‘చంద్రభంగ’పై వేలాడే వంతెన
పుణే : ప్రముఖ పుణ్యక్షేత్రం పండర్పూర్ వద్ద ఉన్న చంద్రభంగ నదిపై వేలాడే వంతెన (హ్యాంగింగ్ బిడ్జ్) నిర్మించనున్నట్లు పండర్పూర్ డవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) తెలిపింది. అలాగే నదికి మూడు కిలోమీటర్ల పరిధిలో ‘దర్శన్ బారీ కాంప్లెక్స్’ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. ‘షోలాపూర్ జిల్లాలోని పురాతన పుణ్యక్షేత్రం పండర్పూర్లోని విఠల్, రుక్మాయ్ దేవాలయాన్ని సందర్శించేందుకు ఏటా జూన్-జూలై మధ్య రాష్ర్టం నుంచే కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ఈ తీర్థయాత్ర సమయంలో ప్రజలకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తీర్థయాత్రను ‘వారి’ అంటా రు’ అని పండర్పూర్ సబ్ డివిజనల్ అధికారి సంజయ్ తేలి అన్నా రు. వంతెన నమూనాకు ఆమోదం తెలిపే ముందు రిషీకేష్‌లోని లక్ష్మణ్ ఝూలా, సియోల్‌లోని హన్ బ్రిడ్జి, మౌంట్ టిట్లిస్ సస్పెన్షన్ బ్రిడ్జి, ఈఫిల్ టఫర్ లిఫ్టులపై అధ్యయనం చేపట్టినట్లు తెలిపారు. హ్యాంగింగ్ బ్రిడ్జి కోసం రూ.400-500 కోట్ల వరకు ఖర్చవనుందని వివరించారు.