కరాచీ: ఇటీవల కాలంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పాక్ క్రికెటర్లు గతాన్ని తవ్వుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ క్రికెట్ హెడ్ కోచ్ మిస్బావుల్ హక్‌ను ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ విమర్శించగా, ఇమ్రాన్ ఖాన్, అక్రమ్‌లపై బాసిత్ అలీ మండిపడ్డాడు. తాజాగా డానిష్ కనేరియా-ఫైజల్ ఇక్బాల్‌ల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ సోహైల్ తన్వీర్ స్పందించాడు. పాకిస్తాన్ క్రికెట్‌లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై పెదవి విప్పాడు.
సోషల్ మీడియా వేదికగా ఇలా బహిరంగ విమర్శలు చేసుకోవడం మంచిది కాదని హితవు పలికాడు. అందరికీ తెలిసేలా ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే పాకిస్తాన్ క్రికెట్‌కు చెడ్డ పేరు రావడమే కాకుండా, చులకనగా మారిపోతామన్నాడు. ఈ విషయంలో మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ‘ ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేసుకోవడం పాకిస్తాన్ క్రికెట్‌కు దురదృష్టకర పరిణామం. సోషల్ మీడియాను ఉపయోగించినప్పుడు బాధ్యతగా ఉండాలని తెలియదా. బహిరంగా విమర్శలు పాకిస్తాన్ క్రికెట్‌పై ఎంతటి ప్రభావన్ని చూపుతుందో అర్థం కావడం లేదు. కనీసం ఆలోచనే లేకుండా ఇలా వీధికెక్కడం వల్ల ఉపయోగం ఏమిటి. చాలా జుగుప్సాకరంగా ఉంది.
మీరు ఎప్పుడైనా ఒకర్ని ఒకరు కలవాల్సి వచ్చినప్పుడు ఇది చాలా చిరుగ్గా అనిపిస్తుంది. మీకు మీరే చిన్నబుచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఎవరికైనా విభేదాలు సోషల్ మీడియాలో కానీ ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు కానీ వెల్లడించవద్దు. అది మిమ్మల్ని చులకనగా చేస్తుంది. మిగతా ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటారు. పాక్ క్రికెటర్లు చిల్లర మాటలు ఆపండి’ అని తన్వీర్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ తరఫున రెండు టెస్టులు మాత్రమే ఆడిన తన్వీర్ సోహైల్ 62 వన్డేలు, 57 అంతర్జాతీయ టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో పాకిస్తాన్ తరఫున సోహైల్ ఆడాడు.
చదవండి:
నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?
డీకాక్ స్థానం ఎవరిది.. ఇంకా నో క్లారిటీ!
Comments
Please login to add a commentAdd a comment