ఇందూరుకు 18 మంది ట్రెయినీ ఐఏఎస్‌లు! | nizamabad to Trainee IAS 18 people! | Sakshi
Sakshi News home page

ఇందూరుకు 18 మంది ట్రెయినీ ఐఏఎస్‌లు!

Published Sat, Feb 7 2015 4:43 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

nizamabad to Trainee IAS 18 people!

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : 2014వ బ్యాచ్‌కు చెందిన 18 మంది ట్రెయినీ ఐఏఎస్‌లు నిజామాబాద్ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాల కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు శుక్రవారం నిజామాబాద్‌కు చేరుకున్నారు. నిజామాబాద్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆధ్వర్యంలో ట్రెయినీ ఐఏఎస్‌లకు స్వాగతం పలికిన ఉన్నతాధికారులు మూడు రోజుల పర్యటనకు సం బంధించిన టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు.

మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో ట్రెయినీ ఐఏఎస్‌లకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. శనివారం నుంచి 18 మంది ట్రెయినీ ఐఏఎస్‌లు నాలుగు జట్లుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు.
 
ప్రభుత్వ పథకాల అమలుపై పరిశీలన
ముస్సోరీలో శిక్షణ పొందుతున్న 18 మంది 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లు మూడు రోజులపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పోలీసు, వైద్య ఆరోగ్య, విద్యా, అటవీశాఖ తదితర ప్రభుత్వశాఖ ల ఉన్నతాధికారులతో పరిచయం, క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కలిగేలా చూడాలని ఉన్నతాధికారు లు సూచించారు. దీంతో కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ట్రెయినీ ఐఏఎస్‌ల సందర్శన కోసం ఏర్పాట్లు చేయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ‘భారత్ దర్శన్’లో భాగంగా మూడు రోజుల పర్యటన కోసం ట్రెయినీ ఐఏఎస్‌లు నిజామాబాద్‌కు చేరుకున్నారు.

శనివారం నుంచి ఉపాధిహామీ, సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్నభోజనం తదితర పథకాల అమలును ప్రాం తాల వారీగా పరిశీలించనున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, గిరిజన, గతంలో తీవ్రవాద ప్రాబల్యం గల ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు. ప్రజల జీవన స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు ఐఏఎస్‌ల పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ నలుగురు లైజనింగ్ అధికారులను నియమించారు. తిరిగి సోమవారం నాందేడ్‌కు వెళ్తారు.
 
ట్రెయినీ ఐఏఎస్‌లు వీరే
స్టడీటూర్ కోసం వచ్చిన ట్రెయినీ ఐఏఎస్‌ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగు జట్లుగా జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో పర్యటించే ఐఏఎస్‌ల కోసం నలుగురు జి ల్లా ఉన్నతాధికారులను లైజన్ అధికారులను నియమిం చిన కలెక్టర్ పోలీసు బందోబస్తు కూడ ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు మహిళా ఐఏఎస్‌లు ఉన్నారు. మూ డు రోజుల పాటు జిల్లాలో పర్యటించే ట్రెయినీ ఐఏఎస్ ల్లో అదితి చౌదరి, అప్సనాఫర్వీన్, మనీషఖాత్రీ, డాక్టర్ సరితయాదవ్, పి.అంబముత్తన్, సకేత్‌మల్యీయ, ఫయి జ్ హక్, అహ్మద్ ముంతాజ్, సందీప్‌కుమార్, దివ్యన్షు జా, డాక్టర్ ఎద్దుల విజయ్, రిషివ్‌గుప్త, జయశీలన్, విక్ర మ్, అనిష్‌యాదవ్, అక్షయ్‌త్రిపాఠీ, రఘునందన్‌మూర్తి, అభిషేక్ ఆనంద్,  సందీప్‌కుమార్‌జాలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement