మిస్‌ రాజమండ్రి–2017గా పూర్ణచంద్ర | miss rajahmundry purnachandra | Sakshi
Sakshi News home page

మిస్‌ రాజమండ్రి–2017గా పూర్ణచంద్ర

Published Sat, Dec 31 2016 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

miss rajahmundry purnachandra

ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) :
ఫ్యూచర్‌ ఆల్‌ హోమ్స్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్‌ రాజమండ్రి –2016 గ్రాండ్‌ ఫినాలేలో కె.పూర్ణచంద్ర కిరీ టాన్ని కైవసం చేసుకుంది. మొదటి రన్నరప్‌గా ప్రీతి, రెండో రన్నరప్‌గా హారిక నిలిచారు. స్థానిక షెల్టా¯ŒS హోటల్‌లో శనివారం రాత్రి గ్రాండ్‌ ఫినాలేలో రాజమహేంద్రవరానికి చెందిన 15 మంది యువతులు తలపడి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో హŸయలొలికించారు. పోటీలను తిలకించేందుకు వచ్చిన నగరవాసులకు న్యూ ఇయర్‌ జోష్‌ చూపించారు. ‘కందిరీగ’ హీరోయి¯ŒS అక్ష, ప్రముఖ మోడల్, హీరో మార్గాని భరత్, ప్రముఖ దర్శకుడు మల్లికార్జు¯ŒS(మల్లి) న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ట్రెడిషనల్, వెస్ట్రన్, ఫుల్‌ఫ్రాక్‌  రౌండ్‌లలో యువతులు తమ హంస నడకలతో ఆకట్టుకున్నారు. మిస్‌ పశ్చిమగోదావరిగా చించినాడకు చెందిన నంబూరి ప్రియాంక, మొదటి రన్నరప్‌గా జంగారెడ్డిగూడెంకు చెందిన షేక్‌ షబీనా, రెండో రన్నరప్‌గా శ్రావ్య వంకాయల, స్పెషల్‌ ఎంట్రీగా పాపికొండ ప్రవల్లిక ఎంపికయ్యారు.  శ్రావణి, దివ్య ఫ్యాష¯ŒS డిజైనర్లుగా భారతి బెర్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. సీసీసీ ఛానల్, మోడలింగ్‌ ఫ్యాష¯ŒS స్టూడియో, బ్లూమ్స్‌ బ్యూటీపార్లర్, శ్రీశ్రీ నికేతన్, రాజేష్‌మింది ఫోటోగ్రఫీ, హోటల్‌ షెల్టా¯ŒSలు సహకారం అందించారని సాయిక్రియేటివ్‌ ఎంటర్‌ట్రై¯ŒSమెంట్స్‌ నిర్వాహకులు గొట్టిపాటి సాయి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement