miss rajahmundry
-
‘చంద్ర’హాసం
∙సినీ రంగ ప్రవేశమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న యువతి ∙‘మిస్ రాజమహేంద్రవరం’గా ఎంపికతో తొలి విజయం సినీ రంగంలో ఓ వెలుగు వెలగాలనేది ఆమె లక్ష్యం. చిన్నప్పటి నుంచి డా¯Œ్సలో సత్తా చాటుతూ.. తన కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం షెల్టా¯ŒS హోటల్లో జరిగిన ‘మిస్ రాజమహేంద్రవరం’ పోటీల్లో మెరిసి.. ప్రథమ స్థానంలో నిలిచింది. – రంగంపేట కంటిపూడి పూర్ణచంద్ర. రంగపేటలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన కంటిపూడి శ్రీనివాసరావు, వీరవేణిల కుమార్తె. చిన్నప్పటి నుంచీ ఈమెకు డ్యా¯Œ్స అంటే ప్రాణం. సినిమాలంటే ఇష్టం. దాంతో స్కూల్, కాలేజ్ డేస్‌లో జరిగిన అనేక ప్రదర్శనల్లో పాల్గొనేది. విజేతగా నిలిచేది. ఆమె అభిరుచిని గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ప్రస్తుతం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఐటీలో తృతీయ సంవత్సరం చదువుతున్న పూర్ణచంద్ర తల్లిదండ్రులు, సోదరుడు నరేంద్ర, ఫ్రెండ్స్ యోగిత, నాగమణి, ప్రశాంతి, సింధు సహకారంతో గతేడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం షెల్టా¯ŒS హోటల్లో నిర్వహించిన మిస్ రాజమహేంద్రవరం పోటీల్లో పాల్గొంది. అక్కడ అందం, అభినయం ఉన్న 18 మంది అందాల యువతులతో పోటీపడి పూర్ణచంద్ర ‘మిస్ రాజమహేంద్రవరం’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాలు, కళాశాలలో నిర్వహించే పోటీల్లో సినీ పాటలకు డా¯Œ్స వేసి ప్రథమరాలుగా నిలిచాను. మిస్ రాజమండ్రి 2017 అవార్డు స్ఫూర్తితో త్వరలో అమరావతిలో జరగబోయే మిస్ ఏపీ పోటీల్లోనూ ప్ర«థమరాలిగా నిలవాలని సాధన చేస్తున్నా. మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో నటించాలని ఉంది. – కంటిపూడి పూర్ణచంద్ర, మిస్ రాజమహేంద్రవరం–2017, రంగంపేట -
మిస్ రాజమండ్రి–2017గా పూర్ణచంద్ర
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ఫ్యూచర్ ఆల్ హోమ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ రాజమండ్రి –2016 గ్రాండ్ ఫినాలేలో కె.పూర్ణచంద్ర కిరీ టాన్ని కైవసం చేసుకుంది. మొదటి రన్నరప్‌గా ప్రీతి, రెండో రన్నరప్‌గా హారిక నిలిచారు. స్థానిక షెల్టా¯ŒS హోటల్లో శనివారం రాత్రి గ్రాండ్ ఫినాలేలో రాజమహేంద్రవరానికి చెందిన 15 మంది యువతులు తలపడి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో హŸయలొలికించారు. పోటీలను తిలకించేందుకు వచ్చిన నగరవాసులకు న్యూ ఇయర్ జోష్ చూపించారు. ‘కందిరీగ’ హీరోయి¯ŒS అక్ష, ప్రముఖ మోడల్, హీరో మార్గాని భరత్, ప్రముఖ దర్శకుడు మల్లికార్జు¯ŒS(మల్లి) న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ట్రెడిషనల్, వెస్ట్రన్, ఫుల్ఫ్రాక్ రౌండ్లలో యువతులు తమ హంస నడకలతో ఆకట్టుకున్నారు. మిస్ పశ్చిమగోదావరిగా చించినాడకు చెందిన నంబూరి ప్రియాంక, మొదటి రన్నరప్‌గా జంగారెడ్డిగూడెంకు చెందిన షేక్ షబీనా, రెండో రన్నరప్‌గా శ్రావ్య వంకాయల, స్పెషల్ ఎంట్రీగా పాపికొండ ప్రవల్లిక ఎంపికయ్యారు. శ్రావణి, దివ్య ఫ్యాష¯ŒS డిజైనర్లుగా భారతి బెర్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. సీసీసీ ఛానల్, మోడలింగ్ ఫ్యాష¯ŒS స్టూడియో, బ్లూమ్స్ బ్యూటీపార్లర్, శ్రీశ్రీ నికేతన్, రాజేష్మింది ఫోటోగ్రఫీ, హోటల్ షెల్టా¯ŒSలు సహకారం అందించారని సాయిక్రియేటివ్ ఎంటర్ట్రై¯ŒSమెంట్స్ నిర్వాహకులు గొట్టిపాటి సాయి తెలిపారు. -
31న మిస్ రాజమండ్రి–2016 గ్రాండ్ఫినాలె
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): ఫ్యూచర్ ఆల్ ఆధ్వర్యంలో సాయి క్రియేటివ్ ఎంటర్టై¯ŒSమెంట్స్ నిర్వహిస్తున్న మిస్ రాజమండ్రి–2016 గ్రాండ్ ఫినాలే ఈనెల 31వ తేదీన హోటల్ షెల్టా¯ŒSలో సాయంత్రం ఆరు గంటల నుంచి జరుగుతుందని సంస్థ ఎండీ గొట్టిపాటిసాయి తెలిపారు. స్థానిక హోటల్ షెల్టా¯ŒSలో మిస్ రాజమండ్రి ఆడిష¯ŒS ఆదివారం నిర్వహించారు. ఈ ఆడిష¯ŒSలో 60 మంది యువతులు పాల్గొనగా 18మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి సాయి విలేకరులతో మాట్లాడుతూ ఫైనల్‌కు సెలక్ట్ అయిన యువతులకు హోటల్ షెల్టా¯ŒSలో ఈనెల 31వతేదీ వరకు కొరియోగ్రాఫర్ మోడల్ నీలోఫర్, ఫ్యాష¯ŒS డిజైనర్లు శ్రావణి, దివ్యల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తామన్నారు. వీరు 31 తేదీ సాయంత్రం గ్రాండ్ఫినాలే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మిస్ రాజమండ్రికి న్యాయనిర్ణేతలుగా వ్యాపారవేత్త స¯ŒSమోహ¯ŒSరెడ్డి, సినీ దర్శకుడు మల్లికార్జున్, హీరోయి¯ŒS అక్ష, మోడల్ మార్గాని భరత్ వ్యవహరిస్తారన్నారు. ఈకార్యక్రమానికి ఈవెంట్హెడ్గా భారతీబేరీ పనిచేస్తారని సాయి తెలిపారు. -
మోడలింగ్ అంటే తేలిక కాదు
బాలీవుడ్ మోడల్, కొరియోగ్రాఫర్ సాధనాసింగ్ రాజమండ్రి : ‘మోడలింగ్ అంటే నల్లేరుపై నడక అనుకోవడం సరికాదని, ఎన్నో కళ్లు చూస్తుండగా..ర్యాంప్‌పై హొయలొలికించడం అంతే తేలిక కాదని ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ మోడల్, కొరియోగ్రాఫర్ సాధనాసింగ్ అన్నారు. రాజమండ్రిలో జరగనున్న ‘మిస్ రాజమండ్రి’ పోటీల ఫైనలిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఆమెను ‘సాక్షి’శుక్రవారం పలకరించగా పలు విశేషాలను చెప్పారు. బ్యాంకు ఉద్యోగిని అయిన తాను 10 ఏళ్ల క్రితం మోడలింగ్‌లో ప్రవేశించి బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చానని, అవకాశాలు బాగున్నాయని చెప్పారు. 1500కి పైగా ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నానని, 2008లో మిస్ ఇండియా సౌత్ టైటిల్‌ను, యంగెస్ట్ సోషల్‌వర్క్ ఇన్ సౌత్ ఇనే కార్యక్రమానికి ఇటీవల బెస్ట్ అవార్డును అందుకున్నానని చెప్పారు. మోడలింగ్ రంగంలో ప్రస్తుతం అవకాశాలు బాగున్నాయని, అయితే ఇక్కడ రాణించడమంటే బుర్రతో పనేనని అన్నారు.