
సోహైల్ తన్వీర్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : పాకిస్తాన్ పేస్‌బౌలర్ సోహైల్ తన్వీర్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం ఆట అంటూ మండిపడుతున్నారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయాన అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ పాక్ బౌలర్ గురువారం కిట్టిస్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రీడాస్పూర్తిని మరిచి ప్రవర్తించాడు. ఇదే అతనిపై అభిమానుకులకు ఆగ్రహం తెప్పించింది.
పాట్రియోట్స్ బ్యాట్స్‌మన్ బెన్ కట్టింగ్‌ను ఔట్ చేసిన ఆనందంలో సోహైల్ తన్వీర్ హద్దులు దాటి ప్రవర్తించాడు. రెండు వేళ్లతో అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. మాజీ క్రికెటర్లు సైతం సోహైల్‌ను తప్పుబడుతున్నారు. చిన్నపిల్లలు సైతం మ్యాచ్ చూస్తారని మైదానంలో మీ చర్యలను అనుకరిస్తే పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు. సోహైల్ చర్యల పట్ల మ్యాచ్ రిఫరీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతం విధిస్తూ జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment