కరాచీ : పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు విధించిన మూడేళ్ల నిషేదాన్ని 3 సంవత్సరాల నుంచి 18 నెలలకు తగ్గించడం పట్ల పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అక్మల్ విషయంలో కనికరించిన పీసీబీ నా విషయంలో మాత్రం ఏం పట్టింపులేనట్లు వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ' జీరో-టాలరెన్స్ విధానం నాపై మాత్రమే వర్తిస్తుందని, పాకిస్తాన్‌లోని ఇతర ఆటగాళ్లకు మాత్రం వర్తించదు. కేవలం మతం కారణంగా నేను వివక్షకు గురయ్యా. మ్యాచ్ ఫిక్సింగ్ విధానాన్ని నివేదించడంలో విఫలమైనందుకు ఉమర్ అక్మల్‌కు క్రికెట్ నుంచి మూడేళ్ల నిషేధం 18 నెలలకు తగ్గించబడింది.. అంటే అతను వచ్చే ఏడాది ఆగస్టులో తిరిగి ఆటలోకి తిరిగి వస్తాడు. నాకు జీవిత నిషేధం విధించడానికి గల కారణాన్ని ఎవరైనా సమాధానం చెప్పగలరా.నా రంగు, మతం, బ్యాక్ గ్రౌండ్ కారణంగా నాకు ఈ విధానాలు వరిస్తాయి. అయితే నేను హిందువును అందుకు నేను గర్వంగా ఉన్నాను' అని డానిష్ కనేరియా తెలిపాడు.('ఆ మ్యచ్ ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా')
2012లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతుండగా.. డానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో కనేరియా అప్పటినుంచీ ఎలాంటి క్రికెట్ ఆడడం లేదు. 2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నేరాన్ని అంగీకరించాడు. అయినా పీసీబీ తనపై కనికరం చూపడం లేదంటూ చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువు అయినందున పాక్ బోర్డు తన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని బాహాటంగానే ఆరోపించాడు. ఈ విషయం అప్పుట్లో పెద్ద దుమారమే రేపింది.
Comments
Please login to add a commentAdd a comment