మంగళూరు : కరోనా వల్ల ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విదేశాల నుంచి వెనక్కు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సైతం స్వస్థలాలకు పంపించేస్తున్నారు. ఈ క్రమంలో వెనక్కు వస్తున్న వారివల్ల కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్ నుంచి మంగళూరుకు చేరుకున్న విమానంలో 20 మంది కరోనా సోకినట్లు తేలిందని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. 179 మంది ప్రయాణికులతో కూడిన విమానం మంగళవారం దుబాయ్ నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. (కర్ణాటకలో కరోనా కలకలం.. అతడి కోసం గాలింపు)
వీరిలో 38 మంది గర్భిణీ మహిళలు కూడా ఉన్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం మిగతా ప్రయాణీకులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించింది. బాధితుల్లో 15 మంది దక్షిణ కన్నడ జిల్లాకు చెందినవారు కాగా ఆ జిల్లాలో కేసుల సంఖ్య 43కు చేరింది. కరోనా సోకిన మిగతా ఐదుగురు ఉడిపివాసులు కాగా వీరి సంఖ్యను కలుపుకుని ఆ జిల్లాలో కరోనా కేసుల మొత్తం 8కు చేరింది. కాగా శుక్రవారం ఉదయం నాటికి జిల్లాలో 1032 కేసులు నమోదవగా 476 మంది కోలుకున్నారు. 35 మంది మరణించారు.(ప్రాణాల మీదకు తెచ్చిన టిక్‌టాక్)
Comments
Please login to add a commentAdd a comment