రావెల సుశీల్ కారు సీజ్ | Ravela Susheel Kumar's car seized | Sakshi
Sakshi News home page

రావెల సుశీల్ కారు సీజ్

Published Thu, Mar 10 2016 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

Ravela Susheel Kumar's car seized

బంజారాహిల్స్ : ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్(24) పోలీసు కస్టడీ గురువారం కూడా కొనసాగింది. ఆయనను బంజారాహిల్స్ పోలీసులు రెండో రోజు కూడా విచారించారు. ఈ నెల 3వ తేదీన రావెల సుశీల్ తన కారులో వెళ్తూ నడిచి ఇంటికి వెళ్తున్న ఫాతిమా బేగం అనే మహిళా టీచర్తో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. నిర్భయచట్టం కింద కేసు నమోదై ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

ఈ ఘటనలో మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆయనతోపాటు డ్రైవర్ రమేష్‌ను కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ రోజు ప్రయాణిస్తున్న కారు(ఏపీ 07 సీకే 1777)ను సీజ్ చేశారు. ఈ కారు నారాయణస్వామి పేరుపై ఉందని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. అయితే కొద్ది రోజులు వాడుకోవడానికి తన బంధువైన నారాయణ స్వామి నుంచి కారును తీసుకున్నట్లు సుశీల్ దర్యాప్తులో వెల్లడించారు. అయితే ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement