివిల్స్కు పోటీ పడే వారంతా మేథావి విద్యార్థులే అని ఆయన అన్నారు. ప్రజా సేవ చేయాలనుకునే వారు సివిల్స్కు వస్తారన్నారు. కష్టపడితే డబ్బు సంపాదించడం అనేది అంత పెద్ద విషయమేమి కాదని చంద్రబాబు అన్నారు.