‘చంద్ర’హాసం
-
∙సినీ రంగ ప్రవేశమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న యువతి
-
∙‘మిస్ రాజమహేంద్రవరం’గా ఎంపికతో తొలి విజయం
సినీ రంగంలో ఓ వెలుగు వెలగాలనేది ఆమె లక్ష్యం. చిన్నప్పటి నుంచి డా¯Œ్సలో సత్తా చాటుతూ.. తన కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం షెల్టా¯ŒS హోటల్‌లో జరిగిన ‘మిస్ రాజమహేంద్రవరం’ పోటీల్లో మెరిసి.. ప్రథమ స్థానంలో నిలిచింది.
– రంగంపేట
కంటిపూడి పూర్ణచంద్ర. రంగపేటలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన కంటిపూడి శ్రీనివాసరావు, వీరవేణిల కుమార్తె. చిన్నప్పటి నుంచీ ఈమెకు డ్యా¯Œ్స అంటే ప్రాణం. సినిమాలంటే ఇష్టం. దాంతో స్కూల్, కాలేజ్ డేస్‌లో జరిగిన అనేక ప్రదర్శనల్లో పాల్గొనేది. విజేతగా నిలిచేది. ఆమె అభిరుచిని గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ప్రస్తుతం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఐటీలో తృతీయ సంవత్సరం చదువుతున్న పూర్ణచంద్ర తల్లిదండ్రులు, సోదరుడు నరేంద్ర, ఫ్రెండ్స్ యోగిత, నాగమణి, ప్రశాంతి, సింధు సహకారంతో గతేడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం షెల్టా¯ŒS హోటల్‌లో నిర్వహించిన మిస్ రాజమహేంద్రవరం పోటీల్లో పాల్గొంది. అక్కడ అందం, అభినయం ఉన్న 18 మంది అందాల యువతులతో పోటీపడి పూర్ణచంద్ర ‘మిస్ రాజమహేంద్రవరం’ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాలు, కళాశాలలో నిర్వహించే పోటీల్లో సినీ పాటలకు డా¯Œ్స వేసి ప్రథమరాలుగా నిలిచాను. మిస్ రాజమండ్రి 2017 అవార్డు స్ఫూర్తితో త్వరలో అమరావతిలో జరగబోయే మిస్ ఏపీ పోటీల్లోనూ ప్ర«థమరాలిగా నిలవాలని సాధన చేస్తున్నా. మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో నటించాలని ఉంది.
– కంటిపూడి పూర్ణచంద్ర,
మిస్ రాజమహేంద్రవరం–2017, రంగంపేట