first success
-
ISRO: ‘గగన’ విజయం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): మానవసహిత అంతరిక్ష ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ఆ ప్రయత్నంలో తొలి విజయం సాధించింది. విజయసోపానాల్లో తొలిమెట్టుగా భావిస్తున్న గగన్‌యాన్ ప్రాజెక్టు సన్నాహకాల్లో భాగంగా ఇస్రో చేపట్టిన మానవరహిత క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్) పరీక్ష విజయవంతమైంది. సతీష్ దవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక ఇందుకు వేదికైంది. ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 10 గంటలకు గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) వాహకనౌకను విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 16.9 కి.మీ.ల ఎత్తులో అందులోంచి క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌లు విడిపోయి వేర్వేరు పథాల్లో ప్రయాణించి బంగళాఖాతంలో సురక్షితంగా పడ్డాయి. క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను డ్రోగ్ పారాచూట్లు సురక్షితంగా సముద్రజలాలపై ల్యాండ్ అయ్యేలా చేశాయి. మానవసహిత ప్రయోగాలు చేపట్టినపుడు అందులోని వ్యోమగాములను క్రూ మాడ్యూల్ ఎలా సురక్షితంగా బయటపడేయగలదన్న అంశాన్ని పరీక్షించేందుకే ఈ ఎస్కేప్ మాడ్యూల్ పరీక్ష చేశారు. 17 కిలోమీటర్ల ఎత్తుకెళ్లి తిరిగి సముద్రంలోకి .. టెస్టు వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగాన్ని 10.10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు. ఇందులో భాగంగా సింగిల్ స్టేజీ ద్రవ ఇంధర రాకెట్(టీవీ–డీ1)పై క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్లను అమర్చారు. రాకెట్‌ను ప్రయోగించాక అత్యవసర స్థితి(అబార్ట్)ను సిములేట్ చేశారు. దీంతో రాకెట్ 11.7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌లు వేరువడటం ప్రారంభమైంది. రాకెట్ 16.6 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకున్నాక క్రూ ఎస్కేప్ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌లు రాకెట్ నుంచి విడివడి వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తూ బంగాళాఖాతంలో పడ్డాయి. అయితే క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను సేకరించే ఉద్దేశంతో అది సురక్షితంగా సముద్రంలో పడేలా తొలుత రెండు డ్రోగ్ పారాచూట్లు విచ్చుకుని నెమ్మదిగా కిందకు దిగేందుకు సాయపడ్డాయి. తర్వాత మరో పెద్ద పారాచూట్ విచ్చుకుని ల్యాండింగ్‌ను దిగి్వజయం చేసింది. సమీప సముద్ర జలాల్లో ప్రత్యేక లాంచీలో వేచి ఉన్న కోస్టల్ నేవీ బలగాలు ఆ మాడ్యూల్‌ను సురక్షితంగా శ్రీహరికోటకు చేర్చారు. అయితే మానవ సహిత గగన్‌యాన్ ప్రయోగాలు భవిషత్తులో చేయడానికి ఇలాంటి ప్రయోగాలు మరో మూడు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నాలుగోసారి క్రూ మాడ్యూల్లో వ్యోమగాములను పోలిన బొమ్మలను అమర్చి క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను పరీక్షిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత 2024 చివర్లో లేదా 2025 ప్రథమార్ధంలో మానవ సహిత ప్రయోగాలు చేయనున్నారు. గగన్‌యాన్ టీవీ–డీ1 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆనందం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మిషన్ డైరెక్టర్ శివకుమార్, డైరెక్టర్ సునీల్, వీఎస్ఎస్సి డైరెక్టర్ ఉన్ని కృష్ణన్నాయక్, డైరెక్టర్ నారాయణ పాల్గొన్నారు. గగన్‌యాన్ సాకారం దిశగా మరింత చేరువకు: ప్రధాని మోదీ ‘టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)’ పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘ ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టు సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు’ అంటూ వారిని అభినందిస్తూ ప్రధాని మోదీ శనివారం ట్వీట్లు చేశారు. మొదట తడబడినా.. మొదట శుక్రవారం రాత్రి ఏడింటికి మొదలైన 13 గంటల కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 8 గంటలకు ముగిశాక ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో శనివారం తెల్లవారుజామున వర్షం పడడంతో వాతావరణం అనుకూలించని కారణంగా కౌంట్‌డౌన్ సమయాన్ని మరో 30 నిమిషాలు పెంచారు. తర్వాత 15 నిమిషాల వ్యవధిలోనే అంటే 8.15 గంటలకు రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేసి 8.45గంటలకు కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు. హఠాత్తుగా ఇంజన్‌ను మండించే ప్రక్రియలో లోపం తలెత్తింది. దీంతో రాకెట్ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లకుండా ఆగిపోయింది. దీంతో ప్రయోగాన్ని ఆటో మేటిక్ లాంచ్ సీక్వెన్స్‌లోని ఆన్ బోర్డు కంప్యూటర్ ఆపేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రయోగం వాయిదా వేసినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అయితే దీన్ని సవాల్‌గా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తల టైగర్ సేఫ్టే బృందం వెంటనే లాంచ్ ప్యాడ్ వద్దకు వెళ్లి సాంకేతిక లోపాన్ని సరిచేసింది. దీంతో మళ్లీ 9.33 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఎట్టకేలకు 10.03 గంటలకు గగన్‌యాన్ టీవీ–డీ1 విజయవంతంగా ప్రయోగించారు. 10 నిమిషాల 10 సెకన్లలో మొత్తం ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. -
‘చంద్ర’హాసం
∙సినీ రంగ ప్రవేశమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న యువతి ∙‘మిస్ రాజమహేంద్రవరం’గా ఎంపికతో తొలి విజయం సినీ రంగంలో ఓ వెలుగు వెలగాలనేది ఆమె లక్ష్యం. చిన్నప్పటి నుంచి డా¯Œ్సలో సత్తా చాటుతూ.. తన కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం షెల్టా¯ŒS హోటల్లో జరిగిన ‘మిస్ రాజమహేంద్రవరం’ పోటీల్లో మెరిసి.. ప్రథమ స్థానంలో నిలిచింది. – రంగంపేట కంటిపూడి పూర్ణచంద్ర. రంగపేటలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన కంటిపూడి శ్రీనివాసరావు, వీరవేణిల కుమార్తె. చిన్నప్పటి నుంచీ ఈమెకు డ్యా¯Œ్స అంటే ప్రాణం. సినిమాలంటే ఇష్టం. దాంతో స్కూల్, కాలేజ్ డేస్‌లో జరిగిన అనేక ప్రదర్శనల్లో పాల్గొనేది. విజేతగా నిలిచేది. ఆమె అభిరుచిని గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ప్రస్తుతం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఐటీలో తృతీయ సంవత్సరం చదువుతున్న పూర్ణచంద్ర తల్లిదండ్రులు, సోదరుడు నరేంద్ర, ఫ్రెండ్స్ యోగిత, నాగమణి, ప్రశాంతి, సింధు సహకారంతో గతేడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి రాజమహేంద్రవరం షెల్టా¯ŒS హోటల్లో నిర్వహించిన మిస్ రాజమహేంద్రవరం పోటీల్లో పాల్గొంది. అక్కడ అందం, అభినయం ఉన్న 18 మంది అందాల యువతులతో పోటీపడి పూర్ణచంద్ర ‘మిస్ రాజమహేంద్రవరం’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాలు, కళాశాలలో నిర్వహించే పోటీల్లో సినీ పాటలకు డా¯Œ్స వేసి ప్రథమరాలుగా నిలిచాను. మిస్ రాజమండ్రి 2017 అవార్డు స్ఫూర్తితో త్వరలో అమరావతిలో జరగబోయే మిస్ ఏపీ పోటీల్లోనూ ప్ర«థమరాలిగా నిలవాలని సాధన చేస్తున్నా. మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో నటించాలని ఉంది. – కంటిపూడి పూర్ణచంద్ర, మిస్ రాజమహేంద్రవరం–2017, రంగంపేట -
వెండి తెరపై తరుణోదయం
పెళ్లిచూపులు సినిమా దర్శకుడు మనోడే యువతకు స్ఫూర్తినిస్తున్న దాస్యం తరుణ్‌భాస్కర్ తొలి చిత్రంతోనే విజయం నమోదు సినిమా రూపంలో క్యాంపస్ అంపశయ్య నవల నాలుగు భాషల్లో తాజాగా విడుదల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓరుగల్లు వెలుగులు మళ్లీ విరజిమ్ముతున్నాయి. వరంగల్ కళాకారుల చిత్రాలతో ఈ వారం బాక్సాఫీసు కళకళలాడుతోంది. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన దాస్యం తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన తొలిచిత్రం ‘పెళ్లిచూపులు’ రెండు తెలుగు రాష్ట్రాలు, యూఎస్‌లో పాజిటివ్ టాక్ సాధించింది. మరో వైపు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ రచించిన ‘క్యాంపస్ అంపశయ్య’ నవలకు వెండితెర రూపం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల వ్యవధిలో విడుదలై ఈ రెండు చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సాక్షి, హన్మకొండ : జిల్లాకు చెందిన కళాకారులు రూపొందించిన చిత్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఒకరు షార్ట్ఫిల్్మలతో వెండితెరకు పరిచయమై సినీ రంగంలో రాణిస్తుండగా.. మరొకరు ప్రముఖ నవలాకారుడిగా సాహితీ ప్రపంచంలో వెలుగొందుతున్నారు. వారిది భిన్నమైన మార్గం హన్మకొండ వడ్డేపల్లిలోని దాస్యం కుటుంబం ఏళ్ల తరబడి రాజకీయాల్లో కొనసాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దివంగత నాయకుడు దాస్యం ప్రణయ్‌భాస్కర్ యువజన క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన తమ్ముడు దాస్యం వినయ్‌భాస్కర్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అలాగే ఆయన మరో తమ్ముడు దాస్యం విజయ్‌భాస్కర్ ఇటీవల కార్పొరేటర్‌గా గెలుపొంది రాజకీయంగా ముందుగు సాగుతున్నారు. కాగా, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సోదరుడు ఉదయ్‌భాస్కర్ కుమారుడు తరుణ్‌భాస్కర్ సినిమా రంగంలో సత్తాచాటుతున్నారు. అందుకు తగినట్లుగా సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై మెలకువలను నేర్చుకుంటూ వచ్చారు. వయా షార్ట్ఫిల్్మ్స చిన్నతనం నుంచే తరుణ్‌భాస్కర్‌కి కళారంగంపై మక్కువ ఎక్కువ. పాఠశాల స్థాయిలోనే చిత్రలేఖనం, వ్యాసరచన, ఫొటోగ్రఫీ తదితర పోటీల్లో బహుమతులు సాధించారు. 2010లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించారు. అయితే సినిమా రంగం లో తన ప్రతిభను చాటేందుకు తరుణ్ భాస్కర్ షార్ట్ఫిల్్మ్స రూపకల్పనను వేదికగా చేసుకున్నారు. ఈ మేరకు వినూత్న గీత మీడి యా పేరుతో సొంతంగా ష్టార్ట్ఫిల్్మ్స తీయడం ప్రారంభించారు. 20–20 ఆఫ్ సినిమా, సైన్మా, అనుకోకుండా, తరుణ్ ఫ్రం తెలుగు మీడియం... వంటì చిత్రాలను తీశారు. వీటికి యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. అయితే తరుణ్‌భాస్కర్ రూ పొందించిన ‘అనుకోకుండా’ షార్ట్‌ఫిల్మ్ కేన్స్ ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్ షార్ట్‌లిస్టుకు ఎంపికైంది. దీంతో తరుణ్‌పై వెండితెర పెద్దలు ఆరా తీశారు. అనుకోకుండా.. పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ ప్రతిభను నలువైపులా చాటిన షార్ట్‌ఫిల్మ్ అనుకోకుండా..! ఇందులో మరో వారం రోజుల్లో పెళ్లి చూపులు ఉన్నాయనగా ఒక యువతికి ఒక యువకుడు పరిచయం కావడం... తర్వాత జరిగిన పరిణామాలు ఇతివృత్తం. అయితే ఈ షార్ట్ఫిల్్మనే సినిమాకు తగినట్లుగా కథను రూపొందించారు. తెలుగు చలనచిత్ర రంగంలో మూవీ మెఘల్గా పరిగణించే దగ్గుబాటి రామానాయుడు స్థాపించిన సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ కథతో తరుణభాస్కర్ దర్శకత్వంలో సినిమా తీసేందుకు ముందుకు వచ్చింది. ఎనిమిది నెలల క్రితం సినిమా షూటింగ్ మొదలైంది. ఈ క్రమంలో గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై తొలి రోజు నుంచే ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా సినీ విమర్శకులు సైతం తరుణ్‌భాస్కర్ దర్శకత్వం ప్రతిభపై ప్రశంసల జల్లు కురి పించారు. సున్నిత భావోద్వేగాలను, సహజంగా, హస్యంగా చిత్రీకరించిన తీరుపై మెచ్చుకున్నారు. తొలి సినిమా ఆర్థిక విజయం సాధించడంతో విక్టరీ వెంకటేశ్, మంచులక్ష్మీ వంటి ప్రముఖులు తరుణ్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.