మోడలింగ్ అంటే తేలిక కాదు | That will not be easy for modeling | Sakshi
Sakshi News home page

మోడలింగ్ అంటే తేలిక కాదు

Published Sat, Oct 24 2015 2:30 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మోడలింగ్ అంటే తేలిక కాదు - Sakshi

మోడలింగ్ అంటే తేలిక కాదు

బాలీవుడ్ మోడల్, కొరియోగ్రాఫర్ సాధనాసింగ్


రాజమండ్రి : ‘మోడలింగ్ అంటే నల్లేరుపై నడక అనుకోవడం సరికాదని, ఎన్నో కళ్లు చూస్తుండగా..ర్యాంప్‌పై హొయలొలికించడం అంతే తేలిక కాదని ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ మోడల్, కొరియోగ్రాఫర్ సాధనాసింగ్ అన్నారు. రాజమండ్రిలో జరగనున్న ‘మిస్ రాజమండ్రి’ పోటీల ఫైనలిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఆమెను ‘సాక్షి’శుక్రవారం పలకరించగా పలు విశేషాలను చెప్పారు. బ్యాంకు ఉద్యోగిని అయిన తాను 10 ఏళ్ల క్రితం మోడలింగ్‌లో ప్రవేశించి బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చానని, అవకాశాలు బాగున్నాయని చెప్పారు.

1500కి పైగా ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నానని, 2008లో మిస్ ఇండియా సౌత్ టైటిల్‌ను, యంగెస్ట్ సోషల్‌వర్క్ ఇన్ సౌత్ ఇనే కార్యక్రమానికి ఇటీవల బెస్ట్ అవార్డును అందుకున్నానని చెప్పారు. మోడలింగ్ రంగంలో ప్రస్తుతం అవకాశాలు బాగున్నాయని, అయితే ఇక్కడ రాణించడమంటే బుర్రతో పనేనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement