ఈ త్రివేణి 'నాట్యం'లో మేటి | A Girl Performing Good Dances Of Kuchipudi, Bharathanatyam In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఈ త్రివేణి 'నాట్యం'లో మేటి

Published Sun, Jul 21 2019 12:12 PM | Last Updated on Sun, Jul 21 2019 12:12 PM

A Girl Performing Good Dances Of Kuchipudi, Bharathanatyam In Visakhapatnam - Sakshi

సాక్షి, విజయనగరం : నృత్యం చిన్నారులకు దేవుడిచ్చిన వరం. చిన్నప్పటి నుంచి నిష్ణాతులైన గురువుల వద్ద  శిక్షణ ఇప్పిస్తే మెలకువలు నేర్చుకుంటారు. పెద్దయ్యాక నాట్యంలో రాణిస్తారు. వేదికలపై అలరిస్తారు. దీనికి గొట్లాం గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని బోడసింగి త్రివేణి నిదర్శనం. చిన్నవయసులోనే నాట్యంలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో అవార్డులు కైవసం  చేసుకుంటోంది. విద్యల నగరమైన విజయనగరం జిల్లా ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేస్తోంది. ఓ వైపు చదువులో ప్రతిభ చూపుతూ మరోవైపు కూచిపూడి, భరతనాట్యంలో కీర్తనలకు అడుగులు కదిపి అలరిస్తోంది. 

చక్కని ప్రతిభ... 
త్రివేణి కూచిపూడి, భరతనాట్యంలో నాలుగేళ్ల  సర్టిఫికేట్‌ కోర్సును పూర్తిచేసింది. పదవర్ణం, థిల్లానా, శబ్దం, అష్టపదులు అద్భుతంగా చేస్తూ అందరిమన్ననలు అందుకుంటోంది. కూచిపూడిలో బ్రహ్మాంజలి, భామా కలాపం, కొలువైతివా.. జతిస్వరం, థిల్లానాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి త్రివేణి నాట్యంపై ఉత్సాహం చూపడంతో తల్లిదండ్రులు బి.అప్పలనారాయణ, లక్ష్మిల నర్తనశాల డాక్టర్‌ భేరి రాధికారాణి వద్ద శిక్షణ ఇప్పిస్తున్నారు. నాటినుంచి నేటి వరకు ఎనిమిదేళ్ల పాటు ఆమె వద్దనే శిక్షణ పొందుతూ వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఇప్పటి వరకు సుమారు వెయ్యికిపైగా ప్రదర్శనలిచ్చిన త్రివేణి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. 

జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ
జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో త్రివేణి విశేష ప్రతిభ కనబరుస్తోంది. జిల్లాలో ఎక్కడా ఎటువంటి కార్యక్రమమైనా తమ బృందం తరఫున ప్రధా న పాత్ర వహిస్తూ, గురువుల సారథ్యంలో అద్భుతమైన ప్రతిభను కనబరచి అందరిమన్ననలు అందుకుంటోంది. రాజస్థాన్, శ్రీకాళహస్తి, విజయవాడ, భు వనేశ్వర్, హైదరాబాద్, గుణుపూర్, బొబ్బిలి, సాలూ రు, శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, తుని, తిరుపతి, భద్రాచలం,  ఇలా ఆంధ్ర రాష్ట్రమంతా ప్రదర్శనలిస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. 

పశంసలు, రికార్డులు

  • ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది నామ సంవత్సవ వేడుకల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శనతో అవార్డును సొంతం చేసుకుంది.
  • గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా) సంస్థ నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది
  • ఎలయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆçహూతుల ప్రశంసలందుకుంది.
  • విజయనగర ఉత్సవ్,  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టూరిజం మ్యూజిక్‌ అండ్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌లో త్రివేణి నృత్యం  చూపరులను కట్టిపడేసింది.
  • యూనివర్సల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో త్రివేణి నృత్యానికి చోటు దక్కింది.
  • డివిజనల్‌ యూత్‌ ఫెస్టివల్, గురజాడ 154వ జయంతి, శిల్పారామం, ఇంటర్నేనేషనల్‌ యూత్‌ డే, స్వామి వివేకానంద జయంతి వేడుకలులో ఇచ్చిన ప్రదర్శనలకు ప్రశంసపత్రాలు, మన్ననలు అందుకుంది. 
  • విశాఖరత్న కళాపరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో త్రివేణి ప్రతిభకు నృత్యరత్న అవార్డు వరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement