యాదాద్రి కొండపై ప్రధానాలయం ఆవరణలో కూచిపూడి నృత్యం చేస్తున్న విద్యార్థులు
యాదగిరిగుట్ట: తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా రాంపల్లిలోని సాంస్కృతిక విశ్వ కళామండలి, కళాచైతన్య వేదిక వ్యవస్థాపకుడు రాంనర్సయ్య ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన కూచిపూడి నృత్య ఉపా«ధ్యాయిని హవిష సమక్షంలో 50 మంది విద్యార్థులు ఆరు గంటలపాటు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు.
యాదాద్రీశుడు, వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయాలకు సంబంధించిన పాటలకు నృత్యం చేశారు. అలాగే పేరిణి నాట్యం ప్రదర్శించి భళా అనిపించుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూచిపూడి, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పేరిణి నృత్యాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment