Shanmukh Jaswanth Answer On Deepthi Sunaina Dance Plus Performance Trolling, Shanmukh Reaction Goes Viral - Sakshi
Sakshi News home page

'దీప్తి సునయన డ్యాన్స్‌'..ఇంత కన్నా దారుణాలు తట్టుకున్నా: షణ్ముఖ్‌

Published Mon, May 24 2021 8:05 PM | Last Updated on Tue, May 25 2021 8:59 AM

Shanmukh Answer To Trolls On Deepthi Sunaina Dance Performance - Sakshi

సోషల్‌ మీడియాలో దీప్తి సునయన- షణ్ముఖ్‌ జశ్వంత్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట డ్యాన్స్‌ వీడియోలతో బాగా పాపులర్‌ అయిన ఈ జంట ఆ తర్వాత డబ్‌స్మాష్‌, కవర్‌ సాంగ్స్‌ వీడియోలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ఆన్‌ స్క్రీన్‌ పెయిర్‌గానే కాకుండా ఆఫ్‌ స్క్రీన్‌లోనూ వీరిద్దరి కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. అయితే బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో పాల్గొన్న దీప్తిపై విపరీతమైన నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే. హౌస్‌లోని మరో కంటెస్టెంట్‌తో ప్రేమాయణం నడుపుతుందంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. దీంతో వీరిద్దరి బ్రేకప్‌ అయిపోయిందని, వీరి లవ్‌ కహానీకి శుభం కార్డు పడిందని వార్తలు వచ్చినా అవి కేవలం పుకార్లేనని చెబుతూ ఇద్దరూ కలిసి కొన్ని ఫోటో షూట్స్‌లోనూ కనిపించారు. 

తాజాగా దీప్తి సునయన ఓ ప్రముఖ డ్యాన్స్‌ షోలో పాల్గొంది. ఫినాలే ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌కు జోడీగా రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేసింది. ఆమె చేసిన ఈ పర్ఫామెన్స్‌పై సోషల్‌ మీడియాలో నెటిజన్లు భగ్గుమన్నారు. దీప్తి సునయన ఇలా రెచ్చిపోయిందేంటి అంటూ దారుణంగా ట్రోల్స్‌ చేశారు. అంతేకాకుండా షణ్ముఖ్‌ ఫేమస్‌ డైలాగ్‌ అరె..ఏంట్రా ఇది అంటూ దీప్తిపై ట్రోల్స్‌, మీమ్స్  నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లతో లైవ్‌ చాట్‌ నిర్వహించిన షణ్ముక్‌కు నెటిజన్లు నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీప్తి డ్యాన్స్‌పై వచ్చిన  ట్రోల్స్‌పై మీ రియాక‌్షన్‌ ఏంటి  అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా..కొత్తగా ఏం అనిపించలేదు.. ఇంత కన్నా దారుణాలు తట్టుకున్న గుండె ఇది.. ఇవి అన్నీ ఎంత అంటూ తన స్టైల్లో ఆన్సర్‌ ఇచ్చాడు. ప్రస్తుతం షణ్ముఖ్‌ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి : ఒకే ఇంట్లో షణ్ముఖ్‌-దీప్తి సునయన ఫోటోలు వైరల్‌
'దీప్తి సునయన -షణ్ముఖ్‌ పెళ్లి అప్పుడే ఉండొచ్చు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement