హీరోయిన్‌కు చేదు అనుభవం | bollywood heroind aditi rao has to go by walk to fashion show | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌కు చేదు అనుభవం

Published Mon, May 16 2016 10:52 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

హీరోయిన్‌కు చేదు అనుభవం - Sakshi

హీరోయిన్‌కు చేదు అనుభవం

హీరోయిన్లంటే నేల మీద కాలుపెట్టి ఎరగరు. పట్టు పరుపుల మీద తప్ప శయనించరు. మెట్లు దిగితే కారు ఎక్కాల్సిందే. కానీ, అలాంటి పొజిషన్‌లో ఉండి.. నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఓ బాలీవుడ్ హీరోయన్‌కు ఎదురైంది. తెలుగు గడ్డపై పుట్టి.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగుతున్న అదితి రావు నోయిడాలో నిర్వహిస్తున్న ఫ్యాషన్‌ షోకు నడిచి వెళ్లాల్సి వచ్చింది. రాంగ్ రూట్‌లో వస్తున్నందుకు ఆమె కారును పోలీసులు సీజ్ చేయడంతో ఇలా జరిగింది. నోయిడాలో అత్యంత ఖరీదైన సెక్టార్ 18లో కొత్తగా తెరిచిన మాల్‌లో నిర్వహించే ఫ్యాషన్ షోకు ఆమె వెళ్లాల్సి ఉంది. అదే సెక్టార్‌లోని ఓ ఫైవ్‌ స్టార్ హోటల్లో ఆమె ఉంది. అక్కడి నుంచి తన జాగ్వార్ కారులో ఆమె బయల్దేరగా, ఆమె సహాయకులు వెర్నా కారులో ఆమె వెంటే వెళ్లారు. అయితే.. త్వరగా వెళ్లాలన్న తొందరలో ఆమె డ్రైవర్ షార్ట్‌కట్ రూట్ తీసుకుని, రాంగ్ రూటులో నడపసాగాడు. అంతలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్ వీరి కారును ఆపారు.

ఆపేసరికి అందులో ఎవరున్నారో తనకు తెలియదని, అయినా అలా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆపానని ఆయన చెప్పారు. కాసేపటికే వెనకాల వెర్నాలో వచ్చిన సహచరులు.. అది బాలీవుడ్ సెలబ్రిటీ కారని, అందువల్ల వదిలేయాలని కోరారు. కానీ, పేపర్ వర్క్ పూర్తి కాకుండా కారును పంపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈలోపు వెనకాల వచ్చినవాళ్లు నానా హడావుడి చేసి, మాల్ యాజమాన్యానికి ఫోన్లు చేశారు. అటు నుంచి వెంటనే కారును పంపాలంటూ ఇన్‌స్పెక్టర్‌పై ఒత్తిడి వచ్చింది. అయినా ఇన్‌స్పెక్టర్ మాత్రం కామ్‌గా తన పనిచేసుకుంటున్నారు. ఈలోపు అదితి రావు కిందకు దిగి, నడుచుకుంటూ మాల్‌కు వెళ్లిపోయిందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement