5 నిమిషాల పర్ఫామెన్స్‌కు 5 కోట్లు | Priyanka Charging 5 Cr for 5 min performance | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 16 2017 12:39 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

Priyanka Charging 5 Cr for 5 min performance - Sakshi

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. గత రెండేళ్లుగా బాలీవుడ్ కు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలు, టీవీ సీరీస్ లతో బిజీ బిజీగా ఉంది. అదే సమయంలో పలు అంతర్జాతీయ అవార్డు ఫంక్షన్లలోనూ సందడి చేస్తోంది. రెండేళ్ల తరువాత ఓ బాలీవుడ్ వేడుకకు హాజరు కానుంది ప్రియాంక.. అంతేకాదు ఈ వేడుకలో పర్ఫామ్ కూడా చేయనుంది. జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు అంగీకరించింది ప్రియాంక చోప్రా.

ఈ నెల 19న జరగనున్న ఈ వేడుకలో ప్రియాంక 5 నిమిషాల పాటు డ్యాన్స్ చేయనుందట. అయితే ఈ పర్ఫామెన్స్ కు గానూ ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రియాంకకున్న గ్లోబల్ ఇమేజ్, అంతర్జాతీయ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ కారణంగా అంత పారితోషికం ఇచ్చేందుకు జీ మీడియా ముందుకొచ్చిందట. రెండేళ్ల తరువాత ఈ బ్యూటీ బాలీవుడ్ వేడుకలో సందడి చేయనుండటంతో ఆమె పర్ఫామెన్సే... షోకు హైలెట్ గా నిలువనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement