Sohail Tanvir
-
పాత గొడవను గుర్తుచేసి కౌంటర్ ఇద్దామనుకున్నాడు.. బెడిసికొట్టింది
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022)లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తనకు చేసిన అవమానాన్ని గుర్తుతెచ్చుకున్న బ్యాట్స్‌మన్ సదరు బౌలర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అయితే చివరికి ఆ ప్లాన్ తనకే బెడిసి కొట్టింది. ఆ బ్యాట్స్‌మన్ ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ అయితే.. బౌలర్ పాకిస్తాన్ క్రికెటర్ సోహైల్ తన్వీర్. చదవండి: IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! విషయంలోకి వెళితే.. 2018లో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తన్వీర్ గయానా అమెజాన్ వారియర్స్ తరపున.. బెన్ కటింగ్ సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ తరపున ప్రాతినిధ్యం వహించారు. కాగా బెన్ కటింగ్‌ను ఔట్ చేసిన తర్వాత సోహైల్ తన్వీర్ కటింగ్‌ను చూస్తూ తన రెండు చేతులతో మిడిల్ ఫింగర్ చూపించాడు. దీనిని బెన్ కటింగ్ నాలుగేళ్లుగా మనసులో పెట్టుకున్నాడని తాజా ఘటనతో అర్థమైంది. మంగళవారం రాత్రి పెషావర్ జాల్మీ, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా పెషావర్ జాల్మి ఇన్నింగ్స్ సమయంలో తన్వీర్ వేసిన 19వ ఓవర్లో బెన్ కటింగ్ మూడు సిక్సర్లతో హోరెత్తించాడు. ఆ తర్వాత తన్వీర్వైపు తిరిగి రెండు చేతులు పైకెత్తి మిడిల్ ఫింగర్ చూపించి నాలుగేళ్ల క్రితం తనకు జరిగిన అవమానాన్ని సరిచేశానని భావించాడు. ఇది ఇంతటితో ముగిసిపోలేదు. నసీమ్ షా వేసిన చివరి ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి బెన్ కటింగ్ బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద తన్వీర్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక తన్వీర్ ఊరుకుంటాడా.. వెంటనే తన రెండు చేతులు పైకెత్తి మిడిల్ ఫింగర్ చూపించి దెబ్బకు దెబ్బ తీశాడు. ఆ విధంగా తన్వీర్.. కటింగ్‌పై మరోసారి పైచేయి సాధించినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: కేన్ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ.. ఇక మ్యాచ్‌లో పెషావర్ జాల్మి 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ 58, తలాత్ 51, బెన్ కటింగ్ 36 పరుగులు చేశాడు. క్వెటా గ్లాడియేటర్స్ బౌలింగ్‌లో నసీమ్ షా 4 వికెట్లు తీశాడు. కుర్రమ్ షెహజాద్, గులామ్ ముదస్సార్, ఇఫ్తికార్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. విల్ స్మీద్ 99 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. అయితా మిగతావారు పెద్దగా రాణించకపోవడంతో క్వెటా ఓటమిపాలైంది. The entire Sohail Tanvir vs Ben Cutting battle. From 2018 to 2022. pic.twitter.com/XuV18PyiZ3 — Haroon (@hazharoon) February 15, 2022 -
లంక ప్రీమియర్ లీగ్ క్రికెటర్లకు కరోనా
కొలంబో : మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)ను కరోనా వైరస్ తాకింది. లీగ్‌లో క్యాండీ టస్కర్స్ ఫ్రాంచైజీకి చెందిన పాకిస్తాన్ ప్లేయర్ సొహైల్ తన్వీర్, కొలంబో కింగ్స్ జట్టు సభ్యుడు, కెనడా బ్యాట్స్‌మన్ రవీందర్‌పాల్ సింగ్ ఇద్దరూ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ టోర్నీ కోసం శ్రీలంక చేరిన ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో వీరిద్దరూ పాజిటివ్‌గా తేలారు. దీంతో కనీసం రెండు వారాల పాటు లీగ్‌కు దూరం కానున్నారు. ఈ నెల 26న ఎల్పీఎల్ తొలి సీజన్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ లీగ్ నుంచి స్టార్ క్రికెటర్లు క్రిస్ గేల్, లసిత్ మలింగ, సర్ఫరాజ్ అహ్మద్, రవి బొపారా తదితరులు వైదొలిగారు. -
‘పాక్ క్రికెటర్లు.. చిల్లర మాటలు ఆపండి’
కరాచీ: ఇటీవల కాలంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పాక్ క్రికెటర్లు గతాన్ని తవ్వుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ క్రికెట్ హెడ్ కోచ్ మిస్బావుల్ హక్‌ను ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ విమర్శించగా, ఇమ్రాన్ ఖాన్, అక్రమ్‌లపై బాసిత్ అలీ మండిపడ్డాడు. తాజాగా డానిష్ కనేరియా-ఫైజల్ ఇక్బాల్‌ల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ సోహైల్ తన్వీర్ స్పందించాడు. పాకిస్తాన్ క్రికెట్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై పెదవి విప్పాడు. సోషల్ మీడియా వేదికగా ఇలా బహిరంగ విమర్శలు చేసుకోవడం మంచిది కాదని హితవు పలికాడు. అందరికీ తెలిసేలా ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే పాకిస్తాన్ క్రికెట్‌కు చెడ్డ పేరు రావడమే కాకుండా, చులకనగా మారిపోతామన్నాడు. ఈ విషయంలో మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ‘ ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేసుకోవడం పాకిస్తాన్ క్రికెట్‌కు దురదృష్టకర పరిణామం. సోషల్ మీడియాను ఉపయోగించినప్పుడు బాధ్యతగా ఉండాలని తెలియదా. బహిరంగా విమర్శలు పాకిస్తాన్ క్రికెట్‌పై ఎంతటి ప్రభావన్ని చూపుతుందో అర్థం కావడం లేదు. కనీసం ఆలోచనే లేకుండా ఇలా వీధికెక్కడం వల్ల ఉపయోగం ఏమిటి. చాలా జుగుప్సాకరంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఒకర్ని ఒకరు కలవాల్సి వచ్చినప్పుడు ఇది చాలా చిరుగ్గా అనిపిస్తుంది. మీకు మీరే చిన్నబుచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఎవరికైనా విభేదాలు సోషల్ మీడియాలో కానీ ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు కానీ వెల్లడించవద్దు. అది మిమ్మల్ని చులకనగా చేస్తుంది. మిగతా ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటారు. పాక్ క్రికెటర్లు చిల్లర మాటలు ఆపండి’ అని తన్వీర్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ తరఫున రెండు టెస్టులు మాత్రమే ఆడిన తన్వీర్ సోహైల్ 62 వన్డేలు, 57 అంతర్జాతీయ టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో పాకిస్తాన్ తరఫున సోహైల్ ఆడాడు. చదవండి: నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..? డీకాక్ స్థానం ఎవరిది.. ఇంకా నో క్లారిటీ! -
వికెట్ తీసి.. వేళ్లతో అసభ్య సంజ్ఞ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : పాకిస్తాన్ పేస్‌బౌలర్ సోహైల్ తన్వీర్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం ఆట అంటూ మండిపడుతున్నారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయాన అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ పాక్ బౌలర్ గురువారం కిట్టిస్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రీడాస్పూర్తిని మరిచి ప్రవర్తించాడు. ఇదే అతనిపై అభిమానుకులకు ఆగ్రహం తెప్పించింది. పాట్రియోట్స్ బ్యాట్స్‌మన్ బెన్ కట్టింగ్‌ను ఔట్ చేసిన ఆనందంలో సోహైల్ తన్వీర్ హద్దులు దాటి ప్రవర్తించాడు. రెండు వేళ్లతో అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. మాజీ క్రికెటర్లు సైతం సోహైల్‌ను తప్పుబడుతున్నారు. చిన్నపిల్లలు సైతం మ్యాచ్ చూస్తారని మైదానంలో మీ చర్యలను అనుకరిస్తే పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు. సోహైల్ చర్యల పట్ల మ్యాచ్ రిఫరీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతం విధిస్తూ జరిమానా విధించారు. -
అభిమానుకులకు ఆగ్రహం తెప్పించింది...!
-
4 ఓవర్లు.. 3 పరుగులు.. 5 వికెట్లు!
బ్రిడ్జ్‌టౌన్: పాకిస్తాన్ క్రికెటర్ సొహైల్ తన్వీర్ మరోసారి మెరిశాడు. వెస్టిండీస్‌లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అద్భుతం చేశాడు. గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడుతున్న తన్వీర్ తన పదునైన బౌలింగ్‌తో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మంగళవారం బార్బడోస్ ట్రైడెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. 4 ఓవర్లలో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన నాలుగు ఓవర్లలో ఒక వైడు బాల్ మాత్రమే వేశాడు. ఒక ఓవర్లో పరుగులేమి ఇవ్వలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన బార్బడోస్ టీమ్ తన్వీర్ ధాటికి 13.4 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. 99 పరుగుల తేడాతో బార్బడోస్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. 5 వికెట్లు తీసి వారియర్స్‌కు విజయాన్ని అందించిన తన్వీర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తన్వీర్ సృష్టించిన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన తన్వీర్ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. జైపూర్‌లో 2008, మే 4న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు.