4 ఓవర్లు.. 3 పరుగులు.. 5 వికెట్లు! | Sohail Tanvir rips through Barbados Tridents | Sakshi
Sakshi News home page

4 ఓవర్లు.. 3 పరుగులు.. 5 వికెట్లు!

Published Wed, Aug 30 2017 3:17 PM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

4 ఓవర్లు.. 3 పరుగులు.. 5 వికెట్లు!

4 ఓవర్లు.. 3 పరుగులు.. 5 వికెట్లు!

బ్రిడ్జ్‌టౌన్‌‌: పాకిస్తాన్‌ క్రికెటర్‌ సొహైల్‌ తన్వీర్ మరోసారి మెరిశాడు. వెస్టిండీస్‌లో జరుగుతున్న కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో అద్భుతం చేశాడు. గయానా అమెజాన్‌ వారియర్స్‌ తరపున ఆడుతున్న తన్వీర్‌ తన పదునైన బౌలింగ్‌తో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మంగళవారం బార్బడోస్‌ ట్రైడెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. 4 ఓవర్లలో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన నాలుగు ఓవర్లలో ఒక వైడు బాల్‌ మాత్రమే వేశాడు. ఒక ఓవర్‌లో పరుగులేమి ఇవ్వలేదు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన బార్బడోస్‌ టీమ్‌ తన్వీర్‌ ధాటికి 13.4 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. 99 పరుగుల తేడాతో బార్బడోస్‌ జట్టు చిత్తుగా ఓడిపోయింది. 5 వికెట్లు తీసి వారియర్స్‌కు విజయాన్ని అందించిన తన్వీర్‌కు 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌' దక్కింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో తన్వీర్‌ సృష్టించిన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున ఆడిన తన్వీర్‌ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. జైపూర్‌లో 2008, మే 4న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement